Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 22nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఆస్తి పంచేస్తున్న లక్ష్మీ.. మౌనంగా జాను.. మనీషా, దేవయానికి ఇది అసలైన పండగే!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode ఆస్తి జానుకి ఇచ్చేయాలని లక్ష్మీ నిర్ణయించుకొని లాయర్‌ని పిలిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 22nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఆస్తి పంచేస్తున్న లక్ష్మీ.. మౌనంగా జాను.. మనీషా, దేవయానికి ఇది అసలైన పండగే! Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today january 22nd episode written update in telugu Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 22nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఆస్తి పంచేస్తున్న లక్ష్మీ.. మౌనంగా జాను.. మనీషా, దేవయానికి ఇది అసలైన పండగే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/22/9f3ef9458ad3023332aabb0ddd4f830d1737519060339882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ తన భర్త మిత్రకు నలుగు స్నానం చేయిస్తుంటే జాను వివేక్‌ని తీసుకొచ్చి స్నానం చేయించడానికి రెడీ అవుతుంది. వేడి నీరు తీసుకురావడానికి వెళ్లి చేయి కాల్చుకుంటుంది. లక్ష్మీ పరుగున వెళ్లి ఏడుస్తూ సేవలు చేస్తుంది. వెన్న పూస్తానని తీసుకురావడానికి వెళ్తుంది. లక్ష్మీని చూసి జాను కూడా ఏడ్చేస్తుంది. మనీషా, దేవయాని దూరం నుంచి చూస్తుంటారు.
మిత్ర: అక్కతో పోటీ పడటం కాదు జాను మీ అక్క ప్రేమని అర్థం చేసుకో. మీ మధ్య వాటాలు సరిచేసేది వీలునామాలు కాదు. మీ మధ్య ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ మాత్రమే. నీకు చిన్న దెబ్బ తగలగానే మీ అక్క నన్ను వదిలేసి నీ దగ్గరకు వచ్చింది. ఇది కూడా వీలునామాలో లేదు జాను.
వివేక్: అవును జాను కనిపించే ప్రేమలు కనిపించే వీలునామాలు కాదు వదిన నీపై చూపిస్తుంది అక్క ప్రేమ కాదు అమ్మ ప్రేమ. లక్ష్మీ వచ్చి వెన్న పూస్తుంది.
మనీషా: చూస్తుంటే వాళ్లు జానుని మార్చేసేలా ఉన్నారు.
దేవయాని: అది మారిపోతే కష్టం మనీషా ఏదో ఒకటి చేద్దాం పద. ఏంటి జాను చేయి కాలిపోయిందా. అలా ఎలా కాల్చుకున్నావ్.
మనీషా: జాను ఈ ఊరు రాగానే తనకు సిటీలో జరిగిన అవమానాలు మర్చిపోయింది. అక్క మీద ప్రేమ పెంచుకుంటుంది
దేవయాని: నువ్వు కరిగిపోయావా జాను.
మనీషా: జానుని మళ్లీ తన గ్రిప్‌లో పెట్టుకోవడానికి లక్ష్మీ ప్లాన్ చేసింది అందుకే ఏ అవకాశం దొరికినా వాడుకుంటుంది.
దేవయాని: నిజమా జాను ఆస్తి వాటా తీసుకుంటా అన్నావ్ ఇప్పుడు ఏంటి ఇదంతా. జాను మన బతుకులు మారవా నువ్వు వంట మనిషిగా వివేక్ ఆఫీస్‌లో కూలీవాడిలా బతకాల్సిందేనా.
మనీషా, దేవయాని ఇద్దరూ జానూని రెచ్చగొడతారు. పొలం కోసమే వచ్చాను ఆస్తిలో వాటా అడుగుతాను అని జాను చెప్తుంది. చట్ట ప్రకారం అడిగితే బెటర్ అని లాయర్‌తో అడిగించమని దేవయాని అంటుంది. జాను లాయర్‌ని పిలిపించి అడిగిస్తాను అంటుంది. ఇప్పుడే వెళ్లి అక్కతో మాట్లాడుతాను అని వెళ్తుంది. లక్ష్మీ గది దగ్గరకు జాను వెళ్తుంది. అక్కడ లక్ష్మీ చీర ఐరన్ చేస్తూ జాను కోసం ఆలోచించి చీర మర్చిపోతుంది. మిత్ర వచ్చి లక్ష్మీ అని గట్టిగా అరిచి ఆపుతాడు. ఇద్దరూ జాను గురించి మాట్లాడుకుంటారు. జాను వాటా ఆస్తి పంచేస్తాను అని లక్ష్మీ మిత్రతో చెప్తుంది. ఇక జాను ఆస్తి కోసం ఎలా అడగాలా అని ఆలోచిస్తుంది. మనీషా, దేవయానిలు వెళ్లి మళ్లీ రెచ్చగొట్టి వెళ్లి అడగమని అంటారు.
ఇక మిత్ర లక్ష్మీతో నీకు ఇవ్వడం తప్ప ఇంకేం రాదని అందుకే నీకు తెలీకుండా లాయర్‌ని పిలిపించానని చెప్తాడు. దానికి లక్ష్మీ మిత్రతో నా మనసు బాగా అర్థం చేసుకున్నారని అంటుంది. మిత్ర మనసులో ఇందులో నా స్వార్థం ఉందని మీ అక్కాచెల్లెళ్లను కలపడానికి ఇలా చేస్తున్నాను అని అనుకుంటాడు. లక్ష్మీ దగ్గరకు జాను వెళ్లి మాట్లాడాలి అంటే ముఖ్యమైన పని ఉందని మిత్ర, లక్ష్మీలు చెప్తారు. దాంతో మనీషా, దేవయానిలు మళ్లీ జానుని రెచ్చగొడతారు. కావాలనే మీ అక్క ఇలా చేసిందని ఇక మీ అక్కతో మాట్లాడటం ఎందుకు లాయర్‌నే పిలవమని చెప్తుంది. జాను ఇప్పుడే లాయర్‌తో మాట్లాడుతానని వెళ్తుంది. ఇంతలో మిత్ర పిలిచిన లాయర్ వస్తారు. మనీషా, దేవయాని, జానులు చూసి షాక్ అవుతారు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు.
పెద్దాయన: ఇప్పుడు లాయర్ ఎందుకమ్మా
లక్ష్మీ: ఆస్తి పంపకాలు చేయడానికి.
వివేక్: ఎవరి ఆస్తి వదిన
మిత్ర: మన ఆస్తి కాదురా ఈ అక్కాచెల్లెళ్లవి.
లక్ష్మీ: మేం పెద్దవాళ్లం అయ్యాం పెళ్లెళ్లు అయ్యావి ఆస్తు పంచుకుంటే మంచిది కదా అని.
వివేక్: పండగ అని వచ్చాం సంతోషంగా ఉండకుండా ఈ పంపకాలు ఎందుకు వదిన.
మిత్ర: తన వాటా తనకి ఇస్తే జాను కూడా హ్యాపీగా ఉంటుంది కదరా.
వివేక్: కానీ ఆ పొలం ముక్కలు అయిపోతుంది కదా
లక్ష్మీ: మనుషుల మనసులు ముక్కలు అయిపోవడం కంటే పొలం ముక్కలు అవడం ఇబ్బంది ఏం కాదు కలిసి ఉండి గొడవలు పడే కంటే ఆస్తి పంచుకొని కలిసి ఉండటం బెటర్. మిమల్ని అడగకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమించండి తాతయ్య.
పెద్దాయన: నేను అందుకు బాధ పడటం లేదమ్మా నీ మనసు ఎంత ముక్కలై ఉంటే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటావా అని ఆలోచిస్తున్నా.
లక్ష్మీ: మనసు ముక్కలై కాదు మనస్ఫూర్తిగా ఇస్తున్నా. ఉన్న వాళ్లు మనస్శాంతిగా లేనప్పుడు పోయిన వాళ్ల ఆత్మ శాంతి కోసం ఆలోచించడం తప్పు అనిపించింది. తాతయ్య మా మనసులో ఉంటే ఇక పొలంలో వెతుక్కోవడం ఎందుకు.
మనీషా: జాను మీ అక్క నీ మీద ప్రేమతో ఆస్తి పంచుతుంది హ్యాపీగా ఉండు. లక్ష్మీ ఆస్తిని సమానంగా పంచమని లాయర్‌తో చెప్తుంది. జాను మౌనంగా ఉండిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: కొత్త లవర్‌తో సత్య సరసాలు.. తలపట్టుకున్న క్రిష్.. అయ్యో పాపం అజ్ఞాతశక్తి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)