Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 13th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాతో ఒంటరిగా మిత్ర.. పెళ్లి చేసుకోవడానికి పెద్ద ప్లాన్.. దగ్గరుండి పంపిన లక్ష్మీ!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రను పెళ్లి చేసుకోవాలని మనీషా ప్లాన్ చేసి గుడికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode వివేక్ సీసీ టీవీ ఫుటేజ్ తీసుకుంటాడు. లక్ష్మీకి కాల్ చేసి నీ డౌట్ నిజం అయింది వదిన మనకు మంచి ఎవిడెన్స్ దొరికింది. మొత్తం మనీషా ప్లాన్ చేసింది.. దానికి తన ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారని అంటాడు. లక్ష్మీ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. జాను కాఫీ తీసుకొస్తే విషయం చెప్పి హ్యాపీగా ఫీలవుతుంది. ఇక కాఫీ తీసుకొని మిత్ర దగ్గరకు వెళ్తుంది. పిల్లలు లక్ష్మీతో మమల్ని రెడీ చేయ్ అంటే ఈ రోజు మీ నాన్న రెడీ చేస్తారు ఆయన్ను కిందకి తీసుకురండి అని చెప్తుంది.
లక్ష్మీ రాజేశ్వరి దేవితో మిత్ర కిందకి వస్తే ఆయన చిన్నతనం విషయాలు గుర్తు చేసి నవ్వించమని అంటుంది. పిల్లలు మిత్ర దగ్గరకు వెళ్తారు. తమని రెడీ చేయమని మిత్రని బలవంతంగా కిందకి తీసుకెళ్తారు. వివేక్ ఇంటికి వస్తాడు. సీక్రెట్‌గా లక్ష్మీకి పెన్‌డ్రైవ్ చూపిస్తాడు. ల్యాప్ టాప్ రెడీ చేయమని లక్ష్మీ వివేక్‌తో చెప్తుంది. ఏమై ఉంటుందా అని మనీషా, దేవయాని అనుకుంటారు. ఫంక్షన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారా అనుకుంటుంది. పిల్లలు మిత్రని తీసుకొని కిందకి వస్తారు. దేవయాని మనీషాని తీసుకొచ్చి మిత్ర పక్కన కూర్చొపెడుతుంది.
రాజేశ్వరిదేవి: ఏమే దేవం ఆ పిల్ల కూర్చొడానికి ఇంకా ప్లేసే లేదా మిత్ర పక్కన కూర్చొపెట్టావ్.
దేవయాని: అంటే ఇప్పుడు మనీషాకి అన్నీ మిత్రనే కదా అందుకే పక్కన కూర్చొపెట్టా. మిత్ర మనీషాని కోరుకున్నాడు. మనీషా ఒప్పుకోకతప్పుదు కదా. మిత్ర మామూలు మనిషి అవుతున్నాడు. మనీషా కూడా అవ్వాలి కదా.
దేవయాని: మిత్ర ఒక్కడికే కాఫీ తెచ్చావేంటి జాను మనీషాకి కూడా ఇవ్వు.
జాను: పాలు లేవు.
దేవయాని మిత్రతో సగం కాఫీ మనీషాకి ఇవ్వమని అంటుంది. కప్పు సాగర్‌లో మిత్రకు మనీషాకి కాఫీ ఇస్తుంది. దాంతో రాజేశ్వరి దేవి సాసర్‌లో కాఫీ కప్లో పోసి మనీషాకే తాగేయమని అంటుంది. లక్ష్మీ, వివేక్‌లు సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. అందులో మనీషా మిత్రని తీసుకెళ్లడం మాత్రమే ఉంటుంది. ఈ ఎవిడెన్స్ సరిపోవని లక్ష్మీ చెప్తుంది. గెస్ట్ హౌస్ దగ్గర వెతాకాలి అని మనీషాని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అంటుంది. ఇక మిత్రను ఆఫీస్‌కి తీసుకెళ్లమని లక్ష్మీ వివేక్‌తో చెప్తుంది.
రాజేశ్వరి దేవి లక్ష్మీ వాళ్లతో మిత్ర మనీషాకి తోడుగా గుడికి వెళ్తున్నాడని అంటుంది. దేవయాని మనీషాని గుడికి వెళ్లమని చెప్పిందని మిత్రకు తోడుగా వెళ్లమని చెప్పిందని ఒంటరిగా వదిలేస్తే మనీషా ఆత్మహత్య చేసుకుంటుందని బెదిరిస్తుంది. దాంతో మిత్ర గుడికి వెళ్లడానికి రెడీ అవుతాడు. మనీషా ఏదో ప్లాన్ చేసే ఇలా చేస్తుందని వివేక్ అంటే గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లుందని జాను అంటుంది. లక్ష్మీని కూడా గుడికి వెళ్లమంటారు. ఇక మనీషా దేవయానితో మిత్రతో తాళి కట్టించుకుంటానని అంటుంది. మనీషాతో గుడికి వెళ్తున్నా అని మిత్ర చెప్తే వెళ్లమని లక్ష్మీ అంటుంది. మనీషాని ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతుందని అనుకొని వెళ్తున్నా అని మిత్ర అంటాడు. లక్ష్మీ, మిత్ర గుడికి బయల్దేరుతారు. జయదేవ్ వచ్చి లక్ష్మీ మీద కోప్పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

