అన్వేషించండి

Lakshmi Sowbhagyavathi Serial Today December 18th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా బండారం బయట పెట్టేసిన సరయు పీఏ.. లక్ష్మీ చెడు గుడు ఖాయం!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా లక్ష్మీ, జయదేవ్ ఎంక్వైరీ చేసి హారం దొంగ మనీషా అని మిత్రకు చెప్పడానికి సిద్ధపడటంలో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode సీసీ టీవీ ఫుటేజ్ చూస్తానని లక్ష్మీ చెప్పిందని దేవయాని మనీషాతో చెప్తుంది. మనీషాని తీసుకొని సీసీ టీవీ ఫుటేజ్ లక్ష్మీ, జయదేవ్ చూస్తుంటే చాటుగా అక్కడికి తీసుకెళ్తుంది. మిత్ర లక్ష్మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు మామ కోడళ్లు అంటే దానికి లక్ష్మీ సీసీ టీవీ ఫుటేజ్‌తో ఇంటి దొంగని పట్టుకోవాలి అనుకుంటున్నామ్ అని అంటుంది. ఇక జయదేవ్ ఫుటేజ్ చూడమని చెప్తాడు. అందులో మనీషా వెళ్లడం కనిపిస్తుంది.

దేవయాని: మనం ఇరుక్కుపోయాం మనీషా నువ్వు బయటకు వెళ్లి రావడం సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు మిత్రకు కూడా నీ మీద అనుమానం వస్తుంది.
లక్ష్మీ: పది పదిన్నర మధ్యలో మనీషా మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ టైంలో ఇంకెవరూ ఇంటిలోకి రాలేదు. ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లలేదు. 
మిత్ర: నీ మాటలు చూస్తుంటే మనీషానే హారం బయటకు తీసుకెళ్లింది అన్నట్లున్నావ్. 
జయదేవ్: అవునురా మనీషానే హారం బయటకు తీసుకెళ్లింది.
మిత్ర: ఊరుకోండి డాడీ తనకు ఆ అవసరం ఏముంది.
లక్ష్మీ: తనకు ఏ అవసరం ఉందో ఎవరికి తెలుసు.
మిత్ర: ఏం మాట్లాడుతున్నావ్ లక్ష్మీ. జాను మీద నింద పడితే నువ్వు ఎంత బాధ పడ్డావ్. మనీషా కూడా ఆడపిల్లే కదా అలా ఎలా నింద వేస్తావ్ లక్ష్మీ. 
జయదేవ్: తన అనుమానంలో నిజం ఉంది మిత్ర.
మిత్ర: మీరు కూడా ఏంటి డాడ్ బయటకు వెళ్లి వస్తే తనే హారం తీసినట్లా మనీషా అలాంటిది కాదు నాకు తన మీద నమ్మకం ఉంది. సగం తెలిసి తెలియని మీ ఇన్వెస్టిగేషన్‌తో ఇంట్లో వాళ్లని అవమానించకండి. 
మనీషా: చూశారా ఆంటీ మిత్రకు నా మీద అనుమానమే లేదు.
దేవయాని: ఈ రోజు నీ అదృష్టం బాగుంది. నాకు టెన్షన్‌గా ఉంది నేను వెళ్లిపడుకుంటా.
జయదేవ్: ఏంటమ్మా వీడు కళ్లముందు సాక్ష్యం పెట్టుకొని మనీషా కాదు అంటాడు.
లక్ష్మీ: కచ్చితంగా హారం మనీషానే తీసింది మామయ్య. కానీ నిరూపించడానికి ఇది సరిపోదు. ఆయన నమ్మాలి అంటే బలమైన ఆధారం కావాలి రేపు అది సంపాదించి మనీషాని ఆయన ముందు నిలబెడతా. 

ఉదయం లక్ష్మీ, జయదేవ్‌లు నగల దుకాణానికి వెళ్లి హారం అమ్మింది ఎవరు అని అడుగుతారు. ఇక సీసీ టీవీ ఫుటేజ్ చూస్తారు. అందులో ఒక వ్యక్తిని చూసి లక్ష్మీ ఫొటో తీసుకొని పోలీస్‌కి వివరాలు అడగమని మామయ్యకి చెప్తుంది. ఇక దేవయాని మనీషాతో లక్ష్మీ, బావగారు ఇంకా ఇంటికి రాలేదు నాకు భయంగా ఉందని చెప్తుంది. మిత్ర నా వైపు ఉన్నాడు నాకు ఏం భయం లేదు అని మనీషా అంటుంది. ఇక లక్ష్మీ, జయదేవ్‌లు పోలీస్ చెప్పిన ఆ దొంగ అడ్రస్‌కి వెళ్తారు. ఒక వ్యక్తికి ఫొటో చూపించి అడిగితే తెలీదు అని ఆయన చెప్పి రంగా అనే దొంగని తప్పించడానికి పరుగులు తీస్తాడు. దాంతో లక్ష్మీ వాళ్లు ఆయన వెంట పడి దొంగని పట్టుకుంటారు. దొంగ బంగారం అమ్మాలని చెప్తారు. రంగ సరే అనగానే జయదేవ్ గన్ గురి పెట్టి హారం గురించి అడుగుతారు. ఇక లక్ష్మీ సరయు పీఏ ఫొటో చూపించి ఈయనేనా అని అడిగితే రంగ అవునని చెప్తాడు.

ఇక లక్ష్మీ సరయు పీఏ రాజు దగ్గరకు బయల్దేరుతుంది. మనీషా సరయుకి కాల్ చేసి హారం కోసం ఎంక్వైరీ చేయిస్తున్నారని చెప్తుంది. ఇక సరయు పీఏకి కాల్ చేసి జాగ్రత్త అని చెప్తుంది. మనీషా, దేవయానిలు సరయుతో మాట్లాడటం మిత్ర, జానులు వినేస్తారు. ఇద్దరినీ చూసి మనీషా, దేవయాని షాక్ అయిపోతారు. మీరు ఏం చేస్తున్నారు అని మిత్ర అడుగుతాడు. ఎందుకు టెన్షన్‌గా ఉన్నారని అడిగితే ఏం లేదు అని మనీషా అంటుంది. దాంతో జాను ఇద్దరూ ఏదో గూడుపుటానీ చేస్తున్నారని అంటుంది. ఇక దేవయాని మీ అక్కనే మొత్తం చేస్తుందని చెప్తుంది. దాంతో మిత్ర డైవర్ట్ అయిపోతాడు. ఇక పీఏ రాజు స్కూటీ పాడవడంతో లక్ష్మీ వాళ్లకే లిఫ్ట్ అడుగుతాడు. కారులో లక్ష్మీ, జయదేవ్‌ని చూసి షాక్ అయిపోతాడు.

జయదేవ్ రాజుకి గన్ గురిపెట్టి హారం గురించి అడుగుతాడు. దాంతో రాజు మనీషానే హారం తీసుకొచ్చి సరయు మేడంకి ఇచ్చిందని సరయు, మనీషా మంచి ఫ్రెండ్స్ అని ఇద్దరూ కలిసి మీకు, మిత్రగారికి వ్యతిరేకంగా చాలా కుట్రలు చేశారని పార్వతికి, లాయర్‌కి ఇవ్వాల్సిన డబ్బు కోసం హారం అమ్మడానికి ప్రయత్నించారని చెప్తాడు. జయదేవ్, లక్ష్మీలు షాక్ అయి మిత్రకు విషయం చెప్పడానికి వెళ్తారు. ఇక రాజు సరయుకి జరిగిన విషయం చెప్తారు. సరయు టెన్షన్‌తో మనీషాకి విషయం చెప్తుంది. మనీషా షాక్ అయిపోతుంది. విషయం తెలిసి దేవయాని షాక్ అయిపోతుంది. అందరూ తనని తిడతారు అని కొడుకు కోడలు పరువు తీసేస్తారని కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారాన్ని పొడిచి పొడిచి చంపేసిన దీపక్.. రూప మీద విరుచుకుపడ్డ రాజు.. రూప ప్రెగ్నెంట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
Trump Tariffs: భారత్‌పై ప్రతీకార సుంకాలు - అసలు ప్రతీకార సుంకం అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో దీనిని విధిస్తారు?
భారత్‌పై ప్రతీకార సుంకాలు - అసలు ప్రతీకార సుంకం అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో దీనిని విధిస్తారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
Trump Tariffs: భారత్‌పై ప్రతీకార సుంకాలు - అసలు ప్రతీకార సుంకం అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో దీనిని విధిస్తారు?
భారత్‌పై ప్రతీకార సుంకాలు - అసలు ప్రతీకార సుంకం అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో దీనిని విధిస్తారు?
Billionaires In India: ఎవరన్నారయ్యా భారత్‌ పేద దేశమని?, ఈ స్టోరీ చదివితే మీరూ ఇదే మాట అంటారు!
ఎవరన్నారయ్యా భారత్‌ పేద దేశమని?, ఈ స్టోరీ చదివితే మీరూ ఇదే మాట అంటారు!
Viral Video: స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
Telangana Student Praveen Dead: అమెరికాలో తెలంగాణ విద్యార్థి హత్య- షాపింగ్ మాల్‌లో దారుణం!
అమెరికాలో తెలంగాణ విద్యార్థి హత్య- షాపింగ్ మాల్‌లో దారుణం!
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
Embed widget