అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today December 17th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: దొంగతనం చేసిన జాను.. కొత్త దంపతుల మధ్య చిచ్చు పెట్టేసిన దేవయాని, మనీషా!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode తన భార్యనే దొంగతనం చేసిందని దేవయాని, మనీషా ఫ్రూవ్ చేయడంతో వివేక్ జానుని కొట్టడానికి చేయి ఎత్తడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఇంటి బీరువా తాళాలను మనీషా దొంగతనం చేసి అందులో వంశపారపర్యం నెక్లెస్‌ని జాను బ్యాగ్‌లో వేస్తుంది. మనీషా, దేవయాని జాను మీద దొంగ అనే నింద వేస్తుంది. ఇదంతా దేవయాని చేసిందని జాను అందరితో చెప్తుంది. దేవయాని బుకాయిస్తుంది. దాంతో జాను మీ బాగోతం అందరికీ తెలుసు మీరు నా విషయంలో చేసింది బయట పెట్టాల్సి వస్తుంది అని ఆవేశంలో జాను దేవయానిని తిడితే వివేక్ కోపంతో జాను మీద చేయి ఎత్తుతాడు. జాను ఏడుస్తుంది. తల్లిని అంటే కోపం వస్తుంది కానీ కట్టుకున్న భార్య మీద వేయరాని నిందలు వేస్తే కోపం రాదు అని అంటుంది.

మనీషా: నువ్వు చేసిన పని అలాంటిది జాను ఆ విషయంలో నీ మీద ఎవరికీ జాలి రాదు. కోపమే వస్తుంది. 
మిత్ర: నువ్వు ఆగు మనీషా పోయిన హారానికి తనకు ఏం సంబంధంలేదు. హారం ఎక్కడికీ పోలేదు పిన్ని నా దగ్గరే భద్రంగా ఉంది. అని తన వెంట తీసుకొచ్చిన హారం బాక్స్ చూపిస్తాడు దేవయాని వాళ్లు షాక్ అవుతారు. ఎవరో కావాలనే ఈ హారం కొట్టేసి గోల్డ్ షాప్‌లో అమ్ముతుంటే నాకు ఆయన కాల్ చేశారు. ఇది ఎవరో దొంగల పని అయింటుంది జానుకి ఇందులో ఏం సంబంధం లేదు. కొట్టేసింది ఎవరో త్వరలోనే కనిపెడతా. జరిగిన దానికి బాధ పడకు జాను నువ్వు ఎలాంటిదానివో నాకు తెలుసు. నాకు నీ గురించి. వివేక్ జాను మీద చేయి ఎత్తడం చాలా తప్పురా. ఒక్కసారి మనసు విరిగితే తిరిగి అతికించలేం. నేను చేసిన తప్పు నువ్వు చేయకురా.
జయదేవ్: మనిషి విషయం చెప్పావు మిత్ర ఆవేశంలో సరిదిద్దుకోలేని తప్పులు చేస్తాం ఆ విషయంలో నువ్వు తప్పు తెలుసుకొని మీ తమ్ముడికి చెప్పావ్.
దేవయాని: ఏంటి మనీషా నీటైమే అనకుంటే నా టైం కూడా బాలేదు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది.
మనీషా: సరయుకి ఇచ్చిన హారం మిత్ర దగ్గరకు  ఎలా వచ్చింది ఆంటీ. 
దేవయాని: నీ సంగతి ఏమో కానీ నేను మునిగిపోయేలా ఉన్నాను. మిత్ర మాటలకు వివేక్ కరిగిపోయేలా ఉన్నాడు వాడు జాను వైపు వెళ్లిపోతే నా సంగతి ఏంటి.
మనీషా: ముందు ఆ సరయు సంగతి ఫోన్ చేసి చెప్తా. 

జాను ఏడుస్తుంటే లక్ష్మీ ధైర్యం చెప్తుంది. నింద పడితే దాన్ని తొలగించుకొని ధైర్యంగా ఉండాలని అంటుంది. దేవయాని, మనీషాల గురించి తెలిసి కూడా వివేక్ చేయి ఎత్తడం బాధగా ఉందని జాను అంటుంది. ఇక లక్ష్మీ బీరువా తాళాలు నీ గదిలోకి వచ్చిందో బీరువాలో ఉండాల్సిన హారం నీ దగ్గరకు ఎలా వచ్చింది నేను చూసుకుంటా అని అంటుంది. మనీషా సరయుకి కాల్ చేసి హారం మిత్రకు దొరికిందని సరయుని తిడుతుంది. మనీషా ఇరుక్కోవాలనే ఇలా చేశానని సరయు మేనేజర్తో చెప్తుంది. ఇక జాను కోపంగా ఉంటే వివేక్ చూసి ఇంకా కోపం తగ్గినట్లు లేదని గదిలోకి వెళ్లి జాను అని పిలుస్తాడు జాను కోపంతో తలగడలు విసిరేస్తుంది. జాను వివేక్‌కి కింద పడుకోమంటే ఇది నా ఇళ్లు నా గది అని వివేక్ అంటే నేను వెళ్లిపోతా అని జాను అంటే దానికి  వివేక్ ఎందుకు నువ్వు నా పరువు తీస్తావని అంటాడు.

వివేక్ జానుకి క్షమాపణ చెప్తాడు. కింద పడుకుంటానని జాను వివేక్‌తో చెప్పడం జాను కోప్పడటం లక్ష్మీ చూసి బాధగా బయటకు వెళ్లిపోతుంది. అక్కడ జయదేవ్ ఉంటే అక్కడికి వెళ్తుంది. ఏమైందని లక్ష్మీ అడిగితే దానికి జయదేవ్ మనం ఇప్పుడు జాను, వివేక్‌ల కాపురం గురించి ఆలోచించాలని చెప్తాడు. జాను వివేక్‌ల మధ్య కలతలు వచ్చాయని ఎడముఖం పెడముఖం పెట్టుకున్నారని అంటాడు. ఇదంతా కుట్ర అని దేవయాని, మనీషాలే చేశారని వాళ్లని వదిలేస్తే జాను, వివేక్‌లను విడదీయడం ఖాయమని అంటాడు. దాంతో లక్ష్మీ సీసీ టీవీ ఫుటేజ్ చూసి దొంగని పట్టుకుందామని అంటుంది. అది విన్న దేవయాని విషయం మనీషాకు చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రాజీనామాని తాత ముఖం మీద విసిరి కొట్టిన కార్తీక్.. దీపే సర్వస్వం అని తేల్చేశాడుగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Chinmayi Sripaada - Atlee: కామెడీ పేరుతో అవమానం... జాత్యహంకారం అంటూ కపిల్ శర్మ - అట్లీ వివాదంపై విరుచుకుపడ్డ చిన్మయి
కామెడీ పేరుతో అవమానం... జాత్యహంకారం అంటూ కపిల్ శర్మ - అట్లీ వివాదంపై విరుచుకుపడ్డ చిన్మయి
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Embed widget