అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today August 23rd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను మిత్ర, లక్ష్మీల కొడుకని సంజనతో చెప్పిన జయదేవ్.. మిత్ర కోసం రౌడీ కాళ్ల పట్టుకున్న లక్ష్మీ!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జున్ను లక్ష్మీ, మిత్రల కొడుకని సంయుక్తగా ఉన్నది లక్ష్మీనే అని జయదేవ్ సంజనతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీ డల్‌గా మెట్ల మీద కూర్చొని ఉంటే జున్ను వచ్చి లక్కీతో మాట్లాడుతాడు. లక్కీని నవ్వించడానికి జోకులు చెప్తాడు కానీ లక్కీ మిత్ర గురించే ఆలోచిస్తూ ఉంటుంది. చివరకు లక్కీని జున్ను నవ్విస్తాడు. ఇక వాళ్లిద్దరినీ సంజన చూస్తుంది. జయదేవ్, అరవిందలు సంజనతో లక్కీ జున్నుల బంధం గురించి మాట్లాడుకుంటారు. ఇక అరవింద వెళ్లిపోతుంది.

సంజన: వాడిని చూస్తుంటే చిన్నప్పుడు అన్నయ్య ఎలా ఉంటాడో గుర్తు రావడం లేదూ. వాడిని చూస్తుంటే అన్నయ్య, వదినలకు పుట్టిన బిడ్డలా అనిపిస్తుంది.
జయదేవ్: అలాగే ఉండటం కాదు సంజన వాడు మీ అన్న కొడుకే. 
సంజన: ఏం మాట్లాడుతున్నారు పెద్దనాన్న. 
జయదేవ్: అవును సంజన వాడు మిత్రకి లక్ష్మీకి పుట్టిన బిడ్డ. 
సంజన: నమ్మలేకపోతున్నాను పెద్దనాన్న అయితే నేను ఇందాక చూసింది వదిననేనా.
జయదేవ్: అవును సంజన కానీ ఈ విషయాన్ని నీ మనసులోనే పెట్టుకోమ్మా. పరిస్థితుల వల్ల వదిన ఐడెంటిటీ ఎవరికీ తెలీకూడదు.

సంజన జున్నుని దగ్గరకు తీసుకొని ముద్దాడుతుంది. మిస్ అయ్యానని అంటుంది. జున్ను ఎందుకని అడిగితే సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుందని అంటుంది. ఇక లక్కీ పిలవడంతో జున్ను వెళ్లిపోతాడు. ఇంతలో అరవింద వచ్చి సంజన భర్త కాల్ చేశాడని చెప్తే సంజన మాట్లాడి వెళ్లిపోతుంది. మరోవైపు మనీషా, దేవయానిలు ఓ బస్తీకి వస్తారు. జాను, సంయుక్తలు ఆ బస్తీలో మిత్ర కోసం వెతకడంతో ఇద్దరూ వాళ్లని ఫాలో అవుతారు. దేవయాని సంయుక్తని చూసి లక్ష్మీనే అనిపిస్తుందని తన భర్త కోసం చాలా కష్టపడుతుందని సెటైర్లు వేస్తారు. ఇక సంయుక్త, జానులు ఆ బస్తీలో వీరన్న అనే అతన్ని కలుస్తారు. ఆయనతో సంయుక్త మీరు కిడ్నాప్‌లు చేస్తారు కదా అని అడుగుతుంది. తన భర్తని ఎవరో కిడ్నాప్ చేశారని మీరే సాయం చేయాలని ఆయన కాళ్ల మీద పడుతుంది. ఆయనను చాలా బతిమాలి చివరకు ఆయన్ను ఒప్పిస్తుంది. ఎవరు కిడ్నాప్ చేశారో చెప్తానని కానీ ఆయన్ను కాపాడలేను అని వీరన్న అంటే లక్ష్మీ తాను కాపాడుకుంటానని అంటుంది.

మనీషా: ఆంటీ ఇప్పటికైనా నమ్ముతారా తను లక్ష్మీ అని. మిత్ర తన సొంత భర్త కాబట్టి కన్నీళ్లు పెట్టుకొని కాళ్లు పట్టుకోవడానికి రెడీ అయిపోయింది. సంయుక్త అయితే ఇవన్నీ ఎందుకు చేస్తుంది.
దేవయాని: నువ్వు చెప్తుంటే నాకు నిజం అనిపిస్తుంది మనీషా.

అరవింద భోజనం చేయకుండా ఉంటే జయదేవ్ వచ్చి తినమని అంటాడు. అరవింద మిత్ర వచ్చే వరకు నీరు కూడా తాగనని అంటుంది. ఇంతలో సంయుక్త రావడంతో అరవింద మిత్ర గురించి అడుగుతుంది. అరవింద సంయుక్తతో మిత్ర గురించి చెప్పు బాధ పడుతుంది. మిత్ర కోసం వరలక్ష్మీ వ్రతం అతని భార్య చేస్తే మిత్ర దక్కే అవకాశం ఉందని దీక్షితులు గారు చెప్పారని లేని కోడల్ని ఎక్కడ నుంచి తీసుకురావాలని ఏడుస్తుంది. ఇక జయదేవ్ సంయుక్తతో గుడిలో వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నానని అందుకు నువ్వు ప్రిపేర్ అవ్వమని అంటాడు. సంయుక్త సరే అంటుంది.

ఇక ఉదయం లక్ష్మీ, జయదేవ్ గుడికి వెళ్తారు. దీక్షితులు గారి సహకారంతో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు చేస్తారు. వ్రతం చేస్తే మిత్ర గండం పోతుందని దీక్షితులు గారు చెప్తారు లక్ష్మీని కోనేటికి వెళ్లి స్నానం చేసి ఐదుగురు ముత్తయిదువుల కాళ్లకు పసుపు రాసి ఆశీర్వాదం తీసుకోమంటారు. లక్ష్మీ వెళ్తుంది. మరో వైపు మనీషా ఇళ్లంతా వెతుకుతుంది. దేవయాని చూసి ఏమైందని ఎందుకు అలా వెతుకుతున్నావని అడుగుతుంది. దాంతో మనీషా లక్ష్మీ కోసం వెతుకుతున్నానని చెప్తుంది. మరోవైపు అరవింద కూడా గుడికి బయల్దేరుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: ‘కార్తీకదీపం 2’ సీరియల్: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దీప – జ్యోత్స్న కు బుద్ది చెప్పిన నెటిజెన్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!కేటీఆర్ ఇంటి ముందు రాత్రంతా బీఆర్ఎస్ నేతలుపట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Crime News: విశాఖ జిల్లాలో దారుణం - యువతిపై ఇనుప రాడ్డుతో ప్రేమోన్మాది దాడి
విశాఖ జిల్లాలో దారుణం - యువతిపై ఇనుప రాడ్డుతో ప్రేమోన్మాది దాడి
Refurbished Laptop Buying Tips: రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
Unstoppable With NBK S4: 'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
AP Legislative Council: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
Embed widget