అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 12th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జుట్టులు పట్టుకొని కొట్టుకున్న వియ్యాలవారు.. వివేక్ పెళ్లి క్యాన్సిల్, జేఎమ్మార్ ప్రాజెక్ట్ కోసం అర్జున్, మిత్రల ఢీ!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జేఎమ్మార్‌ ప్రాజెక్ట్ కోసం మిత్ర, అర్జున్‌లు పోటీ పడుతూ ఛాలెంజ్‌లు చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా ఖుషితో పాటు తన తల్లిదండ్రుల ఎదురుగా వివేక్ జానుని ప్రేమించాడని నోరు విప్పేస్తుంది. ఖుషి తల్లి దేవయాని దగ్గరకు వెళ్లి నీ కొడుకు ఈ జాహ్నవి ప్రేమించుకున్నారా. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారా ఇంత మోసం చేయాలి అనుకున్నారా అని అడుగుతుంది. ఇక ఖుషి కూడా ఈ పెళ్లి జరిగితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమా చూపించే వాడని అంటుంది. ఇక ఖుషి తల్లి దేవయానికి సంస్కారం లేని దానా అని నోరు మూయ్ అని అంటుంది. ఇక దేవయాని కూడా సిగ్గు లేనిది నన్నే అంట మాట అంటుందా అని అంటే ఖుషి తల్లి దేవయాని చెంప మీద కొడుతుంది. దేవయాని కూడా కొడుతుంది. ఇద్దరూ జుట్టులు పట్టుకొని కొట్టుకుంటారు. మిత్ర, వివేక్, మనీషాలు ఆపుతారు. ఇక పెళ్లి వద్దు అనుకొని ఖుషి వాళ్లు వెళ్లిపోతారు. ఇక పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో వివేక్, జాను, మిత్ర, సంయుక్తలు సంతోషిస్తారు.

మనీషా దేవయాని దగ్గరకు వెళ్లి సారీ చెప్తే దేవయాని మనీషాని తిడుతుంది. జాను, వివేక్‌లు సంయుక్తకి థ్యాంక్స్ చెప్తారు. మిత్ర కూడా సంయుక్తకి థ్యాంక్స్ చెప్తాడు. రాత్రి జాను, వివేక్, సంయుక్తలు జయదేవ్ దగ్గరకు వెళ్లి తమ సంతోషం పంచుకుంటారు. ఇక లక్ష్మీ తనని పొడగొద్దని మామకి చెప్తుంది. వివేక్, జాను బాధ పడకూడదని ఇలా చేశానని సంయుక్త చెప్తుంది. ఇక వీళ్ల పెళ్లి ఎప్పుడు చేస్తావని జయదేవ్ అడుగుతాడు.

 సంయుక్త: వీళ్ల పెళ్లి కంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి మామయ్య.  ముందు మనీషా నుంచి అత్తయ్యని కాపాడాలి. అత్తయ్యని ఇబ్బంది పెట్టాలని మనీషా ఉంచిన సాక్ష్యాలను సంపాదించాలి. మనీషా నందన్ కుటుంబం జోలికి రాకూడదని చేయాలి. మిత్ర గారు మనీషాకు అందకుండా ఆయన్ను గండాల నుంచి రక్షించాలి. 
జాను: అక్క రేపు నీకు అది పెద్ద టాస్క్ ఉంది. రేపు జేఎమ్మార్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తారు. వారిలో బావగారు, అర్జున్ గారు కూడా ఉన్నారు.
వివేక్: ప్రాజెక్ట్ ఇంకెవరి అన్నయ్యకే కదా వదిన ఇస్తుంది.
జయదేవ్: ఓరేయ్ అలా బంధాలకు లొంగిపోయి ప్రాజెక్ట్ ఇస్తే నా కోడలు ఎలా అవుతుందిరా. తనకు ఏదో స్టాటజీ ఉంటుంది.

మిత్ర తన ఆఫీస్‌లో ప్రాజెక్ట్ ఎలా అయినా దక్కించుకోవాలని చెప్తాడు. ప్రజంటేషన్ గొప్పగా ఇవ్వాలని చెప్తాడు. మరో వైపు అర్జున్ కూడా ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దక్కించుకోవాలని అంటాడు. వర్క్ మీద ఫోకస్ చేయమని చెప్తాడు. అర్జున్,  మిత్ర ఇద్దరూ రాత్రి అని చూడకుండా ప్రాజెక్ట్ కోసం కష్టపడుతుంటారు. ఇక వసుంధర కొడుకుకు కాల్ చేసినా అర్జున్ కాల్ లిఫ్ట్ చేయకుండా పనిలోపడతాడు. కంగారు పడిన వసుంధర లక్ష్మీకి కాల్ చేసి అర్జున్ రాలేదని భయంగా ఉందని చెప్తుంది. ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాడని ఏం కంగారు పడొద్దని అంటుంది. ఇక మిత్ర, అర్జున్ ఇద్దరూ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారని జాను, సంయుక్త ఇద్దరూ అనుకుంటారు.  

ఉదయం జాను, సంయుక్తలు ఆఫీస్‌కు వెళ్లారు. మిత్ర, అర్జున్‌లు ప్రజంటేషన్‌కి వచ్చినట్లు పేర్లు రాలేదని అడిగితే ఇద్దరూ ఇంకా రాలేదని జాను చెప్తుంది. ఇక జాను మిత్రకు ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ఆ ఇంట్లో ఉండటానికి ఛాన్స్ దక్కదేమో అని జాను అంటుంది. దానికి సంయుక్త అర్జున్ గారికి ఇవ్వకపోతే భర్తకే సపోర్ట్ చేసిందని అర్జున్ గారు అనుకుంటారని అంటుంది. ఏది ఏమైనా తాను జేఎమ్మార్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేస్తానని ఎవరి ప్రజెంటేషన్ బాగుంటే వాళ్లకే ప్రాజెక్ట్ ఇస్తానని అంటుంది.

అర్జున్, మిత్ర ఇద్దరూ సంయుక్త ఆఫీస్‌కు వస్తారు. ఇద్దరూ ఎదురెదురుగా నిల్చొని ఒకేలా కళ్ల జోడు తీస్తారు. ఒకరికి ఒకరు సెటైర్లు వేసుకుంటారు.. నేను గెలుస్తా అంటే నేను గెలుస్తా అని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తన మీద ఒట్టుపెట్టుకొని విద్యాదేవిని ఆపేసిన మహాలక్ష్మీ.. ఇదేం ట్విస్ట్‌రా బాబు.. సుమతి నుంచి మహాకు లెటర్!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget