Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 2nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ, మిత్రల కారు పేల్చేసిన సరయు.. మిత్ర బతుకుతాడా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ వాళ్లని టెండర్ వేయకుండా ఆపడానికి సరయు యాక్సిడెంట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర, లక్ష్మీలు ఫైల్ రెడీ చేసి టెండర్ వేయడానికి వెళ్తానని అంటే మనీషా ఆపడానికి ప్రయత్నిస్తుంది. అపశకునంలా అనిపిస్తుందని అంటుంది. మిత్ర, జయదేవ్, జానులు లక్ష్మీకి సపోర్ట్ చేస్తారు. టైం అవుతుంది వెళ్లమని అరవింద చెప్తుంది. మన ఫైల్ లీక్ అయిపోయింది కదా ఇప్పుడు వెళ్లడం ఎందుకు అని అంటుంది. మిత్ర వెళ్లి తీరాలని అంటాడు.
మిత్రతో కలిసి వెళ్తానని అంటాడు. నువ్వు ప్రెగ్నెంట్ కదా అంత దూరం ఎలా వస్తావ్ అని లక్ష్మీ అంటుంది. దాంతో అరవింద మనీషాని ఇంట్లో ఉండమని లక్ష్మీ, మిత్రల్ని పంపిస్తుంది. మనీషా సరయుకి కాల్ చేసి మిత్ర, లక్ష్మీలు టెండర్ వేయడానికి వస్తున్నారని చెప్తుంది. సరయు షాక్ అవుతుంది. లక్ష్మీ ఫైల్ రీక్రియేట్ చేసిందని అంటుంది. లక్ష్మీ వాళ్లకి అనుమానం వస్తుంది వెంటనే వెళ్లమని సరయుతో మనీషా చెప్తుంది. సరయు విక్కీ అనే ఓ వ్యక్తికి కాల్ చేసి గన్ తీసుకొని రమ్మని చెప్తుంది. లక్ష్మీ మిత్రలు ఇద్దరూ మాట్లాడుకుంటారు. ప్రాజెక్ట్ ఎవరు మన దగ్గర దొంగతనం చేయాలి అనుకున్నారో.. వాళ్ల అంతు చూడాలి అనుకుంటారు. మిత్ర సెడెన్ బ్రేక్ వేయడంతో లక్ష్మీ పడిపోతుంది. దాంతో సీట్ బెల్ట్ పెట్టుకోమని అంటాడు. మిత్ర సీట్‌బెల్ట్ స్టక్ అయిపోతుంది.
సరయు విక్కీలు దారిలో కాపు కాస్తారు. మిత్ర, లక్ష్మీలు వస్తే షూట్ చేసేమని అంటుంది. ఇద్దరూ స్పాట్‌లో అయిపోవాలని యాక్సిడెంట్‌లా ఉండాలని అంటుంది. మనీషాకి లై డిటెక్టర్ మెషిన్ పెడితే తాను చెప్పేది నిజమో అబద్దమో తెలుస్తుందని పిల్లలు అనుకొని మిత్రకు కొనమని చెప్పాలని అనుకుంటారు. మిత్రకు లక్కీ కాల్ చేస్తుంది. లై డిటెక్టర్ కావాలని కొనుక్కురమ్మని చెప్తారు. లక్ష్మీ, మిత్ర ఇద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో సరయు వాళ్లు కారు చూసి షూట్ చేయడానికి రెడీగా ఉంటారు. కారు దగ్గరకు రాగానే విక్కీ కారు టైర్‌ని షూట్ చేస్తాడు. కారు అదుపు తప్పి చెట్టుకు గుద్దేస్తుంది. సీట్ బెల్ట్ లేకపోవడంతో మిత్రకు దెబ్బలు తగులుతాయి. పిల్లలు చాలా టెన్షన్ పడతారు. మిత్రని ఫైల్‌ని లక్ష్మీ బయటకు తీస్తుంది.
లక్ష్మీ వాళ్లు బయటకు రాగానే కారు పేలిపోతుంది. సరయు చూసి లక్ష్మీ, మిత్ర ఇద్దరూ చనిపోయారని తనకు ఇక తిరుగులేదని అనుకుంటుంది. పిల్లలు ఏడుస్తుంటే వివేక్, జాను అక్కడికి వెళ్తారు. ఏమైందని అడిగితే పిల్లలు ఏడుస్తూ అమ్మానాన్నలకు ఏదో ప్రమాదం జరిగిందని చెప్తారు. అమ్మానాన్నలతో మాట్లాడుతూ ఉంటే పెద్ద సౌండ్ వచ్చిందని తర్వాత ఫోన్ కట్ అయిపోయిందని అంటారు. అరవింద విని కంగారుగా మిత్ర నెంబరుకు కాల్ చేస్తుంది. ఎవరీ ఫోన్ పని చేయదు. అందరూ చాలా కంగారు పడతారు. లక్ష్మీ హాస్పిటల్‌కి కాల్ చేయాలి అంటే రెండు ఫోన్లు కాలిపోయావని ఎలా భర్తని కాపాడుకోవాలో అని ఏడుస్తుంటే ఓ వ్యక్తి తోపుడు బండి తీసుకెళ్లడం చూస్తుంది. ఆయనతో విషయం చెప్పి ఫోన్ అడిగి అంబులెన్స్‌కి కాల్ చేస్తుంది. అరగంట అవుతుందని చెప్పడంతో లక్ష్మీ ఏడుస్తుంది. దగ్గర్లో హాస్పిటల్ డిటైల్స్ చెప్పడంతో హాస్పిటల్‌కి తీసుకొస్తానని ఓ పాజిటివ్ రక్తం ఏర్పాటు చేయమని చెప్తుంది. ఇక ఆవ్యక్తి సాయం తోపుడు బండి మీద ఎక్కించుకొని తోసుకుంటూ వెళ్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్తుంది. మిత్ర ఫైల్ టెండర్ అని లక్ష్మీని వెళ్లమని అంటాడు. లక్ష్మీ వెళ్లను అని చెప్పినా మిత్ర ఒప్పుకోడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ పక్కనే గాయత్రీ.. ఊర్వశి దొరికిపోతుందా.. కంకణం కట్టించుకునేదెవరు?





















