Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 1st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన లక్ష్మీ.. అరవింద కోడల్ని క్షమిస్తుందా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode సరయు మనీషాకి కాల్ చేసి మిత్ర, లక్ష్మీలు ఇళ్లు దాటకుండా చూసుకోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఫైల్ తీసుకొని రమ్మని చెప్తే లక్ష్మీ వచ్చి ఫైల్ కనిపించడం లేదని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. తలగడ కింద పెట్టుకొని పడుకున్నా అని లక్ష్మీ చెప్తుంది. అంత ముఖ్యమైన ఫైల్ దిండు కింద పెట్టుకొని పడుకున్నావా అంత నిర్లక్ష్యం ఏంటి అని అరవింద అడుగుతుంది. మీ గదిలో డిజిటల్ లాక్ ఉంది కదా అని జయదేవ్ అడిగితే తాను పడుకోవడంతో అలా పెట్టేసిందని మిత్ర చెప్తాడు.
అరవింద: అంత ముఖ్యమైన ఫైల్‌ని ఎవరైనా తలగడ కింద పెట్టుకొని ఎలా పడుకుంటారు. ఇప్పుడు ఫైల్ పోయింది అంటే ఎవరిది బాధ్యత. ఆ ఫైల్ లేకపోతే మనకు టెండర్ రాదు అండీ. వేల కోట్లతో పాటు మన కంపెనీ పరుగు మర్యాద అన్నీ పోతాయి.
జాను: రాత్రి మన ఇంటికి దొంగ వచ్చాడు కదా అత్తయ్యగారు వాడు తీశాడేమో.
దేవయాని: ఇదేంటి నా మీద చెప్తుంది.
మనీషా: దొంగ అంటుంది మీ మీద చెప్పడం లేదు.
అరవింద: దొంగ గదిలో దూరి తీసుకెళ్లే వరకు ఏం చేస్తున్నారు. అంత మత్తు నిద్రలో ఉన్నావా లక్ష్మీ. నువ్వేం చేస్తున్నావ్ మిత్ర. కాస్త అయినా బాధ్యత లేదా.
మనీషా: మధ్యలో ఆవిడ గారు ఆడపిల్ల పుట్టిందని కలలు కనింది కదా అప్పుడు ఫైల్ చూసుకోలేదా.
అరవింద: పనికి రాని కలలు కంటూ ముఖ్యమైనవి వదిలేశారు. నా మాట అంటే మీకు లెక్క లేకుండా పోయింది.
మనీషా, దేవయాని ఇద్దరూ కడియాలు వల్లే ఇదంతా అని అవి తీయకుండా పడుకొని ఇంత చేశారని అంటారు. దొంగ అన్నారు కదా సీసీ ఫుటేజ్ చూద్దామని జయదేవ్ అంటే ఫైల్ బయటకు వెళ్లిపోయింది మన కొటేషన్ కూడా వెళ్లిపోయింది ఇక ఏం లాభం లేదు అంటుంది. ఒకప్పుడు లక్ష్మీ వల్ల మంచి జరుగుతుందని ఇంటికి తీసుకొచ్చానని ఇప్పుడు నీ వల్లే చెడు జరుగుతుందని అరవింద అంటుంది. లక్ష్మీ తనని క్షమించమని అడుగుతుంది. ఇది క్షమించరాని తప్పిదం అని నీ క్షమాపణతో కంపెనీ పరువు మర్యాదలు నిలబడవని తను ముందు నుంచి వెళ్లిపోమని అరవింద లక్ష్మీని పంపేస్తుంది. లక్ష్మీ వెళ్లిపోతుంది.
మనీషా సరయుకి కాల్ చేస్తుంది. ఇంట్లో అగ్నిపర్వతం బద్ధలైందని చెప్తుంది. ఇంట్లో జరిగిన వన్నీ చెప్తుంది. కష్టం వాళ్లది లాభం నాది అని సరయు అంటుంది. ఇక సరయు మనీషాతో మిత్ర ఇళ్లు కదలకుండా చూసుకో అని చెప్తుంది. మిత్ర వస్తే తన కొటేషన్ నేను కాపీ చేశానని అంత వరకు ఇద్దరూ ఇంట్లోనే ఉండేలా చూసుకో అని చెప్తుంది. లక్ష్మీ అత్త మాటలు తలచుకొని ఏడుస్తుంది. దొంగ పనో ఇంటి దొంగ పనో తెలీడం లేదని లక్ష్మీ ఏడుస్తుంది. ఇక లక్ష్మీ ఫోన్‌లో మిత్ర, తాను ట్యాలీ చేసిన ఫిగర్స్ మొత్తం చూసి తెగ సంతోషపడుతుంది. పిల్లలు ఫోన్ గురించి మాట్లాడుకోవడం వల్లే లక్ష్మీకి ఆ ఆలోచన రావడంతో లక్ష్మీ పిల్లలకు ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తుంది.
అరవింద, మిత్ర వాళ్ల దగ్గరకు లక్ష్మీ పరుగున వచ్చి ఫైల్ మిస్ అయినా అందులో కోడ్ చేసిన వ్యాల్యూష్ అన్నీ నా ఫోన్‌లో ఉన్నాయని చెప్తుంది. మిత్రకు కాలిక్యులేటర్‌లో మొత్తం విలువలు చూపిస్తుంది. దాంతో మిత్ర సంతోషంగా మళ్లీ ఫైల్ రీక్రీయేట్ చేయొచ్చని చెప్తాడు. వెంటనే ఫైల్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటారు. లక్ష్మీ అరవిందతో అత్తయ్య గారు నన్ను నమ్మండి గవర్నమెంట్ ప్రాజెక్ట్‌ని మన నుంచి పోగొట్టనని అంటుంది. దేవయాని మనీషా దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. మనీషా షాక్ అయిపోతుంది. మనీషా మిత్ర వాళ్లని ఎలా అయినా ఆపాలి అని వెళ్తుంది. లక్ష్మీ, మిత్ర ఇద్దరూ అన్నీ రెడీ చేస్తారు. మనీషా ఏం చేయలేక బిత్తర చూపులు చూస్తుంది. అరవింద ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ మనకు వస్తుందని గ్యారెంటీ లేదు ఇదే కొటేషన్‌తో వాళ్లు బిడ్ చేస్తారు అని అంటే లక్ష్మీ మేం ఎలా అయినా ప్రాజెక్ట్ తీసుకొస్తామని అంటుంది. మనీషా ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఏమైనా తేడా జరిగితే మన పరువుపోతుందని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఉష, చిన్నిలకు డీఎన్‌ఏ టెస్ట్.. ఈసారి కావేరి దొరికిపోవడం ఖాయం.. చేతులెత్తేసిన రాజు!





















