Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 12th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా మూతి కాల్చేసిన లక్ష్మీ.. లక్కీ మిత్ర కన్నకూతురని తెలుసుకున్న సరయు కొత్త ప్లాన్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర కన్న కూతురే లక్కీ అని మనీషా సరయుకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode అరవింద మనీషాని ఇంట్లోనే ఉండమని చెప్తుంది. మనీషా లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఆంటీకి ఏది ముఖ్యమో నేను అది చేయాలి నువ్వు అదే చేయాలి అంటుంది. మిత్ర దగ్గరకు వెళ్లి మిత్ర నువ్వు వెళ్లిపోమన్నా వెళ్లలేకపోతున్నా నువ్వు కట్టిన తాళి వల్ల నన్ను ఆంటీ వెళ్లనివ్వలేదని ఇక్కడున్న అందరూ ఆంటీ మాటలు గౌరవించాలని మనీషా చెప్తుంది.
మనీషా సరయుని కలిసి మొత్తం చెప్తుంది. లక్ష్మీ ఇలా చేస్తుందని అనుకోలేదని మనీషా అంటుంది. ప్రెగ్నెన్సీ విషయంలో ఏం చేయలేదు అనుకుంటే చేసేసింది ఇప్పుడు తాళి విషయంలో ఇది ఫేక్ పెళ్లి తేల్చిందంటే నా పని అయిపోతుందని మనీషా సరయుతో చెప్తుంది. మిత్రను కాపాడబోయే బిడ్డ ఆ ఇంట్లోనే ఉందని తెలిస్తే నన్ను చంపేస్తారని అంటుంది. ఇక సరయు మిత్రను గండం నుంచి కాపాడే కూతురు అన్నావ్ ఏంటి అంటే లక్కీ మిత్ర సొంత కూతురు అని లక్ష్మీకి ట్విన్స్ పుట్టారని సరయుతో చెప్తుంది. ఇలాంటి విషయం నాకు ముందే తెలుసుంటే లక్కీని ఆ ఇంటికి దూరం చేసేదాన్ని కదా అని సరయు అంటుంది. ఇక లక్ష్మీ సంగతి నువ్వు చూసుకో లక్కీ సంగతి నేను చూసుకుంటానని సరయు అంటుంది.
లక్ష్మీ మిత్ర బట్టలు ఐరన్ చేస్తూ అరవింద మాటలు తలచుకుంటూ ఉంటుంది. ఇంతలో మనీషా లక్ష్మీ దగ్గరకు వచ్చి నీ చేతులతో నువ్వే నన్ను గెలిపించావ్.. నన్ను ఇంటి నుంచి పంపేయాలి అనుకున్నావ్ నేను మోయలేని భారాన్ని కూడా తగ్గించేశావ్ అని అంటుంది. నా మెడలో తాళి ఉన్నంత వరకు ఏం చేయలేవ్ అని అంటుంది. దానికి లక్ష్మీ కడుపులో భారం తీయించిన నేను తాళి బంధం తీయించలేనా అంటుంది. దానికి మనీషా నువ్వు నన్ను నా మిత్రను నా నుంచి దూరం చేయలేవు అంటుంది. మిత్ర షర్ట్ పట్టుకొని నేను మిత్ర ముద్దూ ముచ్చటలాడుతుంటే తట్టుకోగలవా లక్ష్మీ అని షర్ట్‌ని ముద్దాడబోతే లక్ష్మీ మనీషా ముఖం మీద ఐరన్ బాక్స్ పెడుతుంది. ఆయన్ను తాకడమే కాదు ఆ షర్ట్ కూడా తాకలేవు అని అంటుంది. త్వరలోనే నిన్ను ఇంటి నుంచి గెంటేస్తానని లక్ష్మీ వార్నింగ్ ఇస్తుంది.
దేవయాని చేతికి మందు పెట్టుకొని జానుని తిట్టుకుంటూ ఉంటుంది. నీ బతుకు మీద దెబ్బ కొట్టకుండా ఉండను అని అంటుంది. జాను వివేక్ మా మాటలు వింటారు. అంతలా నేనేం చేశాను అని జాను వివేక్‌ని అడిగితే అమ్మ వాచ్‌కి బగ్ పెట్టి తప్పు చేశానని వివేక్ అంటాడు. ఇక మనీషా మూతి కాల్చుకొని దేవయాని దగ్గరకు వెళ్తుంది. మనీషా మూతి చూసి నీ మూతికి ఏమైంది ఎర్రగా ఉందని దేవయాని అడిగితే నా సవతి నాకు వాతలు పెట్టిందని జరిగింది మనీషా చెప్తుంది. దాంతో దేవయాని పెద్దగా నవ్వుతుంది. నీకు లక్ష్మీతో వెటకారాలు అవసరమా అని తిడుతుంది. జాను వాళ్లు నవ్వుకుంటారు. మిత్రను కాపాడటానికి అవసరమైన ఆడబిడ్డ నువ్వు కంటావు అని అరవింద అక్క నిన్ను ఇంట్లో ఉంచిందని దేవయాని అంటుంది. ఆ మాట విన్న జాను, వివేక్ తమ కోసం అక్క ఇబ్బందులు తెచ్చుకుందని అనుకుంటారు. వదినకు ఏలా అయినా మనం సాయం చేయాలి ఈ కష్టం నుంచి మనం అక్కని గట్టెక్కించాలని వివేక్ అంటాడు. అప్పుడే లక్ష్మీ వచ్చి ఏమైందని అడిగితే జాను లక్ష్మీతో నాకు ఎందుకు చెప్పలేదు అని ఏడుస్తుంది. మా వల్ల నీ జీవితం ఇలా అయిపోయిందని జాను ఏడుస్తుంది. మీ సంతోషమే నాకు ముఖ్యం అని మీకు పిల్లలు పుట్టాలని లక్ష్మీ అంటుంది.
మిత్ర ప్రాజెక్ట్ ఫంక్షన్ గురించి మేనేజర్‌తో మాట్లాడుతాడు. ఎలా అయినా ఫంక్షన్ సక్సెస్ అవ్వాలని పీఎం ప్రాజెక్ట్ ఎలాంటి సమస్యలు రాకూడదని అంటాడు. లక్ష్మీ ఆ మాటలు వింటుంది. మనీషా తాళి విషయంలో కూడా తప్పు చేస్తుందని అత్తయ్య నమ్ముతున్నారని నేను పక్కన లేకపోవడం చూసి మనీషా ఇలా చేసిందని ఇకపై ఎప్పటికీ మీ పక్కన నేనే ఉండాలి అని లక్ష్మీ అంటుంది. మిత్ర సరే అంటాడు. ఎప్పటికీ ఇక నిన్ను దూరం చేసుకోనని అంటాడు. అమ్మ మనీషాని ఎందుకు నమ్ముతుందో అర్థం కావడం లేదని మిత్ర అంటాడు. అమ్మకి కారణం అడుగుతానని అంటాడు. ఇంతలో ఫోన్ రావడంతో మిత్ర వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: రాజు, కావేరి చేతుల రాములవారి కల్యాణం.. చిన్ని ఊహ నిజం అవుతుందా!





















