Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 10th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా బాగోతం చెప్పేసిన డాక్టర్.. ఇక మనీషాకి ఇత్తడే!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ మనీషాకి మత్తు ఇచ్చి స్కానింగ్ చేయించి మనీషా ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ మనీషాకి తీర్థం ఇస్తుంది. నీ ఆట అయిపోయింది మనీషా అని అంటుంది. ఇక దేవయాని చేయి పట్టుకొని ఎరక్కపోయి ఇరుక్కుపోయా నా ప్లాన్ పోయింది అంటుంది. ఇంతలో మనీషా వస్తే నీ ప్లాన్ కూడా ఫెయిలేనా అంటుంది. మన ఖర్మ అని ఇద్దరూ తల బాదుకుంటారు. జాను, వివేక్‌లు ఆ మాటలు వింటూ నవ్వుకుంటారు. మిమల్ని చెల్లి దెబ్బ కొట్టింది నన్ను అక్క దెబ్బ కొట్టింది అని అంటుంది మనీషా.
మనీషా దేవయానితో ఇంకా గెలుపు నా వైపే ఉంది ఈ ప్లాన్ ఫెయిల్ అయినా ఇంకో ప్లాన్ నా దగ్గర ఉంది అని అంటుంది. ఆ ప్లాన్ అయినా చెప్తావా అంటే నేను చెప్పను అని మనీషా అంటుంది. దాంతో దేవయాని మనీషాతో నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ లక్ష్మీనే గెలుస్తుంది అని అంటుంది. లక్ష్మీ తన మీద ఛాలెంజ్ చేసిందని నేను ఛాలెంజ్ చేశానని అంటుంది. లక్ష్మీ తనని ఏం చేయకుండా లక్ష్మీని నిద్ర పుచ్చుతా అంటుంది. జాను, వివేక్‌లు కంగారు పడతారు. ఇక పంచాంగ శ్రవణం జరుగుతుంది.
జాను, వివేక్‌లు లక్ష్మీని పక్కకు పిలుస్తారు. నువ్వేం చేయకుండా నిన్ను నిద్ర పుచ్చుతా అని చెప్తుంది. ఇక మనీషా తన గది మొత్తం వెతుకుతుంది. ఇంతలో లక్ష్మీ వచ్చి ఏం వెతుకుతున్నావ్ మనీషా ఈ ట్యాబ్లెట్స్ కోసమేనా అని అంటుంది. మనీషా షాక్ అవుతుంది. వీటి గురించి ఏంటా అని ఎంక్వైరీ చేస్తే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అని అర్థమైంది. నన్ను ఈ రోజు అంతా నిద్ర పుచ్చాలని స్కెచ్ వేశావు అంతే కదా కానీ నీకే ఏదో అవ్వబోతుంది. మెల్లమెల్లగా నీకు మత్తు ఎక్కుతుంది. ఇందాక నువ్వు తాగిన పానకంలో ఈ ట్యాబ్లెట్ కలిపేశా అని అంటుంది. ఒక్క నిద్ర మాత్రతో నీ బండారం బయట పెడతానని నిన్ను మత్తులో ఉంచి నీ గురించి బయట పెడతా అని లక్ష్మీ చెప్తుంది.
మనీషా ముఖం కడుక్కుంటుంది. ఎన్ని చేసినా ట్యాబ్లెట్ల వల్ల మనీషా మత్తుతో బెడ్ మీద పడుకుండిపోతుంది. లక్ష్మీ మనీషాని జాగ్రత్తగా పడుకోపెట్టి నువ్వు మళ్లీ కళ్లు తెరిచే సరికి నీకు సన్మానం జరుగుతుంది.. చేయని తప్పునకు నువ్వు నిందితుడిగా మార్చిన ఆయన్ని నేను నిర్దోషిగా మార్చుతున్నా అనుకుంటుంది. ఇంతలో ఇంటికి డాక్టర్ వస్తుంది. అరవింద వాళ్లు ఎందుకు మీరు వచ్చారు అంటే మీ కోడలు పిలిచారు అంటుంది డాక్టర్. మనీషా పిలిచిందా అని దేవయాని అంటే కాదు నేను పిలిపించా అని లక్ష్మీ చెప్తుంది. ఎందుకు డాక్టర్‌ని పిలిచావని అడిగితే ఈ రోజు మనీషా కడుపులో బేబీ 3 నెలలు నిండుతాయి తనకి టెస్ట్‌లు స్కానింగ్ చేయిద్దామని అంటుంది. మిత్ర కోసం ఏమైనా చేస్తావా అని జయదేవ్ తిడతాడు. దేవయాని టెన్షన్ పడతుంది.
మనీషాని పిలవడానికి మీదకు వెళ్తుంది. మనీషాని ఎంత పిలిచినా మనీషా లేవదు. ఇంతలో జాను వివేక్‌లు వచ్చి మనీషా లేవడం లేదా కడుపుతో ఉంది కదా నిద్రపోనివ్వండి అంటారు. అరవింద, లక్ష్మీలు డాక్టర్‌ని తీసుకొని మీదకు వస్తారు. అరవింద లేపబోతే డాక్టర్ వద్దని పడుకుంటే స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకా కచ్చితంగా వస్తాయని అంటుంది. బలవంతంగా లక్ష్మీ దేవయానిని కిందకి తీసుకెళ్లిపోతుంది. డాక్టర్ మనీషాకి ఇంట్లోనే స్కానింగ్ చేస్తుంది. డాక్టర్ కిందకి రాగానే అరవింద బిడ్డ గుండె కొట్టుకుంటుందా బిడ్డ బాగుందా అని అడుగుతుంది. దాంతో డాక్టర్ మనీషా ప్రెగ్రెంట్ కాదని చెప్తుంది. అరవింద షాక్ అయిపోతుంది. తన కడుపులో ఎలాంటి బేబీ లేదని డాక్టర్ చెప్తుంది. తనకు ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ కూడా జరగలేదని అంటే తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని చెప్తుంది. మనీషా అబద్ధం చెప్పిందని డాక్టర్ చెప్తారు. మిత్ర, అరవింద కోపంతో రగిలిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















