Chinni Serial Today January 17th: చిన్ని సీరియల్: రిసప్షన్‌లో అదిరిపోయిన మదు, మ్యాడీ! ఆఫ్ టికెట్ గురించి నాగవల్లి ఏం తెలుసుకుంది?
Chinni Serial Today Episode January 17th మ్యాడీ, మధుల రిసెప్షన్ గ్యాండ్‌గా ఏర్పాటు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి బట్టల గురించి మధు తల్లిదండ్రులను అవమానించేలా మాట్లాడుతుంది. మధు వచ్చి అత్తయ్యా మీరు బట్టలు తీసుకోవద్దు.. నాకు తెలిసి ఉంటే తీసుకురావొద్దని చెప్పేద్దాన్ని.. పద్ధతి పద్ధతి అని మీరు ఇలా చేస్తారా.. మినిస్టర్ కొడుకు కోడలికి బట్టలు కొనే రేంజ్ మనకు ఉందా.. మా అత్తయ్య గారు చాలా ఖర్చు చేసి బట్టలు తీసుకొచ్చారు.. వాటి ఖరీదు మీరు ఊహించలేరు.. జీవితంలో కూడా మీరు అలా కొనలేరు.. ఇలాంటి చీప్ బట్టలు తీసుకోవడం ఆవిడ రేంజ్ కాదు.. కానీ మీరు ఎంత ప్రేమతో ఇస్తే తీసుకుంటారా అని అంటుంది.
నాగవల్లి మధుతో ఇంత ప్రేమగా తెస్తే నేను ఎందుకు తీసుకోనమ్మా,, కానీ రిసెప్షన్‌లో మీ మామయ్య గారు తీసుకొచ్చిన బట్టలు కట్టుకోవాలి.. అని చెప్పి ఆ బట్టలు తీసుకుంటుంది. ఇప్పుడు మీరు హ్యాపీ కదా సంతోషంగా కూర్చొండి అని చెప్పి నాగవల్లి మధు వాళ్ల తల్లిదండ్రుల్ని పంపిస్తుంది. నాగవల్లి వాళ్లు వెళ్లిపోగానే బట్టల్ని డస్ట్ బిన్‌లో పడేస్తుంది. అది సుబ్బు, స్వరూప చూసి బాధ పడతారు. తిలక్ కూడా ఫంక్షన్‌కి వస్తాడు. నాగవల్లి, దేవా బయటే ఉండి స్వాగతం పలుకుతారు. మీ కొడుకు కోడలికి సంబంధించి ఏం జరిగినా ముందు నేనే వస్తా అని తిలక్ అంటే అది మా కొడుకు కోడలి అదృష్టం అని వెటకారంగా నాగవల్లి అంటుంది.
మధు కూడా బయటకు వచ్చి మా పెళ్లి అవ్వడానికి కారణం అయ్యారు.. ప్రమాదం జరిగింది అని తెలిసి వెంటనే చూడటానికి వచ్చారు.. ఇప్పుడు మమల్ని ఆశీర్వదించడానికి వచ్చారు.. మిమల్ని చూస్తుంటే నాకు మా మేనమామ గుర్తొస్తున్నారు.. మీ రుణం తీర్చుకోలేను అని మధు థ్యాంక్స్ చెప్తుంది. మన మధ్య ఏదో బంధం ఉందమ్మా.. నీకు ఏ అవసరం ఉన్నా ఒక్క మెసేజ్ దూరంలో ఈ మేనమామ ఉంటాడు. అంకుల్ అని ఒక్క మెసేజ్ చేయ్ అంతా నేను చూసుకుంటా అని అంటాడు.
ఊరి వాళ్లు కూడా వస్తారు. దేవా తిలక్‌తో నేను అందరికీ రిటర్న్ గిఫ్ట్‌గా సిల్వర్ కాయిన్ ఇస్తున్నా.. నీకు ఇస్తా అనుకున్నావా.. నీకు సపోర్ట్ చేసిన నీ ఊరి జనంతో ఛీ కొట్టిస్తా అని అంటాడు. నేను నీకే భయపడను నీ రిటర్న్ గిఫ్ట్‌కి భయపడతానా అని తిలక్ అంటాడు. ఇక మధు, మ్యాడీ చక్కగా రెడీ అవుతుంటారు. మధుతో ప్రమీల మీరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు అని అంటే మేం పుట్టినప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నాం అని చెప్తుంది. ప్రమీల షాక్ అయితే మధు పుట్టినప్పటి నుంచి దేవుడు మా మనసులు కలిపేశాడు కదా అంటుంది.
వరుణ్ మ్యాడీతో చిన్నప్పటి నుంచి చిన్నిని ప్రేమించావ్,, కదా మరి మధుని ఎప్పుడు ప్రేమించావ్,, అని అడుగుతాడు. దానికి మ్యాడీ నేను చిన్నిని ప్రాణంగా ప్రేమించిన మాట నిజం.. మధు మెడలో మనస్ఫూర్తిగా తాళి కట్టడం నిజం.. మా ఇద్దరి మధ్య ఓ నిజం ఉంది అది నేను చెప్పాలి అనుకున్నప్పుడే చెప్తా అంటాడు. ఇక మధు అందంగా ఉందని ప్రమీల పొగుడుతుంది. ఇక మధు మ్యాడీని చూడటానికి మ్యాడీ దగ్గరకు వెళ్తుంది. మ్యాడీ చాలా బాగున్నాడని పొగిడేస్తుంది. నేను ఎలా ఉన్నానో చెప్పు అని మధు అడిగితే మ్యాడీ అలా చూస్తూ ఉండిపోతాడు. చంటి వచ్చి ఆటపట్టిస్తాడు. చంటి వెళ్లిపోయిన తర్వాత మధుతో మ్యాడీ ఏవరేజ్‌గా ఉన్నాం అంత బాలేవ్ అంటాడు. అవునా అని మధు మ్యాడీ దగ్గరకు వెళ్లి పట్టుకుంటుంది. ఏం చేస్తున్నావ్ అని మ్యాడీ సిగ్గు పడతాడు. మధు కాటుకతో మ్యాడీకి దిష్టి చుక్క పెడుతుంది. మరోవైపు మధుకి ఆఫ్ టికెట్ కాల్ చేస్తాడు. అది నాగవల్లి చూస్తుంది. నాగవల్లి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆఫ్ టికెట్ చిన్ని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















