Nindu Noorella Saavasam Serial Today January 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అంజుతో ఫోన్ మాట్లాడిన భాగీ – అయోమయంలో చంభా, మనోహరి
Nindu Noorella Saavasam serial Today Episode January 17th: బుజ్జమ్మ కోసం అంజుకు ఫోన్ చేస్తుంది భాగీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: రాత్రి అయినా బుజ్జమ్మ ఆశ్రమానికి రాదు దీంతో రాజు కంగారుగా అటూ ఇటూ తిరుగుతుంటాడు. మరోవైపు భాగీ ఆశ్రమంలోని పిల్లలకు భోజనం వడ్డిస్తుంది. పిల్లలు అందరూ క్యూ పద్దతిలో వెళ్లి భోజనం చేస్తుంటారు.
భాగీ: పిల్లలు అందరూ కడుపునిండా తినాలి. కొంచెం కూడా మిగల్చకూడదు. మొత్తం తినాలి వేస్ట్ చేయోద్దు
పిల్లలు: సరే మేడం
ఒక బేబి: మేడం బుజ్జమ్మ ఇంకా రాలేదేంటి మేడం ఎప్పుడొస్తుంది మేడం?
భాగీ: తను వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది కాసేపట్లో వస్తుంది. మీరు తృప్తిగా భోజనం చేయసేయండి
పిల్లలు: అలాగే మేడం
అమర్ ఇంట్లో కూడా అందరూ భోజనం చేస్తుంటారు. యాదమ్మ వడ్డిస్తుంది.
అంజు: బుజ్జమ్మ మా యాదమ్మ చేసే వంటలు ఆంత బాగోవు ఏమీ అనుకోకు మీ టీచర్ చేసిన వంట టేస్టీగా ఉంది. అచ్చం మా మిస్సమ్మ చేసిన వంటలాగా ఉంది.
మనోహరి, చంభా షాక్.. ఆశ్రమంలో భాగీ భోజనం వడ్డిస్తూనే ఉంటుంది.
రాజు: ( మనసులో) చీకటి పడింది బుజ్జమేమో ఇంకా రాలేదు. ఇప్పుడు భాగీ గారు అడిగితే ఏం చెప్పాలి
భాగీ: బాబాయ్ బుజ్జమ్మ ఇంకా రాలేదు ఏంటి..?
రాజు: వచ్చేస్తుందమ్మా ఇందాకే ఫోన్ చేశాను కాసేపట్లో బయలుదేరుతుంది అన్నారు.
భాగీ: ఏంటి బాబాయ్ ఇది సాయంత్రమే వచ్చేస్తుంది అన్నారు. చీకటి పడిపోయింది ఇంకా రాలేదు. అసలు తను ఎవరి ఇంటికి వెళ్లింది.
రాజు: వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది అని చెప్పాను కదమ్మా..? అదే తన క్లాస్‌మేట్
భాగీ: అదే ఎవరా ఫ్రెండ్ ఒకసారి వాళ్లకు ఫోన్ చేయండి.
రాజు: నేను ఇందాకే చేశానమ్మా
భాగీ: మళ్లీ చేయండి బాబాయ్ నేను మాట్లాడతాను
రాజు: ఎందుకమ్మా నేను మాట్లాడాను కదా..?
భాగీ: ఫ్లీజ్ బాబాయ్ నేను ఈ టెన్షన్ పడలేను. ఫోన్ చేస్తారా..? లేదా..?
రాజు: అలాగేనమ్మా
అమర్ ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు.
అంజు: రాథోడ్ మా ఫోన్ రింగ్ అవుతుంది చూడు
రాథోడ్ వెళ్లి ఫోన్ చూస్తాడు
ఆనంద్: ఎవరు చేశారు
రాథోడ్: ఎవరో తాతయ్య
ఆనంద్: రామ్మూర్తి తాతయ్య చేస్తున్నారా..?
రాథోడ్: లేదు ఎవరో తాతయ్య
మనోహరి షాక్
ఆకాష్: ఒన్లీ తాతయ్యనా..? ఎవరు తాతయ్య..?
అటువైపు రాజు చేతిలో ఫోన్ లాక్కుంటుంది భాగీ.
రాజు: ( మనసులో) అయ్యో బుజ్జమ్మ వెళ్లింది తన ఇంటింకేనని భాగీ గారికి తెలిసిపోతుందేమో..? ఇప్పుడు ఏం చేయాలి రా భగవంతుడా..?
అంజు: అనాథ శరణాలయం తాతయ్య బుజ్జమ్మ కోసం కాల్ చేసి ఉండొచ్చు ఇటివ్వు… బుజ్జమ్మ తాతయ్య కాల్ చేశారు మాట్లాడు
అంజు ఫోన్ బుజ్జమ్మకు ఇస్తుంది.
బుజ్జమ్మ: హలో తాతయ్య
భాగీ: బుజ్జమ్మ నేను అమ్మని
బుజ్జమ్మ: ఏంటమ్మా ఫోన్ చేశావు
బాగీ: ఎక్కడున్నావు..? బుజ్జమ్మ
బుజ్జమ్మ: మా ఫ్రెండు వాళ్ల ఇంట్లో
భాగీ: ఎవరా ఫ్రెండ్
బుజ్జమ్మ: స్కూల్ లో ఒక అక్క పరిచయం అయింది అని చెప్పాను కదా..? ఆ అక్క వాళ్ల ఇంటికి వచ్చాను
భాగీ: ఇంకా అక్కడే ఉన్నావా..? ఎప్పుడు వస్తావు
బుజ్జమ్మ: భోం చేస్తున్నాను అమ్మా.. తినగానే వచ్చేస్తాను
భాగీ: అదేంటి నేను లేకుండా ఎప్పుడూ తినవు కదా..? అక్కడెలా తింటున్నావు..?
బుజ్జమ్మ: సారీ అమ్మా ఇక్కడ అందరూ ఫోర్స్ చేశారు అందుకే తింటుంన్నాను.. ఇక్కడే కొంచమే తింటాను.. అక్కడికి వచ్చాక నీతో కలిసి ఇంకొంచెం తింటాను.
భాగీ: అదేం వద్దు అక్కడే కడుపు నిండా తిను.. ఇక్కడ పిల్లలు కూడా తింటున్నారు
బుజ్జమ్మ: సరే నేను రాకుండా నువ్వు తినవు కదా..?
భాగీ: నువ్వు వచ్చాక తింటాను కానీ ఫోన్ ఒకసారి నీ ఫ్రెండ్ కు ఇవ్వు
అనగానే రాజ్ భయపడుతుంటాడు. వెంటనే రాజు ఫోన్ లాక్కుంటాడు. అంజుతో ఫోన్ మాట్లాడి నేనే బుజ్జమ్మ కోసం వస్తున్నాను అని చెప్తాడు. రాజు వెళ్లగానే భాగీ అనుమానంగా రాజు ఏదో దాస్తున్నాడు అదేంటో తెలుసుకుంటాను అని రాజుకు తెలియకుండా ఫాలో అవుతుంది భాగీ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















