Chinni Serial Today January 13th: చిన్ని సీరియల్: చిన్ని పేరు వినకూడదన్న మ్యాడీ.. మధు ప్రేమలో పడతాడా? నాగవల్లి, లోహితల మధ్య ఏం జరిగింది?
Chinni Serial Today Episode January 13th నాగవల్లి ఇంట్లో అందరికీ నగలు కొనడం లోహిత నగలు చూసి కక్కూర్తి పడి అనుమానం వచ్చేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ ఫ్రస్ట్రేషన్‌తో ఆసనాలు వేస్తాడు. ఏంటి ఇది అని మధు అడిగితే పెళ్లాలు పెట్టిన టార్చర్‌కి ఇలాంటి ఆసనాలు వేయాలని అంటాడు. ఇంత వరకు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా కానీ నువ్వు బెస్ట్ సీలు రాకాసి అని అంటాడు. నీ ఆటలు తట్టుకోలేక నేను చిటికెలు వేసుకుంటున్నా నన్ను వదిలేయ్ అంటాడు. నువ్వు చిన్నిని వదిలేసినంత ఈజీగా నేను వదిలేయను అని మధు అంటుంది. దానికి మ్యాడీ వద్దు చిన్ని పేరు ఈ ఇంట్లో వద్దు.. నా తల్లిని చంపిన హంతకురాలి కూతురి పేరు ఈఇంట్లో వద్దు.. జీవితంలో నేను వినకూడదు అనుకున్న పేరు చిన్ని.. నేను అనకూడదు అనుకున్న ఒకే ఒక్క పేరు చిన్ని.. జీవితంలో నేను కలవకూడదు అనుకున్న పేరు కూడా చిన్ని అని కోప్పడతాడు.
మధు మ్యాడీతో ఆ చిన్ని నీకు ఎదురు పడితే ఏం చేస్తావ్ అంటే చావనైనా చస్తాను కానీ ఆ చిన్ని ముఖం చూడను అని వెళ్లిపోతాడు. నువ్వు చిన్ని ముఖం చూసేలా మళ్లీ ప్రేమించేలా అతి త్వరలోనే చేస్తా అని మధు అనుకుంటుంది. నాగవల్లి ఇంటికి నగలు తెప్పించి అందరికీ ఇస్తుంది. వసంత వద్దు అనేస్తే నీ అల్లుడు రిసెప్షన్‌కి నీకు లేకపోతే ఎలా అని నాగవల్లి అంటుంది. దానికి వసంత నా అల్లుడి రిసెప్షన్ నా కూతురితో అయితే సంతోషంగా నగలు వేసుకుంటా కానీ వేరే ఎవరితో అయితే నేను ఎందుకు వేసుకుంటా అంటుంది. నాగవల్లి అయిపోయిన దాన్ని వదిలేయమని వసంత, శ్రేయలకు నగలు ఇస్తుంది.
లోహిత ఓ నగ తీసుకొని ఇది నాకేనా అని అడిగి తీసుకొని ఓవర్ ఎగ్జైట్ అవుతుంది. ఆ గాజులు, రింగులు, వంకీలు నాకే ఇచ్చేయండి.. ఓ వడ్డానం కూడా కొనిచ్చేయండి అని అంటుంది. నాగవల్లి లోహితతో నువ్వు నిజంగా రిచ్ ఫ్యామిలీనేనా.. నీ కక్కూర్తి చూస్తే అలా అనిపించడం లేదు.. పేద ఇంటి నుంచి వచ్చి రిచ్ అని చెప్తున్నట్లు ఉందని నాగవల్లి అంటుంది. నేను పుట్టడమే రిచ్ ఫ్యామిలీలో పుట్టా అని లోహిత అంటుంది. అయితే నీకు మీ వాళ్లు పుట్టినప్పటి నుంచి ఏం కొనిపెట్టలేదా అంత ఓవర్ చేస్తున్నావ్ అంటే నాకు గోల్డ్ అంటే చాలా పిచ్చి అని అంటుంది.
లోహిత టాపిక్ డైవర్ట్ చేయడానికి రిసెప్షన్ కోసం అందరికీ అన్నీ తీసుకొచ్చారు.. పెళ్లి కూతురి కోసం ఏం తెచ్చారు అంటే నేనేం కొనలేదు అని నాగవల్లి అంటుంది. కూరగాయలు అమ్ముకున్న వాళ్ల కూతురికి ఎందుకు అనుకుంటారని శ్రేయ అంటే నాకు ఆ నగలు అవసరం లేదు.. నా మెడలో నా భర్త కట్టిన తాళి ఉంది అని అంటుంది. నాగవల్లితో ప్రమీల నీ కోడలికి ఎందుకు కొనలేదు అంటే నాకు కొనడం ఇష్టం లేదు.. కొత్తగా పెళ్లయిన వాళ్లు వెళ్లి వాళ్లకి నచ్చిన నగలు కొనుక్కుంటే బాగుంటుందని కొనలేదు అంటుంది. మ్యాడీతో మధుని తీసుకెళ్లమని చెప్తుంది.
శ్రేయ, లోహిత అలా సైలెంట్ అయిపోతారు. మధు, మ్యాడీ కారులో బయల్దేరుతారు. నన్ను షాపింగ్‌కి తీసుకెళ్లడం బాగుందా అని మధు అడిగితే కాదు.. తల గోడకు బాదుకుంటే హాయిగా ఉంటుందని అంటాడు. ఓ చోట మ్యాడీ సడెన్ బ్రేక్ వేయగానే మధు మ్యాడీ మీద వాలిపోతుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. తర్వాత మ్యాడీ మధుకి సారీ చెప్తాడు. భార్యకి సారీ చెప్పక్కర్లేదు అని మధు అంటుంది. మళ్లీ భార్య కార్డ్ తీశావా అని మ్యాడీ అడుగుతాడు. అదే నా ఐడెంటిటీ అని మధు అంటుంది. ఇక మ్యాడీ సీట్ బెల్ట్ పెడుతూ ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. ఏంటిఅలా చూస్తున్నావ్ చలించావా అని మధు అడుగుతుంది. అలాంటిది ఏం లేదు ఉండదు అని అంటాడు.
మ్యాడీ మధుతో నగలు కొనడానికి ఎక్కడికి వెళ్దాం అంటే పెద్ద షాపులకు వద్దులే చిన్న షాప్‌కి వెళ్దాం ఓ చైన్ కొనుక్కుంటా అని అంటుంది. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం మధు అని మ్యాడీ అంటాడు. ఆ ఇష్టమే భార్య మీద ప్రేమగా మారిపోతుందని అంటుంది. అంత లేదు అని మ్యాడీ అంటాడు. ఇక ఇద్దరూ ఓ చిన్న షాపు దగ్గరకు వెళ్తారు. ఓ పూలావిడ వచ్చి గుడిలో మీ పెళ్లి వైరల్ అయిందని మాట్లాడి భార్యకి పూలు కొను అని చెప్పి పూలు తీసుకొచ్చి మ్యాడీకి ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















