అన్వేషించండి

Chinni Serial Today February 7th:చిన్ని సీరియల్: మధుని కిడ్నాప్ చేసింది ఎవరు? దేవాకి మెసేజ్‌లు! బాలరాజు ఆచూకీ తెలుసుకున్న ఆఫ్‌టికెట్!

Chinni Serial Today Episode February 7th మ్యాడీ టాటూ ఉన్న కిడ్నాపర్‌ని పట్టుకోవడం.. దేవా బాలరాజుని ఎక్కడ దాచాడో ఆఫ్ టికెట్ కనిపెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు గురించి ఏం తెలీదు అని మ్యాడీ తల్లిదండ్రులతో చెప్తే దానికి లోహిత మ్యాడీకి బొమ్మలు వేయడం వస్తే బాగుండేది.. మ్యాడీ చెత్త మనుషుల్ని చూశాడు కదా.. వాళ్ల డ్రాయింగ్ అయినా వేయించేవాడు.. కనీసం వాళ్లు చేతుల మీద టాటూలు అయినా ముఖం మీద పుట్టు మచ్చలు అయినా గుర్తుంటే మధు గురించి తెలిసేది అంటుంది. దాంతో మ్యాడీ గుర్తు చేసుకొని ఒక మనిషికి టాటూ ఉందని అంటాడు.

దేవా తన మనిషికి కాల్ చేసి నీతో పాటు కిడ్నాప్‌కి వచ్చిన వాడి చేతి మీద టాటూ ఉంది కదా మ్యాడీ అది చూశాడు వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పు అని అంటాడు. ఇక శ్రేయ అయితే సలహా ఇచ్చిన లోహితను ఫుల్లుగా తిడుతుంది. మధు ఇంటికి వస్తే నీ  ఒంటి నిండా వాతలు పెడతా అని వార్నింగ్ ఇస్తుంది. నోటి దురదతో అనవసరంగా ఇరుక్కున్నా లోహిత తలబాదుకుంటుంది. దేవా ఆలోచిస్తే ఉంటే నాగవల్లి వెళ్తుంది. ఏంటి అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. తన గురించి ఎందుకు అని నాగవల్లి అడిగితే మధు కిడ్నాప్ మనకు తలనొప్పిగా మారిందని అంటాడు. మధుని మ్యాడీ ఎంత దగ్గర అయిండకపోతే మధుని నువ్వు కిడ్నాప్ చేశావేమో అని అనుమానిస్తాడు.. మధుని మ్యాడీని ఎలా అయినా దూరం చేయాలి అని నేను ఆలోచిస్తున్నా అని నాగవల్లి అంటే ఇక ఆలోచించడాలు లేవు ఆమధు దొరికితే దాన్ని చంపేయడమే ఈ సమస్యకి పరిష్కారం అని దేవా అంటాడు. 

నాగవల్లి మనసులో దాన్ని చంపడానికి ముందు దాని మీద మ్యాడీకి ఉన్న ప్రేమని చంపేయాలి అని అనుకుంటున్నా.. అసలు మధుని ఎవరు కిడ్నాప్ చేసుకుంటారు. ఆ తిలక్ కిడ్నాప్ చేస్తాడా.. వాడికి అంత సీన్ లేదులే.. మరి ఆ చిన్నినే తిలక్‌తో కలిసి ఇదంతా చేస్తుందా.. సరేలే ఆట అది మొదలు పెట్టింది కదా నేను ఆట ముగిస్తా అని నాగవల్లి మనసులో అనుకుంటుంది. మ్యాడీ టాటూ డ్రాయింగ్ గీయించి దాని ఆధారంగా అందరినీ అడుగుతూ ఉంటాడు. ఇంతలో ఆఫ్ టికెట్‌ని మ్యాడీ చూసి పిలుస్తాడు. ఆఫ్ టికెట్ పారిపోవాలని చూస్తే మ్యాడీ పట్టుకొని చిన్ని ఎక్కడుందిరా అని అడుగుతాడు. నాకు తెలీదు బాబు కానీ చిన్ని నీకు ఏదో చెప్పాలి అని నీ చుట్టూ తిరుగుతుందని తెలుసు అంటాడు. అది ఇప్పుటికే చెప్పావు కదరా.. ఆ చిన్ని నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ కష్టాలే.. ఇప్పుడు నా మధు కిడ్నాప్ అయింది.. ఆ చిన్నినే మధుని కిడ్నాప్ చేసుకుంటుంది అని మ్యాడీ అంటాడు. 

ఆఫ్ టికెట్ చాలా కంగారు పడతాడు. మీ డాడీ శత్రువులు ఇలా చేసుంటారు అని అంటాడు. మ్యాడీ ఆలోచనలో పడతాడు. ఆఫ్ టికెట్ ఇదంతా దేవా పనే అని అనుకొని ఎలా అయినా బాలరాజు ఉన్న ప్లేస్ తెలుసుకోవాలని అనుకుంటాడు. లోహిత శ్రేయ దగ్గరకు వెళ్లి మధు కనిపించదు.. ఇక మనం పండగ చేసుకుందాం అని అంటుంది. ఇంతలో శ్రేయ నీకు మధు చిన్నప్పటి నుంచి తెలుసు కదా.. చిన్నప్పటి నుంచి మీకు కక్షలు ఉన్నాయి కదా అంటుంది. తను నాకు ఏం తెలీదు.. ఎంటెక్‌లోనే తెలుసు అంటుంది. మధుకి కీడు జరగాలి అని నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే నీకు ఏవో పాత పగలు ఉన్నాయి అనిపిస్తుందని అంటుంది శ్రేయ. అలా ఏం లేదు నా ఆడపడుచుకి మంచి జరగాలి అని నేను కోరుకుంటున్నా అని అంటుంది. 

ఆఫ్ టికెట్ దేవాకి స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహితుడు కోసం ప్రాణం ఇవ్వడం కష్టం కాదు కానీ అంతటి అర్హత ఉన్నవాడు దొరకడం కష్టం.. నువ్వు మిత్ర ద్రోహం చేసిన ఆ మిత్రుడికి ఈ రోజు విముక్తి కలుగుతుంది అని మెసేజ్ చేస్తాడు. దేవా, నాగవల్లి ఆ మెసేజ్‌లు చూసి ఏంటి ఇదంతా అనుకుంటారు. ఈ మెసేజ్‌లు ఆఫ్ టికెట్ పంపించి ఉంటాడా.. నీ మిత్రుడికి విముక్తి అంటే బాలరాజుకే కదా.. ఆ ఆఫ్ టికెట్ ఏదో చేసి బాలరాజుని తప్పించుంటాడు కదా అంటుంది. వెంటనే దేవా రౌడీలకు కాల్ చేసి బాలరాజు ఏం చేస్తున్నాడు అంటాడు. మేం బయటకు వచ్చాం సార్ అంటాడు. దేవా కూడా బాలరాజు దగ్గరకు బయల్దేరుతాడు. ఆఫ్ టికెట్ కూడా ఫాలో అవుతాడు. 

మ్యాడీ మొత్తం తిరుగుతూ ఆ టాటూ ఉన్న మనిషిని పట్టుకుంటాడు. మధుని కిడ్నాప్ చేసింది నువ్వే కదా మధుని ఎక్కడ దాచావ్ అని అతన్ని కొడతాడు. మ్యాడీని ఆ రౌడీ నెట్టేసి పారిపోతాడు. దేవాని ఫాలో అయిన ఆఫ్ టికెట్ బాలరాజుని దాచిన ప్లేస్ కనిపెట్టేస్తాడు. బాలరాజు దేవాని చూసి నవ్వుతూ నువ్వు ఇంత సీరియస్‌గా ఉన్నావ్ అంటే నా కూతురు నీకు దొరకలేదు కదా.. నిన్నూ నీ ఆలోచనను తారు మారు చేసి నా కూతురు ఎలా తప్పించుకుందో చూశావా.. అదిరా నా కూతురు అంటే.. నువ్వేదో నన్ను నా కూతురిని చంపాలని చూస్తున్నావ్ కానీ చివరకు మా చేతుల్లోనే నువ్వు చస్తావ్ అని బాలరాజు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 11th: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
నువ్వులేక నేను లేను: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
Karthika Deepam 2 Serial Today August 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget