Brahmamudi Serial Today February 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ధాన్యలక్ష్మీకి ఫోన్ చేసిన రుద్రాణి – అయోమయంలో రాజ్, కావ్య
Brahmamudi serial today episode February 7th: రుద్రాణి, ధాన్యలక్ష్మీకి ఫోన్ చేసి మినిస్టర్ గురించి చెప్పి బెదిరించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: మినిస్టర్ ఇంటికి వచ్చిన రుద్రాణికి ధర్మేంద్ర జరగిన విషయం మొత్తం చెప్పి నువ్వు వాళ్లు బెదిరిపోయారు ఇక నా ఇంటి వైపు కూడా చూడరని అన్నావు.. వాళ్లేమో నిజాన్ని తెలుసుకుని అందరికి తెలిసేలా చేస్తామని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. అంటూ కోప్పడతాడు. దీంతో రుద్రాణి కూడా మినిస్టర్‌ను తిడుతుంది.
రుద్రాణి: ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు
ధర్మేంద్ర: నువ్వు చెప్పినట్టు వాళ్లు భయపడ్డారేమో అనుకున్నాను కానీ ఇంకా వాళ్లు నిజాన్ని బయటకు తీసేదాకా వెళ్లారు
రుద్రాణి: ఈ విషయం నాకు వదిలేయ్ నేను చూసుకుంటాను
ధర్మేంద్ర: నీకే వదిలేస్తున్నాను.. ఇంతకన్నా ఎక్కువ ఏదైనా అయితే నేను యాక్షన్ లోకి దిగాల్సి వస్తుంది.
అంటూ మినిస్టర్ వెళ్లిపోతాడు. వెంటనే రుద్రాణి, ధాన్యలక్ష్మీకి ఫోన్ చేస్తుంది.
రుద్రాణి: హలో ధాన్యలక్ష్మీ నేను రుద్రాణి..
ధాన్యం: తెలుసు నీ వాయిస్ గుర్తు పట్టాను.. చెప్పు ఏంటి ఫోన్ చేశావు..
రుద్రాణి: ధాన్యలక్ష్మీ ఇంకా నా మీద కోపం తగ్గలేదా..?
ధాన్యలక్ష్మీ: కోపం తగ్గడానికి నువ్వు చేసిన దరిద్ర్యం అంతా ఇంతా కాదు. నిజానికి నిన్ను జైళ్లో పెట్టించాలి
రుద్రాణి: నీ జీవితానికి ఉపయోగపడే విషయం చెప్పడానికి ఫోన్ చేశాను.
ధాన్యలక్ష్మీ: నాకు నీ సలహాలు, హెచ్చరికలు, జాగ్రత్తలు ఏం అవసరం లేదు అసలు నాకు వినే ఉద్దేశం కూడా లేదు
రుద్రాణి: నీ కోడలి కడుపులో ఉన్న వారసుడి ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా వినిపించుకోవా..?
ధాన్యలక్ష్మీ: ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి
రుద్రాణి: అవును ధాన్యలక్ష్మీ ఆ రాజ్ కావ్యలు మినిస్టర్‌తో ఎందుకు శత్రుత్వం పెంచుకున్నారో కానీ ఆ మినిస్టర్ మాత్రం రాజ్ - కావ్యలు చేసిన తప్పు వల్ల మన కుటుంబం మీదే పగ పెంచుకున్నాడు. ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడతాడో? ఎవరి ప్రాణాలను తీస్తాడో ఎవ్వరికీ తెలియదు. మొన్న యాక్సిడెంట్ కూడా ఆ మినిస్టర్ చేయించాడని నా అనుమానం. మళ్లీ అలాంటి ప్రమాదం నీ కొడుక్కి, కోడలికి వచ్చిందనుకో.. నీ పరిస్ధితి ఏంటీ? ఆ రాజ్, కావ్యలు ఆ మినిస్టర్‌తో గొడవ పెట్టుకోకుండా నువ్వే ఆపాలి.
ధాన్యలక్ష్మీ: నేనా నేనేం చేయగలను
అంటూ ధాన్యలక్ష్మీ అడుగుతుంది. ఇంట్లో నువ్వే అందరి ముందు రాజ్, కావ్యను నిలదీయ్.. మినిస్టర్‌తో గొడవ పెట్టుకోవద్దని అసలు ఆయన వైపు తిరిగి చూడకూడదని బెదిరించు అంటూ రుద్రాణి తన మాటలతో ధాన్యలక్ష్మీని మానుకులేట్ చేస్తుంది. తర్వాత అందరూ హాల్లో కూర్చుని ఉండగా రాజ్, కావ్య వస్తారు.
రాజ్: పాపకు ఆపరేషన్ రేపే చేస్తారట..
కావ్య: పాప ఈ ప్రమాదం నుంచి బయటపడుతుందో లేదోనని భయంగా ఉంది.
అపర్ణ: ఓదారుస్తూ.. నువ్వు ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ బిడ్డకు జన్మనిచ్చావు. అలాంటి నీకు బిడ్డను దేవుడు దూరం చేయడు కావ్య
అంటూ ఓదారుస్తుంటే.. ధాన్యలక్ష్మీ వస్తుంది. కోపంగా చూస్తుంది.
ధాన్యలక్ష్మీ: వీళ్లు చేసిన నిర్వాకం వల్లే భయపడుతున్నారు తప్పించి, పాపకు చేసే ఆపరేషన్ వల్ల కాదు.
కావ్య: ఏం జరిగింది చిన్నత్తయ్యా
ధాన్యలక్ష్మీ: చేసిన తప్పుని ఇద్దరూ కలిసి దాచారు.. ఇంట్లో మూడు యాక్సిడెంట్స్ తృటిలో తప్పిపోయాయి. వీళ్లిద్దరూ కలిసి వాడితో శత్రుత్వం పెట్టుకున్నారు. దాంతో వాడు మనింట్లో వాళ్లని చంపాలని అనుకున్నాడు. మళ్లీ వాడి జోలికెళ్తే ఈ కుటుంబాన్ని నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. వీళ్లు అన్నట్టు అది వ్యాపార శత్రుత్వం కాదు.. ఇంకెదో ఉంది. అందుకే వాడు కక్ష కట్టాడు..
అపర్ణ: ఎవరి గురించి మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మీ..
ధాన్యలక్ష్మీ: ఇంకెవరు ఆ మినిస్టర్ తో వీళ్లు పెట్టుకున్న గొడవ గురించే అక్కా.. ఈ కుటుంబం, నా కొడుకు, కోడలు ఏమైపోతారోనని భయంగా ఉంది. వీళ్లు మనకి చెప్పిందొకటి, చేస్తోందొకటి.. వీళ్లు పదే పదే ఆ మినిస్టర్‌తో గొడవ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు వాడు మనందరి మీద కక్ష కట్టి తిరుగుతున్నాడు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనల్ని చంపాలని చూస్తున్నాడు .
ఇందిరాదేవి: ఏంటి ధాన్యం నువ్వు మాట్లాడేది.. మినిస్టర్ వల్ల మనకు ప్రాణహాని ఏంటి..?
ధాన్యలక్ష్మీ: వాడి వల్ల ఈ కుటుంబానికి ప్రమాదం పొంచి లేదని రాజ్, కావ్యలను చెప్పమనండి.. వాడు నట్టింట్లో నిలబడి బెదిరిస్తుంటే వీరిద్దరూ ఏం చేశారు? ఈ ఇంట్లో ఏదైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు..?
అంటూ ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంటే.. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. రాజ్, కావ్య మౌనంగా ఉండిపోతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















