Chinni Serial Today july 25th: చిన్ని సీరియల్: అన్న, తల్లికి దొరికిపోయిన లోహిత, మధుపై వల్లి పగ! వరుణ్ ప్రేమలో పడ్డాడా?
Chinni Serial Today Episode july 25th లోహిత ఇంట్లో అన్న, అమ్మలకు తెలీకుండా ఇంట్లోకి రావాలనుకోవడం ఇద్దరూ లోహితను చూసి ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి మధుని తన ఫ్రెండ్ పద్దూకి అప్పగిస్తాడు. పద్దూ మధుని తీసుకొని వెళ్తుంది. ఇక లోహిత గెటప్ మార్చేసి మహి ఇచ్చిన డైమండ్ నక్లెస్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. తన టైం మారిపోతుందని చెప్పడానికి సింబాలిక్‌గా ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చావని లవ్‌యూ వరుణ్ అనుకుంటుంది. తర్వాత అన్నయ్య, అమ్మ పడుకోవడం చూసి గెంతులేసుకొని ఎవరికీ తెలీకుండా ప్లాన్ చేసేశా అని గెంతులేస్తుంది.
లోహితను సరళ, చందులు ప్రశ్నిస్తారు. లోహిత వాష్రూంకి వెళ్లానని కవర్ చేస్తుంది. గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోతే సరళ ఒక్కటి పీకుతుంది. ఎక్కడికి వెళ్లావే బెడ్ మీద దిండు పెట్టి ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. దాంతో లోహిత ఫ్రెండ్ భర్త్‌డే పార్టీకి వెళ్లానని చెప్తుంది. మీరు పంపించరు అని చెప్పకుండా వెళ్లానని అంటుంది. ఇద్దరికీ సారీ చెప్పి కన్విన్స్ చేసేస్తుంది. మళ్లీ గుడ్ నైట్ చెప్పి వెళ్తుంటే చందు ఆపుతాడు. చందు లోహితతో నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా అంటాడు. అడుగు అన్నయ్య అని లోహిత అడిగితే నిజంగా బీరువాలో డబ్బు నువ్వు తీయలేదు కదా అంటే ఏంటి అన్నయ్య నన్ను అనుమానిస్తున్నావా నేను నీచెల్లిని.. సత్యంబాబు కూతుర్ని అమ్మ పెంపకంలో పెరిగాను అన్నయ్య అని ఒట్టు పెడుతుంది. ప్రామిస్ ఎందుకులే వెళ్లి పడుకో అని చందు అంటాడు.
పద్దూ మధుని తీసుకొచ్చి మధు గదిలో పడుకోపెడుతుంది. మధు పద్దూని కూడా లాగేసి పడుకోవే నా దగ్గర పడుకోవే అని పడుకోమని అంటుంది. మధ్యలో పద్దుని లేపి ఆ పిల్లి గడ్డం మంచోడే అంటుంది. అవును అని పద్దు అంటే ఏంటే మంచోడు అప్పుడప్పుడు చెడ్డోడు అంటుంది. అవునవును అని పద్దూ అంటే ఏంటే చెడ్డోడు అప్పుడప్పుడు గొప్పోడు అని మహిని పొగిడేస్తాడు. నేను తాగిన డ్రింక్‌లో ఏదో కలిపేశారు రేపు ఒక్కొక్కరికి ఫుల్‌గా ఇస్తానని అంటుంది. పడుదువుకానీలే పడుకో అని పద్దూ అంటుంది. పద్దూ మధ్య మధ్యలో లేచి పద్దూని లేపేస్తుంటుంది.
మరోవైపు నాగవల్లి తన పీఏతో గుడిలో జరిగిన ఘటన సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తుంది. మధు తన మీద తిరగబడటం చూసి కోపంతో రగిలిపోతుంది. ఇంతలో మహి, వరుణ్, శ్రేయలు వచ్చి నాగవల్లిని ఏమైందని అడుగుతారు. ఏం లేదని పొలిటికల్ ప్రాబ్లమ్స్ అని అంటుంది. ఇక శ్రేయ అత్తతో బావ క్యాంటీన్ ఫుడ్ బాలేదని బావ తినడం లేదని చెప్తుంది. దాంతో ఇంటి నుంచి క్యారేజ్ ఇప్పిస్తానని అంటుంది. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని వల్లి అడిగితే ఒకమ్మాయి ఇరిటేట్ చేస్తుందని శ్రేయ మధు గురించి చెప్తే నాగవల్లి సీరియస్ అయి సాయంత్రంలోపు అది కాలేజ్‌లో లేకుండా చేస్తా అంటే మహి అలాంటిది ఏం లేదని చెప్తాడు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత నాగవల్లి మధు అడ్రస్ కనుక్కోమని అంటుంది. ఏపీ కనుక్కున్నానని చెప్పి తనకు తండ్రి అంటే చాలా ఇష్టమని చెప్తాడు. ఆ ఇష్టం మీదే దెబ్బ కొట్టాలని అతనికి యాక్సిడెంట్ అవ్వాలి ఎవరు చేశారో తెలీక వాళ్లు తల పట్టుకోవాలని అంటుంది.
మరోవైపు లోహిత తన ఫ్రెండ్స్ సరదాగా ఉంటారు. వరుణ్‌కి తను పేదమ్మాయి అని తెలిసే లోపు లవ్‌లో దించేయాలని అనుకుంటుంది. ఇంతలో మధు అక్కడికి వచ్చి రాత్రి పార్టీలో మందు కలిపింది నువ్వే కదా అని అంటుంది. దానికి లోహిత నేను ఎందుకు కలుపుతాను నువ్వు ఇలా మందు తాగుతావని తెలిస్తే నిన్ను పిలిచేదాన్ని కాదు అని అంటుంది. మధు వాళ్లకి మందు కలిపింది ఎవరో తెలుసుకుంటా అప్పుడు ఉంటుంది మీకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. మహి క్లాస్‌లో ఉంటే మధు వెళ్లి మహిని చూసి మహి ముందుకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య-దేవాల పోరాటం.. మిథునని తండ్రి తీసుకెళ్లిపోతాడా? సత్యమూర్తి దేవాకి ఏం చెప్పాడు?





















