Prema Entha Madhuram September 7th: అక్షర కోసం షవర్ తయారు చేసిన అభయ్ - ఆర్యని దెబ్బ కొట్టేందుకు ఛాయా కొత్త ప్లాన్
ఆర్యని దెబ్బ కొట్టడానికి ఛాయాదేవి, మాన్సి తో కొత్త ప్లాన్ వేసింది. దాంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema entha madhuram september 7th: ఈరోజు ఎపిసోడ్ లో ఆకాంక్ష ఆర్యతో, మా స్కూల్ కి కష్టం వచ్చినప్పుడు మేమే కదా స్టాండ్ తీసుకోవాలి అని అంటుంది.
అను: వాళ్లది మీ రక్తం సార్ మీలాగే ఆలోచిస్తున్నారు. అని మనసులో అనుకుంటుంది.
ఆర్య: నువ్వు కూడా అభయ్, చాలా బ్రేవ్ గా ఫైట్ చేశావు.
అభయ్: నేను ఫైట్ చేసింది మా స్కూల్ కోసం, మీ పొగడ్తలు కోసమేమి కాదు.
టీచర్: అలా మాట్లాడకూడదు అభయ్.
ఆర్య: ఇట్స్ ఓకే మేడం. ఇంకెప్పుడైనా స్కూల్ కి ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి నేను ఉన్నాను ఎవరు భయపడొద్దు. అని అనగా అందరూ చప్పట్లు కొడతారు. అను ఒక మూల నుంచి సంబర పడుతుంది.
ఆ తర్వాత సీన్లో ఛాయాదేవి వెంట వెంటనే ఒక బాటిల్డు నీళ్లు భయం తో తాగుతుంది.
మాన్సి: మా బ్రో యిన్ లా కి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను అని ఇప్పుడు మీరు తాగుతున్నారు.
ఛాయాదేవి: షట్ అప్. నేను అజ్ఞాతంలో ఉన్నప్పుడే వాళ్ళిద్దరికీ చుక్కలు చూపించాను. ఇప్పుడు ఎందుకు ఆర్య వర్ధన్ మీద గెలవలేక పోతున్నాను? అసలు వాళ్ళ ధైర్యం ఏంటి?
మాన్సి: ఆయనే ఆయన ధైర్యం. అందుకే ఆయన్ని తెలివితో కాదు ఆలోచనతో కొట్టాలి.
ఛాయాదేవి: కానీ నా ఆలోచనలకి తను అందడం లేదు. ఏ మనిషికైనా బలహీనత అనేది ఉంటుంది కానీ ఈ మనిషికి అది లేదు. అనుతో విడిపోయిన సరే ఎంత ధైర్యంగా ఉంటున్నాడో మరోవైపు అంత దీన పరిస్థితుల్లో కూడా అను ఏమాత్రం బెదరకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అసలు వీళ్ళ ధైర్యం ఏంటి?
మాన్సి: నమ్మకం ఒకరి మీద ఒకరికి నమ్మకం, ప్రేమ వాళ్ళ గెలుపుకి కారణం. అందుకే నా తెలివితేటలతో అను మూఢనమ్మకాలని వాడుకొని వాళ్ళని విడదీశాను. నేను చెప్పింది అబద్ధమని తెలిసి బ్రో ఇన్ లా దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళని విడదీయడం అసంభవం. కనుక ఈ గ్యాప్ లోనే ఏదో ఒకటి చేయాలి.
ఛాయాదేవి: ఈసారి వేరే దారిలో వచ్చి ఆర్య వర్ధన్ ని ఓడించాలి. గట్టి ప్లాన్ వేయాలి.
మాన్సి: మీరేం చేసినా నేను సహాయంగా ఉంటాను. నన్ను ఇంటి నుంచి బయటికి తరిమేసిన వాళ్ల మీద నేను ప్రతికారం తీర్చుకొని తీరతాను.
ఛాయాదేవి: ఆర్య ని వాళ్ళ ఫ్యామిలీని కోలుకోలేని దెబ్బ కొట్టే ప్లాన్ చేస్తాను. నీ ప్రతీకారం, నా పగ రెండు తీరేంతవరకు నేను నిద్రపోను.
ఆ తర్వాత సీన్లో అను ఆకాంక్షకి టేబుల్స్ నేర్పుతూ ఉంటుంది. ఆకాంక్ష తప్పుగా చెప్తూ ఉంటుంది.
అను: ఐస్ క్రీములు మాత్రం తింటావు కానీ టేబుల్స్ మాత్రం చెప్పవు. ఈరోజు నువ్వు వన్ టు టెన్ టేబుల్స్ వరకు రాస్తేనే స్వీట్స్ పెడతాను.
ఆకాంక్ష: ఐస్ క్రీమ్ తినడానికి అంత కష్టం ఉండదు కదా అమ్మ అందుకే తింటాను కాని టేబుల్స్ చదవడం కష్టం.
అను: అభయ్ చూడు ఎంత బుద్దిగా హోంవర్క్ చేసి కూర్చున్నాడు. అవును ఇంతకీ అభయ్ అక్కడ అని ఇద్దరూ బయటికి వెళ్లి అభయ్ కోసం చూస్తారు. అభయ్ అక్కడ ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కి కన్నాలు పెడుతూ ఉంటాడు.
అను: ఏం చేస్తున్నావ్ అభయ్?
అభయ్: చెల్లి చాలా రోజుల నుంచి షవర్ కావాలి అని అడుగుతుంది కదా అమ్మ. అందుకే తనకోసం షవర్ రెడీ చేశాను అని బాటిల్ కి కన్నాలు పెట్టి షవర్ లా తయారు చేస్తాను.
ఆకాంక్ష: థాంక్యూ రా అన్నయ్య నీకు పెద్ద చాక్లెట్ కొనిస్తాను రేపు. అని అంటుంది. అప్పుడు అనుకి ఆర్య గతంలో తనకోసం అలాగే షవర్ చేసిన సంఘటన గుర్తుకు వస్తుంది.
అభయ్: నేను నీ కోసం, చెల్లి కోసం ఏదైనా చేస్తాను అమ్మ.
అను: సరే రండి మీకు ఇప్పుడు స్వీట్స్ పెడతాను.
ఆకాంక్ష: నేను వన్ టూ టెన్ టేబుల్స్ రాస్తే కాని స్వీట్స్ పెట్టను అన్నావు కదా.
అభయ్: అక్కికి టేబుల్స్ నేను చెప్తాను ముందు స్వీట్స్ తిందాము.
అను: అయితే రేపటి కల్లా నువ్వు టేబుల్స్ నేర్చుకోవాలి అని చెప్పి లోపల వి తీసుకుని వెళ్లి పిల్లలు ఇద్దరికీ స్వీట్స్
పెడుతుంది అను.
ఆ తర్వాత సీన్లో ఆర్య ఆఫీస్ లో ఆర్య, జెండే, ఆర్య తరఫున లాయర్, ఛాయాదేవి తరఫున లాయర్ కూర్చుని ఉంటారు.
ఆర్య తరపున లాయర్: చూడండి మేము స్కూల్ ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ అడిగాము మీరు ఇవ్వను అని చెప్పి మళ్ళీ ఉన్న స్కూల్ లాండ్ ని కూడా తీసుకోవాలనుకుంటున్నారు. పిల్లలు ఉంటుండగా స్కూల్ ని నాశనం చేస్తున్నారు.
ఛాయాదేవి తరపున లాయర్: మీరు స్కూల్ గురించి మాట్లాడాలి అనుకుంటే కేస్ వేయండి కోర్టులోనే తేల్చుకుందాము. ఎందుకంటే ఛాయాదేవి గారు ఆ స్కూల్ ని నాశనం చేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలని కూడా వదలడం లేదు బయట మాట్లాడితే ఇది తేలదేమో?
జెండే: ఇది బయట తేల్చుకోవాలో కోర్టులో తేల్చుకోవాలో మాకు తెలుసు ముందు మీ మేడంని సరిగ్గా ఉండమని చెప్పండి లేకపోతే మేము ఏ ఎక్స్టెన్షన్ కి వెళ్ళాలో మాకు తెలుసు. ఇంతలో ఛాయాదేవి, మాన్సి తో పాటు ఆర్య ఆఫీసులోకి వస్తుంది.
ఛాయాదేవి: ఏంటి బెదిరిస్తున్నారా? ఏంటి అపాయింట్మెంట్ లేకుండా స్ట్రైట్ గా లోపలికి వచ్చాను అని ఆశ్చర్యపోయారా?
జెండే: మీకు పర్మిషన్ అడిగే మ్యానర్స్ కూడా లేదు అని తెలుసు. ఎందుకు వచ్చారు?
ఛాయాదేవి: వచ్చిన వాళ్ళని కూర్చోమని కూడా చెప్పకుండా ప్రశ్నిస్తున్నారు. అని అనగా ఆర్య కూర్చోమని సైగ చేస్తాడు. ఛాయాదేవి అక్కడ కూర్చుంటుంది.
ఛాయాదేవి: నువ్వు కూడా కూర్చో మాన్సి. ఎంతైనా ఇది నీ ఆఫీసు ధైర్యంగా వచ్చి కూర్చో. అని అనగా మాన్సి మనసులో, ఎంత దర్జాగా వచ్చి కూర్చోవాల్సిన దాన్ని ఇప్పుడు థర్డ్ పార్టీ తో రావాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ కూర్చుంటుంది.
ఛాయాదేవి: ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో చెప్తాను. మా లాయర్ ని పిలిపించి మాట్లాడుతున్నారంటే స్కూల్ గురించే అని అర్థమైంది. అందుకే ఏంటో తెలుసుకుందామని వచ్చాను.
జెండే: స్కూల్ ని నాశనం చేయడానికి మీరు ఏం ఏం చేస్తున్నారో అన్ని తెలుస్తున్నాయి. కరెంట్ కట్ చేయడం పేరెంట్స్ దగ్గరికి వెళ్లి స్కూల్ గురించి చెడుగా చెప్పడం లాంటివి చేస్తున్నారు. అని గట్టిగా మాట్లాడతాడు.
ఛాయాదేవి: నా మీదే గొంతు రైజ్ చేస్తున్నావా? అసలు నువ్వు ఎవరివి నేను ఆర్య వర్ధన్ తో మాట్లాడడానికి వచ్చాను.
ఆర్య: నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? జెండా అంటే నా కంపెనీలో ఎంప్లాయ్ కాదు నా పక్కన ఉన్న ధైర్యం సారీ చెప్పు.
మాన్సి: ఎందుకొచ్చిన గొడవలు లెండి.సారీ ఏదో చెప్పి వచ్చిన పని చేసుకుందాం.
ఛాయాదేవి: సారీ.
ఆర్య : ఇంక స్కూల్ విషయానికి వస్తే కోర్టు నుంచి నోటీసు వచ్చేవరకు ఆ స్కూల్ జోలికి ఎవరైనా వెళ్తే నేను చేయాల్సింది నేను చేస్తాను.
ఛాయాదేవి: నేను కూడా ఈ గొడవ లేవీ ఉండకుండా మీకు ఒక ప్రపోజల్ తెచ్చాను.
ఆర్య: ఏంటది?
ఛాయాదేవి: ఐ నీడ్ సమ్ ప్రైవసీ అని అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న లాయర్స్ ఇద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఛాయాదేవి మాన్సిని కూడా సైగ చేసి వెళ్లిపోమని చెప్తుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: Gruhalakshmi September 7th:దివ్యకి సవతి పోరు - తులసిని ఓదార్చేందుకు నందు ప్రయత్నాలు