Prema Entha Madhuram August 26th: అనుని బెదిరించిన ఛాయ, మాన్సీ.. ఆర్యను స్కూల్ లో చూసి షాకైన అను?
ఛాయ, మాన్సీ అను కు ఎదురుపడి బెదిరించడంతో సీరియల్ ఆసక్తిగా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram August 26th: ఛాయాదేవి మాన్సీతో అనుని బయటికి రప్పించి తన ద్వారానే ఆర్య పతనం అయ్యేలా చేస్తానని అనటంతో.. వెంటనే మాన్సీ వెటకారంగా.. ఇలా ఛాలెంజ్ లు చేసి చేసి చాలామంది చల్లారిపోయారు అనటంతో వెంటనే ఛాయా ఏంటి అంటూ ప్రశ్నిస్తుంది. ఇక మాన్సీ ఏం లేదు.. వర్ధన్ ఫ్యామిలీలో నేను కోడల్ని కాబట్టి.. వారి ఆస్తి కోసమో లేదా నాకు అన్యాయం జరిగిందని నీతో చేతులు కలిపి వారితో దెబ్బతీయాలని అనుకుంటున్నాను.. కానీ నువ్వు ఎందుకు ఆర్య మీద పగ పట్టడానికి కారణం ఏంటి అని అడుగుతుంది.
దాంతో ఛాయ గతంలో జరిగిన దృశ్యాన్ని తలుచుకొని.. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతాను.. ముందు అను కోసం బాగా వెతికించు అని అంటుంది. అప్పుడే ఛాయా కు ఎమ్మెల్యే ఫోన్ చేసి ల్యాండ్ గురించి మాట్లాడటానికి రమ్మని అంటాడు. దాంతో ఛాయ సరే అనడంతో.. మాన్సీ కూడా వస్తాను అని అంటుంది. స్కూల్ లో అభయ్ చేసిన హ్యాండ్ క్రాఫ్ట్ చూసి ఫిదా అవుతుంది టీచర్. అప్పుడే ఆర్య అక్కడికి రాగా అందరూ ఆర్యకు వెల్కమ్ చెబుతారు. ఇక ఆ టీచర్ ఆర్యకు హ్యాండ్ క్రాఫ్ట్ తో చేసిన గిఫ్ట్ ఇస్తుంది.
ఆర్య లోపలికి వస్తుండటంతో అక్షర ఆర్యను అదేవిధంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్య వేదిక మీదికి వెళ్ళగా అక్షర తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు అను పిల్లలకు క్యారేజ్ తీసుకొని వస్తుండగా అదే సమయంలో మాన్సీ, ఛాయ కారులో ప్రయాణిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు చూసుకోక అనుకి యాక్సిడెంట్ చేస్తారు. వెంటనే కంగారు పడి కిందికి దిగి వెళ్లి సారీ అని చెబుతుండగా అను వాళ్లని చూసి షాక్ అవుతుంది.
ఇక అనుని చూసి వారిద్దరు పొగరుగా మాట్లాడటంతో అను వారిపై కోపంగా కనిపిస్తుంది. తను వెళ్లబోతుంటే ఆపుతారు. నీ అడ్రస్ ఏంటో చెప్పు అంటూ.. నీకోసం మేము ఎన్ని సంవత్సరాలు వెతుకుతున్నాము అని అంటుంది. కానీ అను అక్కడినుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయిన కూడా బలవంతంగా ఆపి పిల్లల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో అను చెయ్యి ఎత్తుతుంది. మళ్లీ కంట్రోల్ చేసుకొని.. నా పిల్లలు జోలికి రావద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంది.
ఇక వాళ్లు మాత్రం అంతే పొగరుగా మాట్లాడుతూ నిన్ను నీ భర్తను టార్చర్ చేయటమే మా పని అనటంతో.. వెంటనే అను చీదరగొడుతూ మీరు ఈ జన్మలో మారరు అని.. ఇక మీరు చేస్తున్న పాపాలకు శిక్ష అనుభవిస్తారు అని అంటుంది. కానీ ఛాయ మాత్రం నీ భర్తను మాత్రం అస్సలు సంతోషంగా ఉండకుండా చేస్తాను అని అంటుంది. ఇక అను ఆయనని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు.. ఆయనకు ఎదురుపడ్డ వాళ్లంతా తిరిగి తిరిగి అలసిపోయి సైలెంట్ గా ఉన్నారు దానికి ఉదాహరణ నీ పక్కన ఉన్న మాన్సీ అని అంటుంది.
ఇక ఛాయ నేను అలా కాదు అంటూ గట్టిగా బెదిరిస్తుంది. మీ బాబుని కిడ్నాప్ చేసి మీ ఇద్దరిని రోడ్డు మీద తిప్పించాను.. నా జోలికి వస్తే ఏదైనా చేస్తాను అని అంటుంది. ఇక అను అప్పుడు నా పరిస్థితి వేరు ఇప్పుడు పిల్లల జోలికి వస్తే చంపడానికి వెనకాడను.. మమ్మల్ని అడ్డుపెట్టుకొని ఆర్య ఆర్ ని ఏమైనా అంటే అసలు ఊరుకోను అని వారికి వార్నింగ్ ఇస్తుంది. అయినా కూడా వారిద్దరూ అదే పొగరుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక అను కూడా అంతే ధైర్యంగా వారికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత స్కూల్లో చెస్ కాంపిటీషన్ ప్రారంభమవుతుంది. ఇక పిల్లలు ఆట ఆడుతూ ఉంటారు. అభయ్ కూడా చెస్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే అను రావడాన్ని గమనించిన అక్షర తల్లి దగ్గరికి వెళ్లి అన్నయ్య గేమ్ ఆడుతున్నాడు.. అన్నయ్య ఎలాగైనా మెడల్ సాధిస్తాడు.. ఒక చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు అని చెబుతుంది. ఇక లోపలికి వెళ్లిన అను కొడుకు ఆడుతున్న గేమ్ చూస్తూ ఉంటుంది.
అదే సమయంలో ఆర్యను చూసి అదిగో ఆయనని చీఫ్ గెస్ట్ అని అక్షర అనుకి చూపిస్తుంది. వెంటనే అను షాక్ అయ్యి పక్కకు వెళ్లి నిలబడి పైన చీర కొంగు కప్పుకుంటుంది. మళ్లీ అక్షర అక్కడికి వచ్చి తన తల్లిని బలవంతంగా తీసుకొని వెళుతుంది. అను మాత్రం ఆర్య తను ఎక్కడ చూస్తాడా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అభయ్ సీరియస్ గా గేమ్ ఆడుతూ కనిపిస్తాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial