Krishna Mukunda Murari August 24th: కూతురి ప్రేమ గురించి శ్రీనివాస్ భవానికి నిజం చెప్పాడా.. ముకుంద, మురారి ఫోటో చూసేసిన నందు?
కృష్ణ కోసం మురారి క్యాంపుకు వెళ్లి అక్కడ తన కోసం ఆరాట పడుతూ ఉండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Krishna Mukunda Murari August 24th: క్యాంపులో ఉన్న మురారి కృష్ణను తలుచుకుంటూ మనసులో మాట్లాడుకుంటాడు. కృష్ణ కోసమే ఇక్కడ డ్యూటీ వేయించుకున్నానని తన కోసమే ఇక్కడికి వచ్చాను తను కూడా నేనిక్కడున్నానని తెలుసుకొని బయటికి రాలేదా అని అనుకుంటాడు. ఇక కృష్ణ కూడా మురారిని తలుచుకుంటూ.. నీడలా వెంటాడుతూ ఉంటే తప్పించుకోవటం తప్ప నేనేమీ చేయగలను అని అనుకుంటుంది. ఆయన నిద్ర లేచాడా లేడా అని పెద్ద అత్త భయానికి లేవచ్చు అని.. అంత మంచి ఫ్యామిలీలో బాగమవ్వాలంటే రాసిపెట్టి ఉండాలి అని అనుకుంటుంది.
అప్పుడే ఒక డాక్టర్ వచ్చి గుడ్ మార్నింగ్ కృష్ణవేణి అని అనటంతో తను వినిపించుకోదు. వెంటనే కృష్ణ.. పూర్తి పేరు పెట్టి పిలిస్తే సరికి.. ఎవరినో అనుకున్నాను అని అంటుంది. వెంటనే తను కృష్ణ మనసు ఇక్కడ లేదు ఎక్కడో ఉందని అంటుంది. అప్పుడే కృష్ణ బయటికి వచ్చి ఒక కానిస్టేబుల్ ని చూసి ఏసీపీ సార్ అని పిలవటంతో ఆయన నేను కానిస్టేబుల్ అమ్మ అని అంటాడు. ఇక ఎవరిని చూసినా మీలాగే అనిపిస్తున్నారు ఏసీపీ సార్ అని అనుకుంటుంది.
ఆ తర్వాత మురారి అక్కడ కానిస్టేబుల్ తో మాట్లాడుతుండగా వెనకాల నుంచి చూసి ఏసీపీ సార్ లాగా ఉన్నాడు అని పిలవబోతూ మళ్లీ వాళ్ళు మేము కానిస్టేబుల్ అని అంటారు అని పిలవకుండా వెళ్ళిపోతుంది. వెంటనే మురారి కృష్ణ వైపు చూసి తను చూసిందా లేదా అని చూసి పట్టించుకోకుండా వెళ్తుందా అని అనుకుంటాడు. అప్పుడే కృష్ణ ఫ్రంట్ నుంచి కూడా చూసి ఏసీపీ సర్ లాగా ఉన్నాడు అనుకుంటుంది. కానీ అది భ్రమ ఏమో అని అనుకుంటుంది.
ఇక చూసి కావాలనే పట్టించుకోవడం లేదు అని అనుకుంటాడు మురారి. శ్రీనివాస్ భవాని దగ్గరికి వచ్చి తన కూతురు గురించి మాట్లాడుతాడు. నా కూతురు జీవితం మీ చేతిలోనే ఉంది అని అంటాడు. వెంటనే భవాని మీ కూతురు ఎవరిని ప్రేమించిందో చెప్పండి ఆదర్శ్ తో విడాకులు ఇప్పించి మీ కూతురు ప్రేమించిన అబ్బాయి తో దగ్గరుండి పెళ్లి చేస్తాను అని అనటంతో రేవతి షాక్ అవుతుంది.
వెంటనే శ్రీనివాస్ నా కూతురు ఎవరినో ప్రేమించడం ఏంటి అంటూ.. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అడుగుతాడు. దాంతో భవాని మీరు తెలివిగా మాట్లాడొద్దు మీకు అన్ని విషయాలు తెలుసని నాకు తెలుసు అంటుంది. నీ కూతురు ప్రేమ విషయం తెలియందే.. కావాలని ఆదర్శ్ ఇంటికి రావడం లేదని నాతో చెబుతారా అని అనటంతో శ్రీనివాస్ సైలెంట్ అవుతాడు.
మీకు నీ కూతురు జీవితం ఎంత ముఖ్యమో.. నాకు నా కొడుకు జీవితం అంతే ముఖ్యం అంటూ.. ఎవరి కోసమో ఎవరి జీవితాలు నాశనం చేసుకోవద్దు అని అంటుంది. దాంతో శ్రీనివాస్ తన మనసులో.. ముకుంద ప్రేమించింది మురారినే అని చెబితే కృష్ణ జీవితాన్ని నాశనం చేసిన వాడినవుతానా అని భవానికి ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక రేవతి ఈ విషయాన్ని బయటికి చెప్పకూడదు అన్నయ్య అని మనసులో అనుకుంటుంది.
ఇక భవాని ముకుంద ఎవరిని ప్రేమించిందో చెప్పండి ఒకవేళ మీకు విషయం తెలియకపోతే ముకుందని అడిగి చెప్పండి.. ఏ విషయమో త్వరగా తేల్చండి అని అంటుంది. ఇక శ్రీనివాస్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక రేవతి కూడా అక్కడి నుంచి బయటికి వెళ్లి శ్రీనివాస్ ని పిలుస్తుంది. దయచేసి ముకుంద, మురారి ప్రేమ గురించి చెప్పకు అని దండం పెట్టి బ్రతిమాలుతుంది.
ఇప్పుడు మురారి కృష్ణని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు అని తెలిస్తే ఆదర్శ్ కచ్చితంగా వస్తాడు అని వాడికి అన్ని నిజాలు తెలిసేలాగా నేను చేస్తాను.. ముకుంద జీవితం చాలా బాగుంటుంది అని అంటుంది. భవాని కి కిరణ్ కుమార్ ఫోన్ చెయ్యగా భవాని ఆదర్శ్ గురించి అడుగుతుంది. ఇక ఆదర్శ్ తో మాట్లాడించే ప్రయత్నం చేయించమని అడుగుతుంది. ఇక ఆయన ప్రయత్నిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
ఇక కృష్ణ అక్కడికి వచ్చిన పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఒకావిడ తన భర్త తనను బాగా కొట్టిన గాయాలతో అక్కడికి వచ్చి కింద పడ్డాను అని చెబుతుంది. ఆ దెబ్బలు చూసి కృష్ణ గుర్తుపట్టి ఏం జరిగింది అని అడగటంతో ఆవిడ నిజం చెప్పేస్తుంది. వెంటనే మరొక డాక్టర్ ఇలాంటి వాళ్లను అసలు వదలకూడదు పోలీసులకు చెప్పాలి ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు అని అంటుంది.
ఇక ఆవిడ వద్దు అంటూ తన భర్త లేకుంటే తన జీవితానికి అర్థం లేదు అని అంటుంది. తను వేరే అమ్మాయి దగ్గరికి ఎంతైనా తను తాళి కట్టిన భర్త అని.. వదులుకోలేను అని అంటుంది. ఇక ఆ మాటలు కృష్ణకు కూడా తగులుతూ ఉంటాయి. తను కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండటంతో ఆమె మాటలకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది.
మరోవైపు మురారి తన కోసం ఇంత దూరం వస్తే కనీసం చూసి కూడా పలకరించలేదు అని.. చూసి చూడనట్టు పట్టించుకోనట్లు ఎలా ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి.. లంచ్ కి పిలుస్తాడు. లంచ్ లేదు ఏమీ లేదు అంటూ తనను వెనక్కి పంపిస్తాడు. అప్పుడే తనకు తన మమ్మీ ఫోన్ చేసి కాసేపు మాట్లాడుతుంది.
ఇక తన తల్లి ఫోన్ కట్ చేశాక కృష్ణ గురించి ఆలోచించి ఈసారి ఎదురుపడితే కచ్చితంగా తనను అడుగుతాను అని అనుకుంటాడు. మరోవైపు కృష్ణ అక్కడి నుంచి దిగులుగా వెళ్తుండగా తనకు ఏసీపీ సార్ ఎదురుపడతాడు. కానీ భ్రమ అనుకోని అక్కడినుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తుండటంతో మురారి ఆపుతాడు. ఆ తర్వాత నిజంగా ఏసీపీ సార్ అని గుర్తుపట్టి మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. ఇందాక చూసి కూడా మళ్లీ ఎప్పుడు వచ్చావు అని అడుగుతున్నావు అని మురారి ప్రశ్నిస్తాడు.
దాంతో ఏసీపీ సార్ వచ్చింది నిజమే అని తెలియకుండా అలా ప్రవర్తించాను అని అనుకుంటుంది. ఇక ఇద్దరు కాస్త బెట్టుగా మాట్లాడుతూ పని ఉంది అని చెప్పి వెళ్తూ మళ్లీ వెనక్కి మళ్ళీ నవ్వుకుంటారు. మరోవైపు ముకుంద మురారితో దిగిన ఫోటోలు చూస్తూ.. నిజమైన ప్రేమకు ఓటమి ఉండదని అంటుంటారు.. మన ప్రేమ విషయంలో అదే నిజమనిపిస్తుంది.. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఇప్పుడు ఒకటి కాబోతున్నామని అనుకుంటుంది. అప్పుడే నందు వచ్చి నీ గదిలో ఆదర్శ్ ది ఒక్క ఫోటో కూడా లేదు కదా అని అడుగుతుంది. ఇక బెడ్ పై ఉన్న ఫోటో తీసుకొని చూడటంతో ముకుంద సైలెంట్ అవుతుంది.
also read it : Prema Entha Madhuram August 24th: ప్రీతీ ఇంటి నుంచి వెళ్లిపోయిన అను.. సీన్ కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత ఆర్య పిల్లలు అలా!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial