అన్వేషించండి

Brahmamudi Serial Today May 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణకు నిజం చెప్పిన ఇందు – రాజుకు నిజం చెప్పకూడదనుకున్న చలపతి

Brahmamudi serial today episode May 5th: తన ఆస్థి గురించి ఇందుకు తెలిసిన నిజాన్ని అపర్ణ, సుభాష్‌లకు చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది  

Brahmamudi Serial Today Episode: ఆస్థి కోసం లాయరు దగ్గరకు వెళ్లిన రేఖ, భూషణ్‌కు షాక్‌ ఇస్తాడు లాయరు. రాజ్‌, కావ్య రాసిన వీలునామా ప్రకారం ఆస్థి మీ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ కాదని చెప్తాడు. దీంతో రేఖ, భూషణ్‌ షాక్‌ అవుతారు.

రేఖ: అదేంటి లాయరు గారు ఇందు వేలిముద్ర వేసింది కదా..?

లాయరు: వీలునామా ప్రకారం ఇందు పెళ్లి చేసుకోవాలి. వాళ్లిద్దరూ సంతోషంగా ఉండాలి. వాళ్లే కంపెనీ వ్యవహారాలు చూసుకోవాలి. ఆ తర్వాతే ఆస్థి మీద పూర్తి అధికారం వస్తుంది. అప్పుడే వాళ్లు ఎవరికైనా ఆస్థిని ట్రాన్స్‌ఫర్‌ చేసే హక్కు వస్తుంది

రేఖ: నో అలా జరగడానికి వీల్లేదు..

భూషణ్‌: అయినా వీలునామా రాసిన వాళ్లు చనిపోయారు. ఈ వీలునామాది ఏముంది..? ఆస్థి ట్రాన్స్‌ఫర్‌ చేయించండి

లాయరు: ఏం మాట్లాడుతున్నారండి ఒక్కసారి వీలునామా రాస్తే చేంజ్‌ చేయాలంటే రాయించిన  వాళ్లకు మాత్రమే సాధ్యం అవుతుంది.

భూషణ్‌: కానీ వాళ్లు ఇప్పుడు లేరు కదా..?

లాయరు: చెప్పాను కదా ఇందు పెళ్లి చేసుకుని తన భర్తతో కంపెనీ వ్యవహారాలు చూసుకుంటేనే తనకు హక్కు వస్తుంది. అప్పటి వరకు తను సంతకం చేసిన ఈ పేపర్స్‌ చిత్తు కాగితాలు

అని ఆ పేపర్స్‌ చించేస్తాడు లాయరు. రేఖ, భూషణ్‌ షాక్‌ అవుతారు. అపర్ణ, సుభాష్‌ లకు నిజం చెప్తుంది ఇందు.

ఇందు: నాకు పెళ్లి అయ్యేంత వరకు నాకు ఈ ఆస్థి మీద ఎటువంటి అధికారం లేదు. నేను వేసిన వేలి ముద్ర దేనికీ పనికిరాదు

స్వాతి: అంటే ఈ విషయం నీకు ముందే తెలిసి వాళ్లను పిచ్చి వాళ్లను చేశావా..? అక్కా..

ఇందు: అవును లేకపోతే అంత ఈజీగా నేను వేలిముద్ర వేస్తానా..? నాన్నమ్మ నేను మీ గురించి భయపడింది నిజమే వాళ్లు మిమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తారో అని టెన్షన్‌ పడిపోయాను. నాకు ఆస్థికన్నా మీరే ముఖ్యం అనుకున్న కానీ ఎప్పుడైతే మీరు మా అమ్మ జీవితం చదువు అని ఆ పుస్తకం ఇచ్చారో ఆ పుస్తకం చదివాకే నాకు ధైర్యం వచ్చింది. నాకు మీరు ఆస్థి రెండు కావాలి అనిపించింది. ఏ ఒక్కటి వదులుకున్నా నా జీవితానికి అర్థం ఉండదనిపించింది. అందుకే మిమ్మల్ని ఆస్థిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాను.. అదీకాక మా అమ్మానాన్నలు ముందు చూపుతోనే ఆ వీలునామా రాశారు. మా అమ్మానాన్న కోరుకున్నట్టుగానే ఎలాంటి సిచ్యుయేషన్‌ ఎదురైనా నేను ధైర్యంగా పోరాడతాను. అంతే కానీ ఆస్థిలో చిల్లిగవ్వ కూడా ఆ రేఖ ఆంటీకి దక్కనివ్వును

సుభాష్‌: సూపర్‌ అమ్మా నువ్వు నిజంగా నిన్ను చూస్తుంటే.. మీ అమ్మను చూసినట్టే ఉంది

అపర్ణ: మీ అమ్మానాన్న ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది. పిల్లాపాపలతో అంతా బాగుంది అనుకున్నప్పుడే ఆ యాక్సిడెంట్‌ జరిగి మనం మన ఇంట్లోనే ఒక మూలన పడాల్సి వచ్చింది

ఇందు: నాన్నమ్మ వాళ్లు ఇక ఏమీ చేయలేరు.. మీరు ధైర్యంగా ఉండండి

స్వాతి: అవునక్కా నీకు పెళ్లి అయ్యే వరకు ఆస్థి మీద హక్కు లేదని నీకెలా తెలిసింది.

ఇందు: నిన్న రాత్రి లాయరు సత్యదేవ్‌ గారు నాకు  ఫోన్‌ చేశారు.

అని లాయరు చెప్పిందంతా చెప్తుంది ఇందు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. బయట హాల్లో వచ్చి కూర్చున్న రేఖ, భూషణ్‌ లను శేషు వెటకారంగా మాట్లాడుతుంటాడు. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అంటే ఇదేనేమో అంటాడు.. అప్పుడు రేఖ కోపంగా ఈ ఆస్థిని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ వెళ్లిపోతుంది. మరోవైపు చలపతి, లక్ష్మీని పిలిచి రాజు గురించి ఎమోషనల్‌ అవుతాడు. రాజు దుగ్గిరాల ఇంటి వారసుడు అన్న నిజం ఎప్పటికీ చెప్పకూడదని నిర్ణయించుకుంటారు. ఎందుకని లక్ష్మీ అడిగితే ఆ రేఖ చాలా దుర్మార్గురాలట. రాజును ఏమైనా చేస్తుంది అంటూ చలపతి భయపడతాడు. తర్వాత రేఖ తన కొడుకు మదన్‌ ఇండియాకు పిలిపిస్తుంది. ఎలాగైనా ఇందుకు మదన్‌కు పెళ్లి చేయాలని డిసైడ్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today October 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని ఓదార్చిన అమర్‌ - మనోహరి గురించి అమర్‌కు నిజం చెప్పమన్న రాథోడ్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని ఓదార్చిన అమర్‌ - మనోహరి గురించి అమర్‌కు నిజం చెప్పమన్న రాథోడ్‌  
Brahmamudi Serial Today October 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - చలపతిని ఆట పట్టించిన నందు
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - చలపతిని ఆట పట్టించిన నందు
Jagadhatri Serial Today October 9: పిచ్చాసుపత్రిలో మీనన్‌కు షాక్‌ ట్రీట్‌మెంట్..జగధాత్రి చేతికి చిక్కినట్లే చిక్కి మాయమైన మీనన్‌ ఫైల్‌
జగద్ధాత్రి సీరియల్: పిచ్చాసుపత్రిలో మీనన్‌కు షాక్‌ ట్రీట్‌మెంట్..జగధాత్రి చేతికి చిక్కినట్లే చిక్కి మాయమైన మీనన్‌ ఫైల్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంట్లో లక్ష్మీ ప్రస్తావన! చచ్చిపోతానంటోన్న యమున!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంట్లో లక్ష్మీ ప్రస్తావన! చచ్చిపోతానంటోన్న యమున!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget