Brahmamudi Serial Today May July 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌కు శ్రీనును పట్టుకునే ఐడియా చెప్పిన యామిని – కంగారులో పడిపోయిన కావ్య
Brahmamudi Today Episode: రాజ్‌తో మాట్లాడుతూ శ్రీనును పట్టుకునే ఐడియా తనకు తెలియకుండానే రాజ్‌కు చెప్పేస్తుంది యామిని. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రేవతి, జగదీష్ లను మెడపట్టి ఇంట్లోంచి బయటక గెంటి వేస్తుంది అపర్ణ. తాను బతికి ఉన్నంత వరకు మీరు ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు. మీ అమ్మా నాన్న ఎవరని అడిగితే చనిపోయారని చెప్పుకో అంటుంది అపర్ణ.
రేవతి: నీ నిర్ణయం కూడా ఇదేనా నాన్న
సుభాష్: నా కూతురు చనిపోయి చాలాసేపు అయింది
జగదీష్: నేను తప్పు చేశాను నన్ను క్షమించండి
అపర్ణ: ఆగండి.. మీ నాన్న నీ కోసం కొన్న ఆస్థి దీని కోసమే వాడు నిన్ను పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆ ముష్టి మాకెందుకు తీసుకుని పో
రేవతి: నేను మీ కూతురునే నాన్న నాలో ప్రవహిస్తుంది కూడా మీ రక్తమే.. ఈ ఆస్థితో నాకు పని లేదు. ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదని మీరు అర్థం చేసుకుని పిలిచే వరకు నేను ఈ ఇంటి గడప తొక్కను
అపర్ణ: అది నేను బతికుండగా జరగదు
అనగానే జగదీష్, రేవతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ప్లాష్‌బ్యాక్ అంతా విన్న తర్వాత కావ్య ఇందిరాదేవిని ఓదారుస్తుంది. ఎదో ఒకరోజు టైం చూసి రేవతిని ఇంటికి తీసుకొస్తానని చెప్తుంది. ఇందిరాదేవి హ్యపీగా ఫీలవుతుంది. మరోవైపు రూంలో ఉన్న అపర్ణ రేవతి కొడుకును గుర్తు చేసుకుని నవ్వుకుంటుంది.
సుభాష్: ఏంటి అపర్ణ నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి..?
అపర్ణ: అదా వాడు గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నాను..
సుభాష్: వాడా ఎవడు.. వాడు..?
అపర్ణ: అయ్యో మీకు చెప్పనే లేదు కదా..?
అంటూ రేవతి కొడుకుతో తాను మాట్లాడింది వాడి అల్లరి మొత్తం చెప్పి నవ్వుకుంటుంది అపర్ణ. మళ్లీ వాడు కలుస్తాడో లేదో అని బాధపడుతుంది. అయితే కలవాలని రాసిపెట్టి ఉంటే ఎలాగైనా కలుస్తాడులే నువ్వు గట్టిగా అనుకో కలుస్తాడు అంటాడు సుభాష్. ఇక యామిని, కావ్యకు ఫోన్ చేస్తుంది.
యామిని: ఏంటి కావ్య.. ఆ శ్రీను ఆచూకి తెలియట్లేదా..? నేను చాలా సంతోషంగా ఉన్నాను.. నా సంతోషానికి కారణం నువ్వే.. నీ చెల్లిని కాపాడుకోవడానికి వేసిన ప్లాన్ అట్టర్‌ప్లాప్ అయినట్టు ఉంది. నన్ను అంత ఈజీగా తీసుకున్నావు. నువ్వు ఆ శ్రీనును వెతుక్కుంటూ వెళ్లి నాకో బోనస్ ఐడియా ఇచ్చావు. ఇప్పటి వరకు అప్పుకు ఒకటే కేసులో శిక్ష పడేది. ఇప్పుడు రెండు కేసుల్లో శిక్ష పడనుంది. ఒకటేమో లంచం తీసుకుంటూ దొరికిన కేసు.. ఇంకోటి..?
కావ్య: ఏంటి యామిని జోక్ చేస్తున్నావా..?
యామిని: జోక్ కాదు కళావతి.. రెండోది శ్రీను కిడ్నాప్ కేసు.. ఇప్పుడు ఏం చేస్తుంది మా హీరోయిన్.. తన చెల్లిని కాపాడుకుంటుందా..? లేక ఇంక తన వల్ల ఏమీ కాదని కన్నీళ్లు పెట్టుకుంటుందా..?
కావ్య: అప్పుడే ఆట ముగిసిందని నువ్వు గెలిచావని సంబరపడిపోకు యామిని.. ఇందులో ఒక కొటేషన్ ఉంది తెలుసా..?
యామిని: ఏంటో అది
కావ్య: పిక్చర్ అబీ బాకీ యై.. సముద్రం సైలెంట్‌గా ఉందంటే చేత కాక ఏమీ చేయలేక ఉందని అర్థం కాదు. నువ్వు చూస్తూ ఉండు యామిని.. నా చెల్లెల్ని నేను ఎలా కాపాడుకుంటాను అనేది
అంటూ కావ్య వార్నింగ్ ఇవ్వగానే యామిని కంగారు పడుతుంది. ఈ కావ్య ఏదో చేయబోతుంది.. అదేంటో బావ దగ్గర తెలుసుకోవాలి అనుకుని రాజ్ దగ్గరకు వెళ్తుంది.
యామిని: ఏంటి బావ ఇంత టైం అయినా పడుకోలేదు. ఏంటో ఆలోచిస్తున్నావు..
రాజ్: అవును యామిని రేపు అప్పు కేసు కోర్టుకు వస్తుంది. కదా దాని గురించి..
యామిని: వాళ్ల కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అనవసరంగా ఇలా ఆలోచించడం ఎందుకు బావ ఎలా జరగాలి అని రాసి ఉంటే అలా జరగుతుంది. ఇక నేను వెళ్తాను బావ నేను కనిపించకపోతే అమ్మ కంగారుపడుతుంది.
అంటూ యామిని వెళ్లిపోతుంది. వెంటనే రాజ్‌కు ఒక ఐడియా తడుతుంది. యామిని లాగే ఆ శ్రీను గాడికి అమ్మ ఉంది. వాడు లేడని తెలిస్తే వాళ్ల అమ్మ కంగారు పడుతుందని వాడు ఫీల్ అవ్వొచ్చు. కాబట్టి ఏక్షణంలోనైనా వాడు వాళ్ల అమ్మకు ఫోన్ చేస్తాడు. కాబట్టి వాడి ఫోన్ ట్రేస్ చేస్తే సరి లొకేషన్ తెలిసిపోతుంది అని ఆలోచిస్తుంటాడు రాజ్. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















