అన్వేషించండి

Brahmamudi Serial Today August 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పును కిడ్నాప్ చేసిన అనామిక – మండపంలోంచి వెళ్లిపోయిన పెళ్లికొడుకు

Brahmamudi Today Episode: అప్పును కిడ్నాప్ చేసి పెళ్లి ఆగిపోయేలా చేసిన అనామికను చూసి కళ్యాణ్ షాక్ అవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: నీ పెళ్లి ఆపించి క‌ళ్యాణ్‌తో నువ్వు లేచిపోయావ‌ని అంద‌రిని న‌మ్మించ‌డానికే కిడ్నాప్ చేశాన‌ని అనామిక చెబుతుంది. మరోవైపు పెళ్లిమండపంలో రుద్రాణి అప్పు  ఎవరితోనో లేచిపోయిందని పుకార్లు సృష్టిస్తుంది. మరోవైపు రాజ్‌, కావ్య అప్పుకోసం వెతుకుతుంటారు. రాజ్ ఎస్సైకి ఫోన్ చేస్తాడు.

రాజ్‌: సార్‌ ఎస్సై గారు మా అప్పు మిస్సయిందండి. ఎవరో తనను బలవంతంగా తీసుకెళ్లారు. మీరే తనని కనిపెట్టి తీసుకురావాలి. లేకుంటే తన పెళ్లి ఆగిపోతుంది.

ఎస్సై: సరే తప్పకుండా ట్రేస్‌ చేస్తాము.. మీ అప్పు డీటెయిల్స్‌ పెట్టండి.

కావ్య: వాళ్లు ఎప్పుడు పట్టుకుంటారండి.. మీ పిన్నిగారు ఎలా మాట్లాడుతున్నారో చూశారుగా నా చెల్లి ఎక్కడున్నా నేనే వెతికి తీసుకొస్తాను.

రాజ్‌: ఇంత పెద్ద సిటీలో ఎక్కడని వెతుకుతావ్. పోలీసులు ఇప్పుడే ఎంక్వైరీ మొదలుపెట్టారు. కాస్తా క్లూ దొరికినా మనం వెళ్దాం.

కావ్య: ఆ కాస్తా టైమ్ కూడా ఆ రుద్రాణి ఇవ్వట్లేదు. అందరి ముందే అన్నన్ని మాటలు అంటుంది. అన్ని తెలిసి పెళ్లికి ముందుకు వచ్చిన ఆ అబ్బాయి వాళ్ల ముందు మీ పిన్ని గారు అప్పు లేచిపోయిందని మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది.

  అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటారు. మరోవైపు కారులో వెళ్తున్న కళ్యాణ్ కు బంటి కనిపిస్తాడు. చిన్న చిన్న దెబ్బలతో ఉన్న బంటిని చూసి కళ్యాణ్‌ షాక్‌ అవుతాడు. దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతాడు. అప్పును ఎవరో కిడ్నాప్‌ చేశారని జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుకు మత్తు మందు ఇచ్చి రౌడీలు కారులో వేసుకని తీసుకెళ్లారని.. ఆ కారులో అనామిక కూడా ఉన్నదని బంటి చెప్పడంతో కళ్యాణ్‌ షాక్‌ అవుతాడు. అనామిక అప్పును కిడ్నాప్‌ చేసిందా అని కల్యాణ్ అడుగుతాడు. అవునని బంటి చెప్తాడు. మరోవైపు రాజ్‌, కావ్య మంటపానికి రావడంతో అప్పు దొరకలేదని అర్థం చేసుకుంటారు.

ధాన్యలక్ష్మీ: నీ చెల్లి ఎక్కడ ఇద్దరు కలిసి పెళ్లి చేయించి వస్తున్నారా?

రాజ్‌: అవును, కల్యాణ్ ఒప్పుకుని ఉంటే  పెళ్లి చేసి హనీమూన్‌కు పంపించేవాన్ని

ధాన్యలక్ష్మీ: రాజ్‌… ఏం మాట్లాడుతున్నావు.

అపర్ణ: షటప్ ధాన్యలక్ష్మీ. నా కొడుకుపై అరుస్తున్నావేంటీ?

ధాన్యలక్ష్మీ: నా కొడుగు గురించి ఆలోచిస్తున్నాను అక్క

అపర్ణ: అలా ఆలోచించేదానివే అయితే.. ఆ పెళ్లి పెటాకులు అయ్యేదే కాదు.

స్వప్న: ఈవిడ ముందు బాగానే ఉండేది. మా అత్తతో మంతనాలు జరిపి ఇలా తయారైంది.

 అని స్వప్న కూడా ధాన్యలక్ష్మీని తిడుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్లు అప్పును వెతికితీసుకొస్తారని రాజ్‌ అంటాడు. కనకం ఏడుస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావ్ కనకం. నీ కూతురు బాగానే ఉంటుంది. నా కర్మకాలితే నా కొడుకును పెళ్లి చేసుకుని వస్తుందని, నా కొడుకు జీవితం సర్వనాశనం అయ్యేదాకా వదలదు కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో పెళ్లి కొడుకు లేచి ఇంకా నేను ఈ పెళ్లి చేసుకుంటే నా అంత వెధవ ఎవడు ఉండడని అంటాడు.  ఈ సంబంధం తప్పిపోయిందే మంచిదైంది. లేకుంటే రోజుకొకడు వచ్చి నన్ను హోటల్ బుక్ చేయమనేవాడు. అని పెళ్లి వాళ్లు వెళ్లిపోతారు. పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వెళ్లిపోతారు. ఇందిరాదేవి కోపంగా ధాన్యలక్ష్మీ, రుద్రాణిలను తిడుతుంది. నీ కొడుకు ఎంతమంది ఆడపిల్లలను నాశనం చేశాడో చెప్పమంటావా. రాజ్ పెళ్లి చేసుకునే అమ్మాయికి మాయ మాటలు చెప్పి లేపుకెళ్లింది నీ కొడుకు కాదా  అంటూ తిట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget