Deepika Rangaraju: ‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘బ్రహ్మముడి’ కావ్య - ఇదిగో ఇలా హింట్ ఇచ్చేశారుగా, ఇక అల్లరే అల్లరి
Deepika Rangaraju: హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, ఎంటర్‌టైనర్‌గా కూడా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది దీపికా రంగరాజు. ఈసారి బిగ్ బాస్‌లో తను కూడా కంటెస్టెంట్‌గా రానుందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
Deepika Rangaraju: తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రతీ సీజన్ మరింత పాపులారిటీ సాధించుకుంటూ ముందుకెళ్తోంది. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రతీ ఏడాది ఈ రియాలిటీ షో కచ్చితంగా సాగుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ 8 గురించి కూడా మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా కనిపించే వారిపై కూడా ఫోకస్ పెరిగింది. ఇప్పటికే ఇందులో కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో సీరియల్ ఆర్టిస్ట్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ అవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా..
ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో కొందరు సీరియల్ ఆర్టిస్టులు కూడా కంటెస్టెంట్స్‌గా పాల్గొంటారు. అలా ఈసారి కూడా పలువురు సీరియల్ ఆర్టిస్టుల పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో కొత్తగా మరో హీరోయిన్ పేరు కూడా యాడ్ అయ్యింది. తనే దీపికా రంగరాజ్. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్‌లో కావ్యగా నటించిన దీపికా రంగరాజ్ కూడా బిగ్ బాస్ సీజన్ 8లో ఒక కంటెస్టెంట్ కానుందని సమాచారం. బుల్లితెరపై దీపికా ఎప్పుడు కనిపించినా ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదని ప్రేక్షకులు అంటుంటారు. అలాంటి ఎంటర్‌టైన్మెంట్ అందించే అమ్మాయి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వస్తే అందులో కూడా ఎంటర్‌టైన్మెంట్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సీరియల్‌కు ఫ్యాన్స్..
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై చాలామంది కన్నడ నటీనటులు ఉన్నారు. అందులో దీపికా రంగరాజ్ కూడా ఒకరు. ముందుగా ‘చిత్రం పేసుతాడి’ అనే తమిళ సీరియల్‌తో హీరోయిన్‌గా తన కెరీర్ ప్రారంభించింది దీపికా. అది పూర్తయ్యే సమయానికి తనకు ‘బ్రహ్మముడి’లో ఛాన్స్ వచ్చింది. ఈ సీరియల్ ప్రారంభం అవ్వకముందే దీని గురించి విపరీతంగా ప్రమోషన్స్ జరిగాయి. అందుకే ముందు నుండే ‘బ్రహ్మముడి’ని చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలా ముందుగా సీరియల్‌లో కావ్య పాత్రలో అందరినీ మెప్పించింది దీపికా రంగరాజ్. మానస్ సరసన దీపికా నటన చాలామందిని ఆకట్టుకుంది.
ఫుల్ ఎంటర్‌టైన్మెంట్..
ఆన్ స్క్రీన్ యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న దీపికా రంగరాజ్.. మెల్లగా షోలలో గెస్ట్‌గా కనిపించడం ప్రారంభించింది. అలా కనిపించిన ప్రతీసారి తన తెలుగుతో, తన కామెడీ టైమింగ్‌తో అందరినీ అలరించింది. ముఖ్యంగా మానస్‌తో కలిసి తను చేసిన కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే కొన్నిరోజుల క్రితం ఒక షోకు గెస్ట్‌గా వెళ్లింది దీపికా రంగరాజ్. అందులో మూడు నెలల పాటు నిన్ను షోకు రానివ్వము అని శ్రీముఖి అనగా.. నన్ను బిగ్ బాస్‌కు పంపిస్తారా అంటూ దీపికా ప్రశ్నించింది. దీంతో నిజంగానే తను బిగ్ బాస్‌కు వస్తే ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతలోనే బిగ్ బాస్ మేకర్స్.. తనను కంటెస్టెంట్‌గా పాల్గొనడం కోసం అప్రోచ్ అయ్యారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా వచ్చేది వీళ్లే!