సమంత కంటే నువ్వే బాగున్నావ్ - ఇనయా ‘నా రోజా నువ్వే’ రీల్స్‌కు ఫ్యాన్స్ ఫిదా
బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తానా ఇన్ స్టాగ్రామ్ లో ఓ రీల్స్ వీడియోని పోస్ట్ చేయగా.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఖుషి' సినిమా నుంచి ఇటీవల 'నా రోజా నువ్వే' అనే సాంగ్ విడుదలై శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటని రీ క్రియేట్ చేస్తూ ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తానా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుల్లితెర ప్రేక్షకులకు ఇనాయ సుల్తానా గురించి పరిచయం అక్కర్లేదు. మోడల్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన ఇనాయ.. వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ బర్త్డే పార్టీలో అతనితో కలిసి ఓ రేంజ్ లో డాన్స్ చేసి ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది. ఆ పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ షో లో పాల్గొనే ఛాన్స్ అందుకుంది.
‘స్టార్ మా’లో ప్రసారమైన 'బిగ్ బాస్ సీజన్ 6'లో ఇనాయా సుల్తానా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన అందం, ఆటతీరుతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా హౌస్ లో యాంగ్రీ వుమన్ గా చాలామంది కంటెస్టెంట్స్ తో గొడవలు పెట్టుకుని ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. అలా బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఇనాయ ప్రస్తుతం చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ నిత్యం ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత నటించిన 'ఖుషి' సినిమాలోని 'నా రోజా నువ్వే' అనే సాంగ్ ని రీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోలో అచ్చం సమంత లాగే కాస్ట్యూమ్స్ ధరించి ఆకట్టుకుంది. ఒరిజినల్ సాంగ్ లో సమంత ఎక్స్ప్రెషన్స్ ని దాదాపు మ్యాచ్ చేసింది. దీంతో ప్రస్తుతం ఇనాయ లేటెస్ట్ రీల్స్ నెటిజెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
దీంతో ఈ వీడియో కింద పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ ‘‘ఈ వీడియోలో అచ్చం సమంత లాగే ఉన్నావు’’ అంటూ కామెంట్ చేయగా.. మరో నెటిజన్.. ‘‘సమంత కంటే నువ్వే బాగున్నావు ఈ సాంగ్ లో’’ అంటూ రాస్కొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక 'ఖుషి' మూవీ నుండి రీసెంట్గా రిలీజ్ అయిన 'నా రోజా నువ్వే' అనే సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు యూట్యూబ్ లో ఈ పాటకి 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ పాటకి సంగీతం అందించారు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని UV క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నవంబర్ 1న తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
View this post on Instagram