Prema Entha Madhuram August 22th: టెండర్ వదులుకుంటానంటూ షాకిచ్చిన ఆర్య.. తన లెటర్ తో భర్తను సంతోషపెట్టిన అను?
ఆర్య టెండర్ ని వదులుకుంటాను అనటంతో సీరియల్ ఆసక్తిగా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Prema Entha Madhuram August 22th: టెండర్ వదులుకుంటానంటూ షాకిచ్చిన ఆర్య.. తన లెటర్ తో భర్తను సంతోషపెట్టిన అను? Arya shocked by saying that he will give up on the tender in Prema Entha Madhuram August 22th eposide Prema Entha Madhuram August 22th: టెండర్ వదులుకుంటానంటూ షాకిచ్చిన ఆర్య.. తన లెటర్ తో భర్తను సంతోషపెట్టిన అను?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/22/14062ebe1db02801b8e49f64d34977a11692672757534768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram August 22th: ఆర్య టెండర్లో గెలవడంతో అందరూ ఆర్యకు అభినందలు తెలుపుతారు. ఛాయాదేవి మాత్రం బాగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది. అందరూ ఆర్య దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెబుతారు. ఆ తర్వాత ఆర్య జిండే తో వెంటనే సోషల్ మీడియాలలో, న్యూస్ ఛానల్ లలో తను టెండర్ నుంచి అవుట్ అవుతున్నట్లు న్యూస్ ప్రకటించమని చెబుతాడు.
దాంతో జిండే అదేంటి ఆర్య అని ఆశ్చర్యపోయి అడగటంతో.. ఛాయాదేవి టెండర్ దక్కలేదని ఎలాగైనా నన్ను భయపెట్టించడం కోసం అనుని, పిల్లల్ని ఏమైనా చేస్తుంది.. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. దాంతో జిండే సరే అని ఆ న్యూస్ అంత స్ప్రెడ్ చేస్తాడు. ఇక ఆ న్యూస్ ప్రీతి వెళ్లి అను కి చెప్పటంతో అను షాక్ అవుతుంది. ఇక ప్రీతి ఇదంతా నీకోసమే అని.. ఛాయాదేవి నిన్నేమైనా చేస్తూనేమో అని అలా నిర్ణయించుకున్నాడేమో అని అంటుంది.
ఆ న్యూస్ చూసి ఛాయాదేవి ఆర్య భయపడ్డాడు అని పొగరుగా నవ్వుకుంటుంది. ఇక అను ఆర్య సార్ ఓడిపోవద్దు అని ఒక లెటర్ రాస్తుంది. ఇక ఆ లెటర్ ఆర్యకు పంపిస్తుంది. ఇక ఆర్య ఆ లెటర్ చదవగా అప్పుడే అక్కడికి జిండే వచ్చి న్యూస్ అంత చేరవేసాను అని అంటాడు. కానీ ఆర్య తను ఈ టెండర్ ను వదులుకోను.. అవుట్ అవ్వను అని చెప్పేస్తాడు. ఇక టెండర్ తనకే కావాలి అని అంటాడు.
ఉదయం ఆర్య టెండర్ గెలుచుకున్నప్పుడు ప్రీతి, అను తన దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు తెలపటంతో.. ఇక ఆర్య ఈవినింగ్ పార్టీ ఉంటుందని వాళ్లకు చెప్పటంతో వాళ్లు సరే అంటారు. సీన్ కట్ చేస్తే ఆర్య ఇంట్లో పార్టీ జరుగుతుంది. నీరజ్ వచ్చిన గెస్ట్ లను పలకరిస్తూ ఉంటాడు. ఇక అను రేష్మ దగ్గర పిల్లల్ని వదిలేసి వచ్చినందుకు కంగారు పడటంతో ప్రీతి.. ఏం కంగారు పడకు పిల్లలు పాలు తాగి పడుకున్నారు అని చెబుతుంది.
ఇక అంజలి రావడంతో అంజలికి శుభాకాంక్షలు చెబుతుంది అను. నాకెందుకు చెబుతున్నావు ఆర్య సార్ కి కదా అని తను అనటంతో.. దాంతో అను ఈ ఫ్యామిలీకి మీరు సపోర్టుగా ఉన్నారు కదా అంటూ మాట్లాడుతుంది. అప్పుడే శారదమ్మ కూడా అక్కడికి వచ్చి అను వాళ్ళను పలకరిస్తుంది. ఆర్య ని తీసుకొని రమ్మని జిండే కి చెప్పాను కానీ ఇంకా రాలేదేంటి అని అంటుంది.
అప్పుడే అక్కడికి జిండే వచ్చి గెస్ట్ లను పలకరిస్తూ ఉంటాడు. ఇక నీరజ్ శారదమ్మ దగ్గరికి వెళ్లి అన్నయ్య ఎక్కడ అనడంతో అప్పుడే వారి దగ్గరికి వచ్చిన జిండే ను శారదమ్మ అడుగుతుంది. దాంతో జిండే మర్చిపోవడంతో నీరజ్ వయసు పెరుగుతుంది కాబట్టి మర్చిపోతున్నాడు అని కాసేపు ఆటపట్టిస్తాడు. అప్పుడే ఆర్య కూడా వచ్చి జిండే పై సరదాగా కామెంట్ చేయడంతో అందరూ నవ్వుకుంటారు.
ఆర్య కూడా చాలా సంతోషంగా కనిపిస్తాడు. ఇక చాలా రోజులకు నిన్ను చాలా సంతోషంగా చూస్తున్నాను అని జిండే అంటాడు. ఇక ఈ సంతోషానికి కారణం ఏంటి అని ఇంట్లో వాళ్ళు అడగటంతో.. తనకు ఈ రోజు ఒక స్పెషల్ డే అని పార్టీ చివర్లో చెబుతాను అని అంటాడు. ఆ తర్వాత కేక్ కట్ చేసేముందు పలువురు బిజినెస్ మాన్స్ ఆర్యను సక్సెస్ గురించి స్పెషల్ డే గురించి చెప్పమని అడుగుతారు.
దాంతో ఆర్య అను గురించి గొప్పగా చెప్పటంతో అక్కడే ఉన్న అను ఆనందభాష్పలల్లో మునుగుతుంది. ఇక కేక్ కటింగ్ తర్వాత ప్రీతి బలవంతంతో అను ఆర్య కోసం ఒక పాట పాడుతుంది. ఆ తర్వాత పార్టీ ముగియటంతో అందరూ వెళ్ళిపోతారు. ఇక పార్టీ బాగా జరిగింది అని శారదమ్మ అంటుంది. వెంటనే నీరజ్ మీ సంతోషానికి కారణం చెప్పండి అని అనటంతో వెంటనే ఆర్య అను అని అంటాడు.
అను ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అని.. తన దగ్గరే ఉంది అని.. తన పక్కనే ఉంది అనడంతో.. నిజం తెలిసిపోయిందేమో అని అను భయపడుతుంది. కానీ ఆర్య లెటర్ తీసి అను దగ్గర నుంచి లెటర్ వచ్చింది అని చెప్పటంతో ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక ఆ లెటర్ అక్కడే ఉన్న అనుతో చదివిస్తాడు. ఇక అను చదువుతుండగా ఆ మాటలు వింటూ ఉంటాడు ఆర్య.
also read it : Trinayani August 21st - 'త్రినయని' సీరియల్: బలవంతంగా కొత్తిమీర వాసన పిలుచుకొని రక్తం కంటచూసిన సుమన.. క్రూరమైన ప్లాన్ చేసిన తిలోత్తమా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)