Prema Entha Madhuram July 28th: అందరి ముందు ఆర్యకు కర్రీ నచ్చదంటూ నోరు జారిన అను.. మాన్సీని గట్టిగా కొరికిన సత్తెమ్మ?
అందరి ముందు ఆర్యకు ఆ కూర నచ్చదంటూ అను అనటంతో అందరూ షాక్ అవ్వటం వల్ల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Prema Entha Madhuram July 28th: అందరి ముందు ఆర్యకు కర్రీ నచ్చదంటూ నోరు జారిన అను.. మాన్సీని గట్టిగా కొరికిన సత్తెమ్మ? Anu blurted out that Arya doesn't like curry in front of everyone in Prema Entha Madhuram July 28th eposide Prema Entha Madhuram July 28th: అందరి ముందు ఆర్యకు కర్రీ నచ్చదంటూ నోరు జారిన అను.. మాన్సీని గట్టిగా కొరికిన సత్తెమ్మ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/4a78d6e003931df79d054fd450fdb8461690517365384768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram July 28th: ఆర్య, అను లిఫ్టులో ఉండటంతో రేష్మ ఒక ఆట ఆడుకుంటుంది. ఇక వాళ్ళు బయటికి వచ్చాక ఆర్య లిఫ్ట్ ప్రాబ్లం ఉందేమో అని నీరజ్ కి చెప్పి తను ఫైల్స్ కోసం పైకి వెళ్తాడు. వెంటనే అను ఇది నీ పనే కదా అని రేష్మను అంటుంది. దాంతో రేష్మ అవును అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇక మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే బాగుండదు అని అను అంటుంది. ఆ తర్వాత భోజనాలు ఏర్పాట్లు జరుగుతాయి.
పిల్లలు కూడా పడుకున్నారు కదా మీరు కూడా కూర్చొని తినండి అని శారదమ్మ వాళ్ళతో అంటుంది. దాంతో అను బుర్కా తీసి తింటే దొరికిపోతానేమో అని అనుకుంటుంది. ఇక అందరూ వాళ్ళని తినమని అనటంతో వెంటనే రేష్మ ఇవాళ భాను తినదు అని అంటుంది. దాంతో అను తను ఉపవాసం అని చెప్పటంతో వెంటనే జెండే ఇది రంజాన్ మాసం కూడా కాదు కదా ఉపవాసం ఎందుకు అని అనుమానం పడతాడు.
వెంటనే రేష్మ తమ భాను కి అన్ని మతాలు ఒకటే అని అందుకే తన బాబు కోసం ఇవాళ అమ్మవారికి ఉపవాసం ఉంటుంది అని అనటంతో వెంటనే ఆర్య వాళ్ళ ఇష్టాలు వాళ్లకు ఉంటాయి ఫోర్స్ చేయొద్దు అని అంటాడు. ఇక అను తనే వడ్డిస్తాను అని అంజలితో అనటంతో అంజలి మీరు గెస్ట్ అని అంటుంది. పరవాలేదు నేను వడ్డిస్తాను అని అను తీసుకుంటుంది.
ఇక రేష్మ ఈ కర్రీ బాగుంది ఆర్య సార్ కి పెట్టు భాను అనటంతో.. వెంటనే అను ఆర్య సార్ కి ఆ కర్రీ నచ్చదు అని అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక శారదమ్మ నీకెలా తెలుసు అని అర్థంతో.. ఇందాక గోపి సర్వర్ తో చెబుతుంటే విన్నాను అని కవర్ చేస్తుంది. ఇక గోపి తను అనలేదే అనడంతో వెంటనే రేష్మ నువ్వు అన్నావు. మేము వచ్చినప్పటినుండి నువ్వు కాస్త అదోలాగా ఉంటున్నావు అని అంటుంది.
ఇక భోజనాలు చేస్తూ నీరజ్ ఈవెంట్ బిజినెస్ ఎలా నడుస్తుంది అని ప్రీతిని అడుగుతాడు. ఇక ప్రీతి అంత బాగానే ఉందని భాను రావటం వల్ల తనకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని చెబుతుంది. ఇక భాను కూడా తనకు ప్రీతి వల్ల మంచి జాబ్ వచ్చిందని చెబుతుంది. ఇక శారదమ్మ మీ ముగ్గురు బాగా చేస్తున్నట్లు అర్థం అయింది అని ముగ్గురిని పొగుడుతుంది. ఆ తర్వాత రేష్మ అను ని బాగా పొగుడుతూ ఉంటుంది.
వెంటనే ప్రీతి మా భాను కూడా సేమ్ ఆర్య సార్ లాగానే.. అను గురించి గొప్పగా చెప్పటంతో వెంటనే ఆర్యకు అను గుర్తుకురాటం వల్ల అక్కడి నుంచి లేచి వెళ్తాడు. అందరూ కూడా భోజనం పూర్తి చేసుకొని వెళ్ళాక అను ఆర్య ప్లేటులో మిగిలిన ఉన్న అన్నం తింటూ బాధపడుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని ప్రీతి వాళ్ళతో అంటుంది.
ఇక్కడే ఉంటే కాసేపు నేనే అను అని బయటపడతానేమో అనటంతో వాళ్లు కూడా సరే అంటారు. ఇక శారదమ్మ పిల్లల్ని చూసినందుకు తనకు అను పిల్లలు గుర్తుకొస్తున్నారు అని బాధపడుతుంది. అప్పుడే అను వాళ్ళు రావడంతో మేము వెళ్ళిపోతాం అని భాను అంటుంది. ఇక అంజలి లోపలికి వెళ్లి వాళ్ల కోసం చీరలు తీసుకుని వస్తుంది.
ఇక అనుకి చీర పెట్టగా బాబుకు ఆర్య మెడలో చైన్ వేస్తాడు. జెండే భానుని నీ భర్త ఏం చేస్తాడు అనడంతో దుబాయ్ లో ఉంటాడు అని అబద్ధం చెబుతుంది. ఇక రేష్మను కూడా అడగటంతో మొదట తనకు పెళ్లి కాలేదు అని నోరిజారి ఆ తర్వాత అయ్యింది అని చెబుతుంది. మరోవైపు సత్తెమ్మకు మాన్సీ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. ఇక ఆవిడ నిద్రపోయిన తర్వాత ఆవిడ ఫోన్ తీసుకొని లాయర్ కి ఫోన్ చేసి తన బెయిల్ ఎప్పుడూ అని అడుగుతుంది.
అంతేకాకుండా సత్తెమ్మ గురించి నోటికొచ్చినట్లు చెబుతుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి సత్తెమ్మ తన వైపు సీరియస్ గా చూసి నన్ను ఏవేవో అంటున్నావు అంటూ మాటలతో తనను భయపెట్టిస్తుంది. ఆ తర్వాత తన చెయ్యి గట్టిగా కోరుతుంది. దాంతో మాన్సీ గట్టిగా అరుస్తుంది. ఆర్య కాస్త ఆవేశంగా వచ్చి తన గదిలో కూర్చుంటాడు.
also read it: Krishnamma kalipindi iddarini July 27th: ఆదిత్య, అమృతల ఫోటో అఖిల కంటపడేటట్లు సౌదామిని.. గౌరీ మాటలకు షాకైన సునంద?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)