Sravanthi Chokarapu : ఆసుపత్రి బెడ్‌పై స్రవంతి- మీ ఆశీస్సులు కావాలని విజప్తి- ఇలాంటి పోస్ట్ పెడతానని అనుకోలేదంటూ ఎమోషనల్
Sravanthi Chokarapu: స్రవంతి చొక్కారపు ఆసుపత్రిలో చేరారు. చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్దగా మారిందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఎవరూ ఇలాంటి పని చేయొద్దని సూచిస్తున్నారు
Anchor Sravanthi Chokarapu Health Condition: యాంకర్ స్రవంతి చొక్కారపు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. నాన్ స్టాప్ షూటింగ్‌లో పాల్గొన్న టైంలో విపరీతమైన కడపు నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్తే అసలు విషయం తెలిసిందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్లాన్ ప్రకారం అన్నీ జరగాలన్న ఆత్రంతో ఎవరూ హెల్త్ విషయాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని సూచిస్తోంది.
ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలు షేర్ చేసిన యాంకర్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడు హాట్ గ్లామర్ ఫొటోలతో హీట్ పుట్టించి స్రవంతి ఇప్పుడు ఆసుపత్రి బెడ్‌పై ఉన్న పోస్టు పెట్టింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఎందుకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందో స్రవంతి రాసుకొచ్చారు. "అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు .ఇప్పుడు పెట్టక తప్పలేదు. కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే. స్పెషల్ గా “ఆడవారికోసం”. గత 35- 40 రోజుల నుం;f ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్. రకరకాల మెడిసిన్ వాడాను, డాక్టర్‌ని డైరెక్ట్‌గా వెళ్లి కంసల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేపించుకోలేదు."
Also Read: 'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
View this post on Instagram
నిర్లక్ష్యం చేశాను అందుకే ఈ దుస్థితి
ఇదే నిర్లక్ష్యం తనను ఈ స్థితికి తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు స్రవంతి. "ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నుంచి నెక్స్ట్‌డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది. విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాను. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని. వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. ఈజీగా కంప్లీట్‌గా రికవర్ అవ్వాలి. ముందులా నడవాలి అంటే 4 నుంచి 5 వారాలు పడుతుందని చెప్పారు డాక్టర్."
ఎలాంటి పనులు ఉన్నా హెల్త్‌ను నిర్లక్ష్యం చేయొద్దు
అందుకే ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆకాంక్షించారు స్రవంతి. "సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే. అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేశాను మళ్లీ హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో,ఇబ్బంది పడుతారేమో అని ఫీల్ అవ్వకండి. అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే, హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. వర్క్, షూట్స్, ఈవెంట్స్ అని కుదరక నెగ్లెట్ చెయ్యకండి." ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి.ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి.అని హితవు పలికారు. అంతే కాకుండా మీ బ్లెస్సింగ్ కావాలని అభిమానులకు సూచించారు. మరింత స్ట్రాంగ్‌గా తాను వస్తానని అన్నారు.
Also Read: మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?