Krishnamma kalipindi iddarini July 21th: ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సీరియల్ : అమృత, ఆదిత్యల ప్రేమ గురించి తెలుసుకొని నిప్పు పెట్టే ప్లాన్ చేస్తున్న సౌదామిని
ఆదిత్య, అమృతల మధ్య ప్రేమ నడుస్తుందన్న విషయం సౌదామిని తెలుసుకోవటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Krishnamma kalipindi iddarini July 21th: గౌరీ ఈశ్వర్ కు కాఫీ తీసుకొని వస్తుంది. ఈశ్వర్ గౌరీ కి కూడా తాపిస్తూ ఉంటాడు. అది చూసి అఖిల బాగా కుళ్ళుకుంటుంది. ఇక ఈశ్వర్ ఇష్టమైన వారు దగ్గర ఉంటే ఆ సంతోషం వేరు అని.. ఇప్పుడు అటువంటి సంతోషంలోనే నేను ఉన్నాను అని అంటాడు. ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అంటుండగా అప్పుడే గౌరీకి గతంలో తన చెల్లి జైలుకెళ్ళిన విషయం చెప్పలేదు అన్న బాధ వెంటాడుతుంది.
ఇక సమయం వస్తే అదే పరిష్కారం అవుతుందని అనుకుంటుంది. ఇక ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండటంతో అది చూసి ఓర్వలేక తన భర్తతో కూడా కాఫీ తాగాలి అని అనుకుంటుంది అఖిల. మరోవైపు ఆదిత్య అమృత ఫోటో చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అఖిల కాఫీ తీసుకొని వస్తుంది. వెంటనే ఆదిత్య అలర్ట్ అవుతాడు. ఇక పక్కకు వచ్చి కూర్చోవడంతో ఆదిత్య ఇబ్బంది పడుతూ పక్కకు జరుగుతూ ఉంటాడు.
కాఫీ తాగమని అనడంతో తనకి ఇష్టం లేదు అని అంటాడు. మీరు ఎవరినైనా ప్రేమించారా అని అనటంతో ఆదిత్య షాక్ అవుతాడు. తనకు అనుమానం వచ్చిందేమో అని అనుకుంటాడు. ఎందుకలా అడిగావు అనటంతో అసలు నన్ను భార్య లాగా చూడటం లేదు. ఇప్పటివరకు నాతో కనీసం ప్రేమ కూడా మాట్లాడటం లేదు అని.. ఇంతకుముందు ప్రేమించిన వాళ్ళు అయితేనే ఇలా చేస్తుంటారు అని అంటుంది.
దాంతో ఆదిత్య అలాంటిదేమీ లేదు అని అనగా అప్పుడే అమృత ఫోన్ నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎవరు అనటంతో ఆఫీస్ ఫోన్ అని అక్కడి నుంచి వెళ్తాడు ఆదిత్య. ఇదంతా సౌదామిని, ఉజ్వల చూసి ఆదిత్య పై డౌట్ పడతారు. ఆదిత్య బయట కూర్చుని ఉండగా అమృత ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఆదిత్య ఏమి మాట్లాడాలో తెలియక తనను ఓదార్చలేక ఫోన్ లిఫ్ట్ చేయలేక పోతాడు.
కానీ తాను అదేవిధంగా ఫోన్ చేయటంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. కొత్తపెళ్ళాం వచ్చేసరికి నన్ను మర్చిపోయావా అలా ఎందుకు అంటున్నావు అని ఆదిత్య అంటాడు. నేను ఇక్కడ ఎంత బాధ పడుతున్నానో తెలుసా అని అమృత అనడంతో.. నేను కూడా ఇక్కడ నీ గురించి ఆలోచిస్తున్నాను అని ఆదిత్య అంటాడు. అలా ఇద్దరు ఫోన్ మాట్లాడుతూ ఉండగా సౌదామిని, ఉజ్వల వచ్చి వింటారు.
ఆదిత్య తనకు ఫోన్ చేయకని.. వీలు చూసుకుని వచ్చి మాట్లాడుతాను అని ఫోన్ కట్ చేసి అక్కడి నుండి వెళ్తాడు. ఆదిత్య అమృతను ప్రేమిస్తున్నాడనే విషయం సౌదామిని వాళ్లకు తెలిసిపోతుంది. ఇక తనకు ఆయుధం దొరికింది అని ఈ దెబ్బతో అఖిల, ఆదిత్య లను విడగొట్టి నీతో పెళ్లి చేయిస్తాను అని అంటుంది. ఇంట్లో వాళ్లంతా ఒకచోట కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడే సౌదామిని తన కూతురు, భర్తతో నేను చెప్పినట్లు చేయండి అంటూ తను లబోదిబోమని మొత్తుకుంటూ ఉంటుంది. ఏం జరిగింది అని ఇంట్లో వాళ్ళు అడగటంతో.. ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తుంది. దానితో సునంద తన మనసులో కొత్త నాటకం చేస్తుందని అనుమానం పడుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial