Ammayi garu Serial Today September 25th: అమ్మాయి గారు సీరియల్: అత్తని కొట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రూప.. దీపక్ వల్ల హారతి ప్రెగ్నెంట్, విజయాంబికకు తెలిస్తే ఇక అంతే!
Ammayi garu Today Episode హారతి దీపక్‌ని పిలిచి తాను గర్భవతిని అని చెప్పడం దీపక్ తన తల్లికి తెలిస్తే చంపేస్తుందని భయపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రాఘవ కోమాలోకి వెళ్లిపోతాడు. దాంతో విజయాంబిక తన తమ్ముడు సూర్య ప్రతాప్‌తో విరూపాక్షి ఇంకా రాఘవతోనే కలిసి ఉందని విరూపాక్షి మీద తప్పుగా చెప్తుంది. దాంతో విరూపాక్షి విజయాంబికని కొడుతుంది. దాంతో సూర్యప్రతాప్ భార్య విరూపాక్షిని కొడతాడు.
సూర్యప్రతాప్: నీకున్న ఆలోచనలకు నా జీవితం నాశనం చేశావ్ అది సరిపోదన్నట్లు ఇప్పుడు నా కూతురి జీవితం కూడా నాశనం చేస్తున్నావ్.
రూప: అమ్మ ఏం చేసింది నాన్న అంతా చేసింది విజయాంబిక అత్తయ్యే.
సూర్యప్రతాప్: రూప.
విజయాంబిక: నేనేం చేశాను రూప.
రూప: నాన్న అత్తయ్యే రాఘవతో ప్లాన్ చేసి అమ్మ గదిలోకి పంపించిది. నిన్ను నమ్మించి మోసం చేసింది నాన్న.
రాజు: అవును పెద్దయ్య నేను అమ్మాయి గారు కేరళ వెళ్లినప్పుడు ఈ రాఘవ అక్కడ కనిపించి విషయం చెప్పాడు. మేం మీకు విషయం చెప్పాలి అనుకున్నప్పుడు మీ మీద విషప్రయోగం జరిగింది తర్వాత ఈ రాఘవ కనిపించకుండా పోయాడు.
రూప: మిస్ అవ్వలేదు నాన్న అత్తయ్య రాఘవని కిడ్నాప్ చేసింది. ఇంత కాలానికి మళ్లీ మాకు దొరికాడు ఇప్పటికైనా మీకు నిజం తెలుస్తుంది అనుకునే లోపు యాక్సిడెంట్.
విజయాంబిక: తమ్ముడు తను చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మన రూపకి బాగా ట్రైనింగ్ ఇచ్చారు తమ్ముడు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా రూప. నిన్ను రాజుని కేరళ పంపించడం ఎవరి ప్లాన్ రూప. (విరూపాక్షి, రాజు తండ్రి కలిసి రూప, రాజులను కేరళ హనీమూన్ పంపిస్తారు)
రూప: మా అమ్మే పంపింది.
విజయాంబిక: చూడు తమ్ముడు ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రాంతాలు ఉండగా రూప వాళ్లని అక్కడికే ఎందుకు పంపింది. అక్కడ తన ప్రియుడు రాఘవ ఉన్నాడు కనుక.
విరూపాక్షి: విజయాంబిక.
విజయాంబిక: ఎందుకు అరుస్తున్నావ్. పోనీ కేరళ నువ్వు పంపించలేదు అనుకుందాం. ఎన్నో హోటల్స్ ఉండగా రాఘవ మేనేజర్‌గా ఉన్న హోటల్లోనే రూం ఎందుకు బుక్ చేశావ్.
విరూపాక్షి: సూర్య అదంతా ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు చేశారు నాకు సంబంధం లేదు సూర్య. ఈ విజయాంబిక మాటలు నమ్మొద్దు.
సూర్యప్రతాప్: ఛీ నోర్‌మూయ్ ఇంత అడ్డంగా దొరికిపోయినా ఇంకా మాటలు చెప్తున్నావ్. నీ పాపిష్టి కళ్లు నా కూతురి మీద పడకూదడు అనుకున్నా కానీ నా దరిద్రం నువ్వు మళ్లీ నా జీవితంలోకి వచ్చావ్. నీ ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఇంకో సారి నా కూతురి జీవితంలోకి రాకు. ఓరేయ్ రాజు నువ్వు కూడా అని రూపని తీసుకెళ్లిపోతాడు..
విరూపాక్షి చాలా ఏడుస్తుంది. రాజు అత్తయ్యని ఓదార్చుతాడు. రాఘవ కోమాలో ఉన్నాడు కాబట్టి రాఘవ లేస్తే నిజాన్ని బాబుగారు ఒప్పుకుంటారని అంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత రూప చంద్ర, సుమలకు విషయం చెప్తుంది. ఇక సూర్యప్రతాప్ జరిగినదంతా ఆలోచిస్తాడు. విరూపాక్షి తన బిడ్డ జీవితం నాశనం చేస్తుందని రూప పదే పదే తనని ఎందుకు కలుస్తుందని ఏదో ఒకటి చేసి దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలి అనుకుంటాడు. ఇక రూప యాక్సిడెంట్ చేయించింది విజయాంబిక అనే అనుమానం ఉందని అత్త దగ్గరకు వెళ్లి కూపీ లాగుతానని వెళ్తుంది. మరోవైపు విజయాంబిక, దీపక్‌లు రాఘవ గురించి మాట్లాడుకుంటారు. ఇక హారతి దీపక్‌కి కాల్ చేస్తే దీపక్ చాలా టెన్షన్ పడతాడు. తల్లితో ఫ్రెండ్ అని చెప్పి బయటకు వెళ్తానని అంటాడు. విజయాంబికి దాపక్‌తో మీ ఫ్రెండ్‌ని అదే హాస్పిటల్‌కి తీసుకెళ్లి రాఘవని చంపేయ్ మని అంటుంది. రూప విజయాంబిక దగ్గరకు వచ్చి లాగి పెట్టి ఒక్కటిస్తుంది.
రూప: రాఘవని కిడ్నాప్ చేసి దాచింది మీరే కదా. నేను కాదు అని విజయాంబిక అంటే మరోసారి కొడుతుంది. నువ్వు నిజం చెప్పకపోతే కొట్టడం కాదు చంపుతా.
విజయాంబిక: నేనే దాచాను రాఘవని నేనే దాచాను.
రూప: రాఘవని బయటకు వస్తే నీకు ప్రమాదం అంతే కదా.
విజయాంబిక: అవును.
రూప: అంటే ఆ రోజు మా అమ్మ ఏ తప్పు చేయలేదు అంతే కదా.
విజయాంబిక: అవును.
రూప: ఏ తప్పు చేయని మా అమ్మ మీద నింద వేసి మా నాన్న దృష్టిలో మా అమ్మని చీడపురుగుని చేశావ్ ఏం అన్యాయం చేసింది మా అమ్మ నీకు.
విజయాంబిక: చేసింది పెద్ద అన్యాయమే చేసింది. మీ అమ్మ మా ఇంట్లో అడుగు పెట్టనంత వరకు ఆ ఇంట్లో నా మాటే శాసనం. మీ అమ్మ రావడంతో నాకు మీ నాన్న ప్రాధాన్యం ఇవ్వకుండా మీ అమ్మకే ప్రాధాన్యం ఇచ్చాడు. తట్టుకోలేకపోయాను. అందుకే మీ అమ్మపై నిందలు వేశాను.. మా ఇంటికి మీ నాన్నకి మీ అమ్మని దూరం చేశాను. అయినా అది ఎప్పుడో జరిగిపోయిన కథ. దాన్ని మీరు ఇప్పుడు బయటకు తీసుకొస్తుంటే మేం ఎలా ఊరుకంటాం. అందుకే రాఘవని కోమాలోకి పంపించా.
రూప: ఈ విషయం మా నాన్నకి చెప్తా..
విజయాంబిక: ఇప్పుడు ఆ రాఘవే వచ్చి చెప్పినా మీ నాన్న నమ్మడు ఏం చేసుకుంటాడో చేసుకో.
రూప: నువ్వు చెప్పింది నిజమే ఎలా అయినా రాఘవని బతికిస్తా మా నాన్నని ఒప్పిస్తా. మా అమ్మానాన్నలను ఒకటి చేస్తా. నువ్వు మా అమ్మకి క్షమాపణ చెప్పి ప్రతీ రోజు పాద సేవ చేసేలా చేయకపోతే నేను సూర్యప్రతాప్, విరూపాక్షిల కూతురినే కాదు.
విజయాంబిక: నన్ను చూడటానికే భయపడే రూప నన్ను కొట్టే స్థాయికి వచ్చింది చెప్తా దీని సంగతి.
దీపక్ హారతి దగ్గరకు వెళ్తాడు. హారతి చక్కగా చీర కట్టకొని రెడీ అవడంతో దీపక్ పొగడ్తలతో ముంచేస్తాడు. హారతి దీపక్కి కంగ్రాట్స్ చెప్పి తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దీపక్ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.