Ammayi garu Serial Today September 17th: అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్‌ని చంపడానికి హర్షతో చేతులు కలిపిన విజయాంబిక.. పద్మావతిగా ఇంటికి వచ్చిన విరూపాక్షి!
Ammayi garu Today Episode రూపని కలవడానికి విరూపాక్షి పద్మావతిగా రావడం సూర్య ప్రతాప్‌తో కూడా మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode సూర్య ప్రతాప్ దగ్గరకు రూప వచ్చి రాజుని బెదిరించారా అని అడుగుతుంది. దానికి విజయాంబిక రూపతో కన్న కూతురు కనిపించకపోతే ఏ తండ్రి అయినా ఇలాగే రియాక్ట్ అవుతాడని చెప్తుంది. దానికి రూప నేను ఎక్కడికి వెళ్లానో మీ ఎవరికీ తెలియనప్పుడు ఎలా బెదిరిస్తారని అంటుంది.
రూప: నాన్న నా మనసు బాలేక బయటకు వెళ్లాను కనీసం ఆ స్వేచ్ఛ కూడా నాకు లేదా. ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే మీరు ఇన్ని ప్రశ్నిస్తున్నారు. అలాంటిది రాజు నుంచి విడదీసి తెచ్చినప్పుడు మీరు ఎవరైనా ప్రశ్నించారా.
విజయాంబిక: రాజు ఎలాంటి వెధవ పని చేశాడో అందరికీ తెలసు. అలాంటప్పుడు ఎందుకు అడుగుతారు.
రూప: రాజు ఎలాంటి వాడో మీకు తెలిసి కూడా నోరు తెరవలేదు ఎందుకంటే రాజు మీకు ఏం కాడు కాబట్టి. నాన్న మీకు సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతా. నాన్న రాజు నా మెడలో తాళి కట్టడం తప్ప ఒక్క తప్పు ఏం చేశాడో చెప్పండి ఎన్నో ఏళ్లగా మీకు రాజు తెలుసు కదా ఒక్కటంటే ఒక్కటి చెప్పండి. ఏం చెప్పలేరు నాన్న ఎందుకు అంటే రాజు ఏం చేయడు కాబట్టి. మీ పరువు పోగొట్టే పని ఒక్కటంటే ఒక్కటి కూడా చేయడు.
విజయాంబిక: దీన్ని ఇలాగే వదిలేస్తే నా తమ్ముడి మనసు మార్చేస్తుంది.
చంద్ర: అన్నయ్య రాజు గురించి మీరు చాలా సార్లు పొగిడారు. ఇప్పుడు ఇలా అంటే ఎలా అన్నయ్య.
రూప: త్వరలోనే మీకు తెలుస్తుంది నాన్న అత్తయ్య విషయంలో ఏం చేశాడు. నేను తనతో వస్తాను అన్న మీ అందరూ ఒప్పుకుంటేనే తీసుకెళ్లా అని నన్నువదిలేసి వెళ్లాడు. రాజు మాటే నా మాట కూడా మీ అంగీకారంతోనే నేను రాజు వెంట నడుస్తా.
సూర్య ప్రతాప్ తనలో తాను తప్పు చేస్తున్నానా అని అనుకుంటాడు. ఇక విజయాంబిక శ్వేత, హర్షలను కలుస్తుంది. తమ నాన్నని సీఎం చేయాలి అనుకుంటున్నాం అని మీ సాయం కావాలని అడుగుతాడు హర్ష. దానికి విజయాంబి మా తమ్ముడు ఉండగా అది కష్టం అని అంటాడు. దానికి హర్ష మీ మామయ్యని లేపేస్తాం అని అంటాడు. దీపక్ సీరియస్ అవుతూ కాలర్ పట్టుకొంటాడు. దానికి హర్ష మీ తమ్ముడి వల్ల మీకు ఏం పదవి రాలేదని అదే మా నాన్న అయితే మీకు మినిస్టర్ పదవి ఇస్తానని అంటాడు. ఇక సీఎం అవ్వడానికి ఆయన భార్య పార్టీకి ఫండ్ ఇస్తానంటే సీఎం అయ్యాడని చెప్తుంది.
మరోవైపు సీఎం గారికి కలవాలి అని నర్స్ పద్మావతి వస్తుంది. తిరుపతి ప్రసాదం తీసుకొని వచ్చానని అంటుంది. పద్మావతితో అందరూ సంతోషంగా మాట్లాడుతారు. ఇక పద్మావతిని సుమ రూప దగ్గరకు తీసుకెళ్లుంది. ఇక మరోవైపు విజయాంబిక దీపక్‌తో విరూపాక్షి తెలివిగా పద్మావతి పేరుతో ఇంటికి వచ్చి తన తమ్ముడితో మాట్లాడుతూ సాయం చేస్తుందని చెప్తుంది. విరూపాక్షి వల్ల వచ్చిన పదవి నాకు వద్దు అని కోప్పడతాడని లేదంటే విరూపాక్షి చేసిన పనికి తనని క్షమించి ఇంట్లో ఉంచేస్తాడని అంటుంది. దానికి దీపక్ విరూపాక్షి అత్తయ్య ఇంట్లో ఉంటే మనల్ని ఉండనివ్వదు అని అంటాడు. హర్ష, శ్వేతలకు సాయం చేస్తే కనీసం పదవులు అయినా వస్తాయని అనుకుంటారు. వాళ్ల దగ్గరకు వెళ్లి దీపక్‌ని మినిస్టర్‌ని చేస్తే మీకు సాయం చేస్తామని అంటారు. హర్ష దీపక్‌తో రాత్రి పది నిమిషాలు మీ ఇంటికి సెక్యూరిటీ లేకుండా చేయమని అంటాడు. రాత్రికి సూర్యప్రతాప్‌ని చంపేస్తానని అంటాడు.
పద్మావతిలా వచ్చిన విరూపాక్షిని చూసి రూప అమ్మా అని ఎమోషనల్ అవుతుంది. ఇక విరూపాక్షి రూప కోసం భోజనం తీసుకురమ్మని సుమతో చెప్తుంది. రూప తల్లితో తన బాధ చెప్పుకొని బాధ పడుతుంది. తనని కడుపు మీద కాల్చిన వాడు గుండెల మీద కాల్చినా బాగుండేదని అంటుంది. దానికి విరూపాక్షి ఇలాంటి బాధలు తట్టుకొని నిలబడటానికి మీ అమ్మే నీకు ఆదర్శం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.