Satyabhama Serial Today September 17th: సత్యభామ సీరియల్: ఫస్ట్ నైట్ గదిలో నందిని మీద హర్ష ఫైర్.. తండ్రిని కడతేర్చడానికి సర్వం సిద్ధం చేసుకున్న రుద్ర!
Satyabhama Today Episode నందిని ముద్దు పెట్టబోయిన హర్షతో నందిని మైత్రిని కూడా ఇలాగే ముద్దు పెట్టుకున్నావా అని ప్రశ్నించడంతో హర్ష కోపంగా బయటకు వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode ఈ రోజు తమకు ఫస్ట్ నైట్ అని ఈ రోజు ఏం గండం అడ్డుపడుతుందో అని నందిని అంటుంది. ఇక నందిని మైత్రి చేతిలో పాల గ్లాస్ పెట్టి నా చేతితో ఇస్తే తాగడం లేదు నువ్వు ట్రై చేయ్ అని అంటుంది. నందిని బాధ పెడుతున్నావ్ అని హర్ష అంటాడు. దానికి మైత్రి నందిని చెప్పినట్లు విను నీ జీవితం బాగుంటుందని చెప్పి పాల గ్లాస్ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది.
రుద్ర నర్శింహకు ఫోన్ చేసి ఈ రోజు రాత్రికి మర్డర్‌కి ముహూర్తం పెట్టానని అంటాడు. ఒకరి పేరు బయటకు రాకూడదని ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. రుద్ర తనతో తాను రెండు దండలు రెండీ చేస్తానని తన తండ్రి చావు తర్వాత నిన్ను చంపేస్తా అని నర్శింహ గురించి అనుకుంటాడు. ఇక మరోవైపు భైరవి చిన్నాకి ఇష్టం అని శోభనం కోసం స్వీట్స్ రెడీ చేస్తుంది. పంకజం వచ్చి భైరవిని రెచ్చగొడుతుంది. సత్య క్రిష్‌ల శోభనం ఆపుతానని అంటుంది. పంకజం షాక్ అయిపోతుంది.
భైరవి: స్వీట్లు ప్రేమతో చేయలేదే ఒక ప్లాన్‌తో చేశా. ఇవి తింటే మత్తు నషాలానికి అంటుతుంది. జరగాల్సింది జరగకుండా ఆపడానికి ప్రయత్నించా.
రేణుక సత్యని చక్కగా ముస్తాబు చేస్తుంది. చాలా ముద్దొస్తున్నావ్ సత్య అని రేణుక అంటే సత్య ముద్దు రావాల్సింది మీ మరిదికి అక్క అని అంటుంది. క్రిష్ ప్రేమ విలువ తెలీక చాలా పోగొట్టుకున్నానని అందుకే ఇప్పుడు తన ప్రేమ తెలుసుకున్నానని అంటుంది. ఇక జయమ్మ అక్కడికి వస్తుంది. ఇక క్రిష్ గురించి అడుగుతుంది. శోభనం గదిలో ఉన్నాడని సత్య చెప్తే ఆరాటం పెళ్లికొడుకు అప్పుడే పేరంటానికి రెడీ అయిపోయాడా ఉండు వాడి పని చెప్తా అని క్రిష్ గదికి వెళ్తుంది. మరోవైపు క్రిష్ సెంటు కొట్టుకుంటూ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఉంటాడు.
ఇంతలో పాల గ్లాస్‌తో సత్య వస్తుందని అనుకొని తలుపు చాటున దాక్కొని జయమ్మని సత్య అని వాటేసుకుంటాడు. జయమ్మ క్రిష్‌ని తిడుతుంది. క్రిష్ తల పట్టుకుంటాడు. ఇక క్రిష్ నానమ్మ సత్యని తొందరగా పంపించవే అని వేడుకుంటాడు. జయమ్మ కౌంటర్లకు నవ్వొస్తుంది. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని సత్యతో చక్కగా మాట్లాడని అంటుంది జయమ్మ. మీ ఇద్దరి సంతోషమే మాకు కావాలని అంటుంది.
మరోవైపు మహదేవయ్య తన చిన్న కొడుకు కోడలు ఫస్ట్ నైట్ కారణంగా సంతోషంతో రౌడీలకు డబ్బు ఇచ్చి పార్టీ చేసుకోమని అంటాడు. రుద్ర వచ్చి ఇక్కడుంటే ఏం పార్టీ చేసుకుంటారని బయటకు వెళ్లమని చెప్పాడు. ఇక మహదేవయ్యని చూసి నీ చావుకి నువ్వే ముహూర్తం పెట్టుకుంటున్నావ్ బాపు కొద్ది నిమిషాల్లో నీ చావు ఏడుపు ఇంట్లో వినిపిస్తుందని అనుకుంటాడు.
మరోవైపు హర్ష, నందినిల తొలిరేయి ఏర్పాట్లు జరుగుతాయి. నందిని పాల గ్లాస్‌తో హర్ష దగ్గరకు వస్తుంది. ఇద్దరూ పాలు షేర్ చేసుకుంటారు. ఇక హర్ష నందినిని ముద్దు పెట్టుకోవడానికి వెళ్లాడు. నందిని తనకు ఓ అనుమానమని ఇంతకు ముందు మైత్రికి కూడా ఇలాగే ముద్దు పెట్టావా అని హర్షని అడుగుతుంది. హర్ష హర్ట్ అయి నందినిని తీసేసి నీ బుద్ధి మారదని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.