అన్వేషించండి

Ammayi garu Serial Today September 13th: అమ్మాయి గారు సీరియల్: రూప కోసం రాజు ఇంటికి వెళ్లి గన్‌తో వీరంగం సృష్టించిన సీఎం.. శ్వేతకి గుడ్ న్యూస్!

Ammayi garu Today Episode రూప రాజు ఇంటికి వచ్చి ముత్యాలు గురించి డాక్టర్ చెప్పిన మాటలు విని తిరిగి వెళ్లిపోవడం ప్రతాప్ రాజు ఇంటికి వచ్చి గన్‌తో హడావుడి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode అత్తయ్యని కలిసి ఒప్పించాలని ఎవరికీ తెలీకుండా రూప ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఇక విజయాంబిక, దీపక్‌లు రూప ఏం చేస్తుందో చూద్దామని వెళ్లి గదిలో రూప లేకపోవడం గుర్తిస్తారు. కిందకి వచ్చి సూర్య ప్రతాప్‌కి రూప కనిపించడం లేదని చెప్తారు. 

విజయాంబిక: తమ్ముడు మన రూపని ఆ రాజు గాడే తీసుకెళ్లిపోయి ఉంటాడు. 
చంద్ర: మన ఇంట్లో ఉన్న రూపని తాను ఎలా తీసుకెళ్తాడు.
విజయాంబిక: తనకి తప్ప రూపని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది. 
దీపక్: అసలే ఆపరేషన్ అయిన మనిషి ఇలా ఎక్కడికి వెళ్తుంది. 
విజయాంబిక: రూప ఇప్పుడు ముఖ్యమంత్రి కూతురు ఇలా చెప్పకుండా వెళ్తే నా తమ్ముడి పరువు ఏమైపోతుంది. 
ప్రతాప్: రూప చాలా పెద్ద తప్పు చేసింది అక్క.
విజయాంబిక: రూపకి ఇందులో ఏం సంబంధం ఉండదు తమ్ముడు వాళ్లే ఇదంతా చేసుంటారు. 
ప్రతాప్: మాటలతో వాళ్లు వినరు చేతలతో చెప్పి రూపని తీసుకొస్తా.

గొడవలు వద్దని ఫోన్ చేసి రూపని పిలుస్తానని చంద్ర ప్రతాప్‌తో చెప్తాడు. చంద్ర రూపకి కాల్ చేస్తాడు. రూప ఫోన్ స్విఛ్ ఆప్ వస్తుంది. దాంతో వాళ్లే ఇదంతా చేసుంటారని విజయాంబిక రెచ్చగొడుతుంది. దాంతో సూర్య ప్రతాప్ ఆవేశంగా వెళ్తాడు. కళ్లు తిరిగి పడిపోయిన ముత్యాలుకి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇంతలో రూప అక్కడికి వస్తుంది. ముత్యాలు ఎక్కువ టెన్షన్ పడితే గుండె నొప్పి వస్తుందని డాక్టర్ చెప్తారు. ఆ మాటకు ఇంట్లో వాళ్లతో పాటు రూప కూడా షాక్ అవుతుంది. 

అప్పలనాయుడు: ముత్యాలు అనవసరమైన విషయాలు ఆలోచించకే.
ముత్యాలు: నేను చచ్చిపోయినా పర్లేదు అన్నాడు అలాంటప్పుడు నేనేమైపోతే ఏంటి. 
రాజు: అమ్మా నువ్వు నా శత్రువు కాదు. నా ప్రాణం నువ్వు. నా గురించి గొప్పగా ఆలోచించాల్సి నువ్వే అలా అంటే నేనేం చేయాలి చెప్పమ్మా.
రూప: అంటే నేను ఇప్పుడు లోపలికి  వెళ్తే అత్తయ్య కోపంగా ఫీలవుతారు. ఆ తర్వాత ఏదైనా జరగరానిది జరిగితే అలా జరగడం నాకు ఇష్టం లేదు. అనుకుంటూ రూప వెనుదిరుగుతుంది.

సూర్య ప్రతాప్ ఆవేశంగా వస్తారు. అతని గన్‌ మాన్‌ల దగ్గర నుంచి గన్ తీసుకొని ఆవేశంగా రాజు ఇంట్లోకి వెళ్తారు. రూప అని గట్టిగా పిలిచి నా రూప ఎక్కడా అని రాజు రాగానే అతనికి గన్ గురి పెడతారు. ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అమ్మాయి గారు ఇక్కడ ఎందుకు ఉంటారు పెద్దయ్య గారు అని రాజు అంటాడు. ఇక రూప ఇంటికి వెళ్లిపోతుంటుంది. ముత్యాలు కలుగజేసుకొని నిన్న కూతుర్ని తీసుకెళ్లిపోయి ఆమెను ఏమైనా చేసుంటారని పదవి పోతుందని ఆ నింద మన మీద వేయడానికి వచ్చారని అంటుంది. అప్పలనాయుడు అమ్మాయిగారు ఇంట్లో లేరని చెప్తాడు. సూర్య ప్రతాప్ ఒకరికి వంగ గన్ చూపిస్తూ రూపని ఎవరు దాచారని అడుగుతాడు. ఇళ్లంతా గాలిస్తాడు. అమ్మాయి గారు లేరని రాజు చెప్పినా వినడు. అమ్మాయి గారు ఏమైపోయారని అందరూ అనుకుంటారు. 

రూప ఎక్కడ ఉందో నిజం చెప్పమని ప్రతాప్ రాజుని తోసేసి నువ్వు తప్ప వేరే ధ్యాసే లేకుండా ఉంటుంది నా కూతుర్ని ఏం మాయ చేశావురా అని అడుగుతారు. దానికి రాజు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అంటాడు. ఇక రాజు అమ్మాయి గారికి ఏమైందని అమ్మాయి గారికి ఏమైనా అయితే నేను ఏం చేస్తానో నాకే తెలీదని రాజు అంటాడు. సాయంత్రం లోపు రూప ఇంటికి రాకపోతే నీ అంతు చూస్తా అని బెదిరించి సూర్య ప్రతాప్ ఇంటికి వెళ్లిపోతాడు. రాజు కూడా ఆవేశంతో గన్ తీసుకొని వచ్చి రూప కనిపించకుండా ఉండటానికి శ్వేత, రేణుకలే కారణం అనుకొని బయటకు వెళ్తాడు. ముత్యాలు ఆపినా ఆగడు.  ఇక ముత్యాలుకి శ్వేత ఫోన్ చేస్తుంది. పెళ్లి గురించి రాజు ఏమన్నాడు అంటే రాజు ఒప్పుకోలేదని ముత్యాలు చెప్తుంది. ఇక సూర్యప్రతాప్ ఇంటికి వచ్చి చేసిన రచ్చ గురించి రూప కనిపించడం లేదని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్ ప్రోమో: విహారి, లక్ష్మీలకు పెళ్లి జరిగిందని సహస్రకి తెలిసిపోతుందా..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget