అన్వేషించండి

Ammayi garu Serial Today September 11th: అమ్మాయి గారు సీరియల్: చచ్చినా నిన్ను రాజు దగ్గరకు పంపనని రూపతో చెప్పిన ప్రతాప్.. సీక్రెట్‌గా కలుసుకున్న రాజు, రూప!

Ammayi garu Today Episode తనని కాదని అమ్మాయి గారిని కలిస్తే నా శవాన్ని చూస్తావని కొడుకు రాజుతో ముత్యాలు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజుని ముత్యాలు లాక్కొచ్చి గదిలో పెడుతుంది. ఇక మీద ప్రతాప్ ఇంటికి వెళ్లొద్దని రూపని కలవడానికి వీల్లేదు అని చెప్తుంది. ఇక రాజు గదిలో ఉన్న చిన్నపిల్లల పోస్టర్లు అన్నీ చింపి పడేస్తుంది. రూపని కోడలిగా అంగీకరించని అంటుంది.

ముత్యాలు: అదేదో తప్పు చూపించి నిన్ను వదిలేసి వెళ్లిపోయారు. అలాంటి వాళ్ల కోసం నువ్వు ఆలోచించడం కరెక్ట్ కాదు. ఆ పెద్ద మనిషి ఏదో మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు.
రాజుతండ్రి: ముత్యాలు పెద్దయ్య గారి గురించి పక్కనపెట్టు రాజు మీదే పంచప్రాణాలు పెట్టుకొని ఉన్న అమ్మాయి గారి గురించి ఆలోచించు. వాళ్లిద్దరూ కలిసి ఉండక పోతే మనవడు ఎలా వస్తాడు. 
ముత్యాలు: ఏంటయ్యా నువ్వు వాళ్లిద్దరినీ నేను విడదీసినట్లు మాట్లాడుతున్నావు. ఇదంతా వాళ్లే కదా చేసింది. నేను సీమంతం ప్లాన్ చేస్తే ఆ పెద్ద మనిషి గన్ పేలేలా చేశాడు. లేదంటే మన ఇంట్లోకి అంత ధైర్యంగా వస్తారు. ఆయన గన్ ఎవరు గురి పెడతారు. నువ్వు బాగుండటం ఇష్టం లేక నీకు బిడ్డ పుట్టడం ఇష్టం లేక ఇదంతా చేశారు. ఇక చివరకు మీరిద్దరూ కలిసి ఉండటం ఇష్టం లేక ఆ విజయాంబిక ప్లాన్ చేసి నువ్వు ఏదో క్షమించరాని తప్పు చేసినట్లు చూపించి రూపని తీసుకెళ్లిపోయారు. అయినా నువ్వు ఇదంతా ఎందుకు చేశావ్ వాళ్ల మంచి కోసమే కదా. ఆ రూప అయినా నేను రాను నాన్న నాకు నీ కంటే రాజే ఎక్కువ అని చెప్పిందా లేదే. అయినా మొగుడితో కాదని నాన్నతో పోయిన అమ్మాయి మనకు ఎందుకురా. వాళ్లు వద్దు వాళ్ల అమ్మాయి మనకు వద్దు. కాదూ కూడదు అని నువ్వు వెళ్లాలి అనుకుంటే నా శవాన్ని దాటుకొని వెళ్లు.
రాజు: అమ్మా,, అమ్మా.

ప్రతాప్ రూపని తీసుకొచ్చి గదిలోకి వెళ్తారు. ఎవరు పిలిచినా వినరు. దీపక్, విజయాంబిక ఇద్దరూ తమ ప్లాన్ సక్సెస్ అయిందని ఇక విరూపాక్షి మేటర్ క్లోజ్ చేయాలి అనుకుంటారు. ఇక ప్రతాప్ రూపని రాజు గురించి మర్చిపోమని అంటాడు. దానికి రూప రాజు తన భర్త అని రాజు లేకుండా ఉండలేను అని బతికితే రాజుతో బతుకుతాను అని లేదంటే చచ్చిపోతాను అని అంటుంది. దానికి నీకు నాన్న అవసరం లేదా అని ప్రతాప్ అంటాడు. రాజు తప్పు చేశాడని నమ్ముతున్నారా అని అడుగుతుంది. తన అక్కని తప్పుగా చిత్రీకరించిన వాడిని క్షమించనని అంటాడు. చచ్చినా నిన్ను ఆ ఇంటికి పంపించనని ప్రతాప్ రూపతో చెప్తాడు. ఇక్కడే నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటానని అంటాడు. దానికి రూప పెళ్లి కాకపోయి ఉంటే మీరు చెప్పినట్లే ఉంటానని కానీ ఇప్పుడు తనకు అంతా రాజే అని అంటుంది. కానీ తనకు తండ్రీ, భర్త ఇద్దరూ కావాలని ఇద్దరూ కలవాలని అంటుంది. దానికి ప్రతాప్ అది ఎప్పటికీ జరగదు అని అంటాడు. రాఘవ దొరకగానే మీకు నిజం చెప్పిస్తాను అని రూప మనసులో అనుకుంటుంది. 

మరోవైపు రాజు తండ్రి దగ్గర బాధ పడతాడు. నీ మీద ప్రేమ వల్లే నీ తల్లి ఇలా చేస్తుందని అంటుంది ఇక రాజు అమ్మాయి గారిని కలవాలి అని తన ఆరోగ్యం ఎలా ఉందో అని టెన్షన్ పడతాడు. దానికి అతని తండ్రి వెళ్లమని అమ్మాయి గారికి ధైర్యం ఇవ్వమని అంటాడు. రూప రాజు, తండ్రి గురించి ఆలోచిస్తుంది. రాజు దొంగతనంగా ప్రతాప్ ఇంటికి వచ్చి రూపని కలుస్తాడు. మరోవైపు ప్రతాప్ విజయాంబికకు క్షమాపణ అడుగుతాడు. ఓ అబద్దాన్ని నమ్మి నిన్ను అసహ్యించుకొని అనరాని మాటలు అన్నానని అంటాడు. ఇక విజయాంబిక ఇదంతా చేసింది ఆ విరూపాక్షినే అని పుల్ల పెడుతుంది. 

ప్రతాప్‌ని నమ్మించాలి అని చూస్తుంది. మొసలి కన్నీళ్లు కార్చుతుంది. రూప, రాజు హగ్ చేసుకొని మాట్లాడుకుంటారు. ఇక రూప దగ్గరకు ప్రతాప్ వస్తాడు. ప్రతాప్ చూడకుండా రాజు దాక్కుంటాడు. రూప తండ్రితో రాజు గురించి మరోసారి ఆలోచించమని అంటుంది. ఇక ప్రతాప్ వెళ్లిపోగానే రాజు బయటకు వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: త్వరలోనే ఇంటికి వస్తానంటూ సుమతి లెటర్.. టీచర్ మీద సీతకు డౌట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana: ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Embed widget