Ammayi garu Serial Today October 31st: కోమలి మోసం చేసిందని రగిలిపోతున్న అశోక్! ఏం చేస్తాడు?
Ammayi garu Serial Today Episode October 31st కోమలి, రాజు చనువు చూసి అశోక్ కోమలిని చంపేయాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode కోమలిని రాజు తీసుకొని గుడికి వస్తాడు. తాయొత్తు వల్ల రాజు పూర్తిగా తన వశం అయిపోయాడని కోమలి అనుకుంటుంది. అశోక్ దొంగ చాటుగా రాజు, కోమలిని చూడటం రాజు చూస్తాడు. మనసులో ఈరోజు నా నటనకు దెబ్బకి అశోక్ కోమలిని ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోవాలి అని అనుకుంటాడు. రాజు మనసులో అమ్మాయి గారు ఈ అమ్మాయిని ముట్టుకున్నాపట్టుకున్నా మిమల్ని గెలిపించడానికే మీరు చూస్తే తట్టుకోలేరని మిమల్ని తీసుకురాలేదు అని అనుకుంటాడు.
అశోక్ కోమలికి కాల్ చేస్తాడు. కోమలి కట్ చేస్తుంది. అశోక్ చూస్తుంటే రాజు కోమలితో చనువుగా ఉంటాడు. కోమలి రాజుకి బొట్టు పెడుతుంది. అశోక్ రగిలిపోతాడు. కోమలి మనసులో అశోక్ గురించి మొక్కుకుంటుంది. రాజు కోమలి గుడిలో కూర్చొంటారు. రాజుకి కోమలి ప్రసాదం తినిపిస్తుంది. మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని రాజు అంటే మనం ఎప్పుడూ ఇలాగే సంతోషం ఉంటాం అని కోమలి అంటుంది. మన మధ్యలోకి ఎవరూ రారు.. మనం ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉంటాం అని అంటుంది. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకోవడం కోమలి మాటలు విని అశోక్ రగిలిపోతాడు. కోమలి మోసం చేస్తుంది తనని చంపేయాలని అశోక్ అనుకుంటాడు.
మందారం ఇంట్లో పని చేయడం దీపక్ చూసి నువ్వు పని చేయొద్దు మందారం నువ్వు నా మహారాణి అని కూర్చొపెట్టి పళ్లు తినిపిస్తాడు. అది విజయాంబిక చూసి మందారాన్ని ఇలాగే వదిలేస్తే రేపు వాడు నా చేత కూడా మందారానికి సేవలు చేయిస్తాడు. మందారాన్ని కంట్రోల్‌లో పెట్టాలి అని విజయాంబిక అనుకుంటుంది. దీపక్ ఫోన్ వచ్చి పక్కకి వెళ్లడంతో విజయాంబిక మందారం దగ్గరకు వెళ్తుంది. నా కొడుకుని ఏం చేశావే.. ఇంతలా మార్చేశావ్ ఏం మందు పెట్టావే అని అడుగుతుంది. ఇంతలో రూప వచ్చి నువ్వు పెట్టిన మందే పెట్టింది అత్తయ్య అని అంటుంది.
కోమలి, మీరు కలిసి ఏం మందు పెట్టి నన్ను రాజుని విడదీశారో అదే మందు పెట్టి మందారం, దీపక్‌లను ఒక్కటి చేశాం అని రూప చెప్తుంది. విజయాంబిక షాక్ అయిపోతుంది. నీ పని ఇక అయిపోయింది అత్తయ్యా ఇంట్లో అందరి విషయంలో నువ్వు తప్పు చేశావ్ నీ పాపాలకు ఈ రోజుతో ముగింపు పలుకుతా అని అంటుంది.
విజయాంబిక కోమలిని తాయొత్తు గురించి అడగాలి అనుకుంటుంది. రాజు, కోమలి రాగానే కోమలిని తీసుకెళ్తుంది. రాజు రూపతో మన ప్లాన్ సూపర్ సక్సెస్ అని అశోక్ ఫుల్లుగా ఉడిపోయాడని కోమలిని చంపేయాలి అన్నంత కోపంగా ఉన్నాడని కాసేపట్లో ఇంటికి వస్తాడని అంటాడు. విజయాంబిక కోమలితో దీపక్‌కి మందారంతో తాయొత్తు కట్టించారని చెప్తుంది. దాంతో కోమలి విరుగుడు చెప్తుంది. ఇంతలో రాజు వచ్చి అమ్మాయి గారు ఈ విజయాంబికకు ఒళ్లంతా విషమే ఈవిడతో మీరు మాట్లాడొద్దు అని కోమలిని తీసుకెళ్లిపోతాడు. రాజు నన్ను వదలడం లేదు అశోక్తో మాట్లాడి విషయం చెప్పాలి అనుకుంటుంది. రాజుకి జ్యూస్ చేసి ఇవ్వమని అంటుంది.
రాజు సరే అంటాడు. అశోక్‌తో మాట్లాడాలి అని కోమలి గదికి వెళ్తుంది. అశోక్‌కి కాల్ చేస్తుంది. అశోక్ ఫుల్‌గా ఫైర్ అయిపోతాడు. నువ్వేం చెప్పినా నమ్మాను నువ్వు నన్ను మోసం చేస్తున్నావ్.. నీ అంతు చూస్తా అని అశోక్ ఫైర్ అయిపోతాడు. కోమలి అశోక్కి విషయం చెప్పేలోపు రాజు వచ్చి ఫోన్ లాక్కుంటాడు. నీరసంగా ఉందని చెప్పి ఫోన్ మాట్లాడుతారేంటి జ్యూస్ తాగి పడుకోండి మీరు కోలుకున్న వరకు నోఫోన్ అని రాజు ఫోన్ తీసుకుంటాడు. కోమలి చాలా టెన్షన్ అయిపోతుంది. అశోక్ మళ్లీ కోమలికి కాల్ చేస్తాడు. రాజు కట్ చేసేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















