Ammayi garu Serial Today October 16th: అమ్మాయి గారు సీరియల్: కథ మళ్లీ మొదలు.. పెళ్లి చూపులు టూ పెళ్లి.. ఈసారి అందరి సమక్షంలోనే!
Ammayi garu Today Episode రాజు, రూపల పెళ్లి తన కళ్లెదురుగా జరగలేదని ముత్యాలు మరోసారి పెళ్లి తంతు జరగాలని కోరడం ఇంట్లో వాళ్లు అలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రూపని రాజు బయటకు రమ్మని పిలుస్తాడు. రూప తన పిన్నిని చాటుగా పిలిచి రాజు తనకు సర్ఫ్రైజ్ ప్లాన్ చేశాడని ఇంటికి రమ్మని పిలుస్తున్నాడని నేను వెళ్తానని నాన్న అడిగితే నువ్వే మ్యానేజ్ చేయ్ అని చెప్తుంది. దానికి సుమ కంగారు పడుతూనే సరే అంటుంది. రూప చాటుగా ఎవరూ చూడకుండా రాజు దగ్గరకు వెళ్తుంది. రాజు రూపని తీసుకొని వెళ్తాడు.
ఇక సూర్యప్రతాప్ సుమని పిలిచి రూపని పిలవమంటాడు. దానికి సుమ రూపకి తలనొప్పిగా ఉందని పడుకోమన్నానని అంటుంది. సూర్యప్రతాప్ వెళ్లి రూపని చూస్తాను అంటే విజయాంబిక వద్దని ఒకసారి ముందు అడుగు వేసి మరో సారి వెనక్కి వెళ్లొద్దని అంటుంది. ఇక విజయాంబిక ఎదురు రావడంతో సూర్యప్రతాప్ క్యాంపెయిన్‌కి బయల్దేరుతాడు. ఇక ముత్యాలు ఇంట్లో అందరూ రాజు, రూపల కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో రాజు రూపని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక మందారం సుమని రూప గురించి అడుగుతుంది. రాజు తీసుకెళ్లాడని సుమ చెప్పడం విజయాంబిక దీపక్ వినేస్తారు. దాంతో విజయాంబికి రూప, రాజులను రెడ్ హ్యాండెడ్‌గా సూర్యప్రతాప్‌కి పట్టించాలని అనుకుంటారు.
రూప అత్తయ్యని హగ్ చేసుకుంటుంది. ముత్యాలు కూడా రూపని హగ్ చేసుకొని చాలా సంతోషిస్తుంది. ముత్యాలు మరోసారి క్షమాపణ చెప్తుంది. ఇక రూప విరూపాక్షిని హగ్ చేసుకుంటుంది. ఇక రూపకి అత్తామామల పెళ్లి రోజని చెప్తుంది విరూపాక్షి. ఇక ముత్యాలు రాజు, రూపలకు కొత్త బట్టలు ఇస్తుంది. ఇక రూప రెడీ అవ్వడానికి వెళ్తుంది. రాజుకి ముత్యాలు థ్యాంక్స్ చెప్తుంది. రూప అత్తయ్యని రాజు తండ్రిని తీసుకొని కేక్ కటింగ్‌కి తెస్తారు. అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పలనాయుడు ముత్యాలు దండలు మార్చుకుంటారు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. ఒకరికి ఒకరు తినిపించుకున్న తర్వాత రాజు, రూపలు తినిపిస్తారు.
రూప: అత్తయ్య నేను మీ ఇద్దరినీ ఆదర్శంగా తీసుకొని పెళ్లి అయిన తర్వాత నేను నా భర్త మీ ఇద్దరిలా ఉండాలి అనుకునే దాన్ని. ఇంత వయసు వచ్చిన ఒకరి మాట ఒకరికి గౌరవం ఒకరు అంటే ఒకరికి ప్రేమ ఇలా ఎన్నో మంచి క్వాలిటీస్‌లు ఉన్నాయి ఇద్దరికీ. మీ రిద్దరూ ఇప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి.
ముత్యాలు: వచ్చే పెళ్లి రోజు లోపు నా చేతిలో ఓ మనవడిని పెట్టాలి.
రూప: అలాగే అత్తయ్య నాన్న అమ్మలు కలిసి మమల్ని భార్య భర్తలుగా అంగీకరిస్తే మీరు అనుకున్నట్లే జరుగుతుంది. సరే అత్తయ్యా నేను వెళ్తా నాన్నకి తెలీకుండా వచ్చాను. నాన్నకి తెలిస్తే మళ్లీ గొడవ జరుగుతుంది.
ముత్యాలు: ఉండండి అమ్మాయి గారు నేను మిమల్ని మా రాజు పెళ్లి చేసుకోన్నప్పటి నుంచి నేను మిమల్ని సరిగా చూడటానికి కారణం మీ పెళ్లి నేను చేయకపోవడం చూడకపోవడం నా కొడుకు పెళ్లి ఎలా చేయాలి అనుకున్నానో అలా ఒకసారి చేస్తానమ్మాయి గారు.
రూప: సరే రాజు అత్తయ్య గారు చెప్పినట్లు చేసి వెళ్దాం.
ముత్యాలు: పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు అన్నీ జరగాలి అందరం పాత వాళ్లలా రెడీ అవుదాం.
రాజు కుటుంబం మొత్తం పేదింటి వాళ్లలా రెడీ అవుతారు. పెళ్లి చూపులు మొదలవుతాయి. విరూపాక్షి రూపని పిలిచి అందరికీ కాఫీ ఇవ్వమని చెప్తుంది. రాజు, రూప ఒకర్నిఒకరు చూసుకొని నవ్వుకుంటారు. ఇక ముత్యాలు అమ్మాయి బాగుందిరా అని అంటుంది. ఇక అందరూ కాఫీ తాగి కక్కలేక మింగలేక ముఖాలు పెడతారు. రూప నవ్వుకుంటుంది. ఏమైందని విరూపాక్షి అడిగితే కాఫీ అమ్మాయి గారిలా అద్భుతంగా ఉందని రాజు అంటాడు. అందరూ తలాడిస్తారు. ఇంతలో రూపకి తన తండ్రి గుర్తొచ్చి లేచేస్తుంది. నాకు నచ్చలేదని అంటుంది. దానికి అప్పలనాయుడు అయ్యగారు లేరని అమ్మాయి గారు బాధ పడుతున్నారని చెప్తాడు. దానికి రాజు పెద్దయ్యా గారు ఉన్నట్లు ఊహించుకోమని అంటాడు. రూప మెట్లవైపు చూసి తండ్రి నడిచి వస్తున్నట్లు ఊహించుకుంటుంది. సూర్యప్రతాప్ రావడంతో అందరూ లేచి నిల్చొంటారు. ఏంటీ మీరు మీరు మాట్లాడుకొని పెళ్లి చూపుల వరకు వచ్చారని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: మీడియా ముందు మామని ఇరికించేసిన సత్య.. ఇక నో వెపన్స్.. మైత్రి, హర్షల సరసాలు చూసేసిన నందిని!