అన్వేషించండి

Ammayi garu Serial Today November 22nd: అమ్మాయి గారు సీరియల్: విజయాంబికని తొక్కి నార తీసిన భర్త.. నాటు వైద్యం అంటూ గొడ్డు చాకిరి చేయించేశాడుగా!

Ammayi garu Today Episode విజయాంబిక పని పట్టాలని తన భర్త స్వామీజీ అయిన రఘు విజయాంబికతో ఇంటి పనులన్నీ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode ముత్యాలు తన భర్తలతో పాటు విరూపాక్షి విజయాంబిక భర్త స్వామీజీ అయిన రఘునంద స్వామి దగ్గరకు వెళ్తారు. విజయాంబిక గురించి మాట్లాడుతారు. విజయాంబికను ఎవరో పెట్రోల్ పోసి తగలబెడితే నేనే కాపాడాను అని తిట్టుకుంటాడు. ఇక విరూపాక్షికి మీకు నేను ఏం సాయం చేయాలో చెప్పమని అడుగుతారు.

విరూపాక్షి: ఏం లేదు అన్నయ్య ఆ విజయాంబికకు దేవుడి తగిన శిక్ష వేసి దెయ్యం పట్టేలా చేశాడు. ఆ దెయ్యాన్ని విడిపించడానికి వెళ్లిన భూత వైద్యుడు అది దెయ్యంకాదు మానసిక రోగమని దాన్ని నయం చేయాలి అంటే మీరే దిక్కు అని చెప్పారు అందుకే దీపక్ మిమల్ని తీసుకెళ్లడానికి వస్తున్నాడు.
రఘునంద: ఓ ఈ నాన్న కోసం ఎప్పుడూ రాని వాడు అమ్మకోసం నాన్న దగ్గరకు వస్తున్నాడా.
విరూపాక్షి: అవును అన్నయ్య ఎలా అయినా మీరే విజయాంబికలో మార్పు తీసుకురావాలి. 
దీపక్: దీపక్‌ని చూసి విరూపాక్షి వాళ్లు దాక్కుంటారు. దీపక్ తండ్రి కాళ్లు పట్టుకొని నాన్న అమ్మని మీరే కాపాడాలి.
రఘు: పైకి లేరా మనుషులు తప్పు చేస్తే దేవుడి శిక్షిస్తాడు నేను మంచిని కాపాడుతాను కానీ చెడుని కాదు.
దీపక్: నాన్న అలా అనొద్దు ఈ ఒక్కసారికి మీరు అమ్మని కాపాడండి ఇంకెప్పుడు అమ్మ తప్పు చేయకుండా నేను చూసుకుంటా.
రఘు: సరే వస్తాను నువ్వు పైకి లే. ఇక్కడే ఉండు నేను వస్తా. విరూపాక్షి వాళ్లతో మీరేం కంగారు పడకండమ్మా ఆ విజయాంబికను నేను గాడిలో పెడతాను.
విజయాంబిక: అమ్మా అబ్బా నేను అసలు లేచే స్థితిలో ఉండుంటే ఆ భూత వైద్యుడిని చంపేసే దాన్ని.
రూప: రాజు ఇదంతా మనమే చేశామని గుర్తు పట్టేస్తారా.
రాజు: అంత లేదు అమ్మాయిగారు ఇంత మంది గుర్తు పట్టలేదు ఆయన మాత్రం ఎలా గుర్తుపడతారు.

రఘు ఇంటికి వస్తారు. సూర్యప్రతాప్, చంద్రలతో పాటు అందర్ని రఘు పలకరిస్తారు. అందరూ రఘుని కూడా పలకరిస్తారు. మందారం మామయ్య ఆశీర్వాదం తీసుకుంటుంది. బాబు గురించి రఘు అడిగితే మందారం తన పుట్టింటిలో ఉందని చెప్తుంది. దాంతో రఘు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే పెరగాలి అని అంటారు. ఇక జీవన్ ఆశీర్వాదం తీసుకుంటే ఎవరు అని అడుగుతారు పింకీ భర్తని అని జీవన్ చెప్తాడు. దాంతో రఘు చాలా తప్పు చేశారు బావగారు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటారు. ఇక రఘు రూప, రాజుల వైపు చూసి విషయం తెలుసిపోయిందన్నట్లు చిన్నగా నవ్వుతారు. ఇక విజయాంబిక దగ్గరకు వెళ్లి ఏమైంది నీకు అని అడుగుతారు.

విజయాంబిక: నాకేం కాలేదు వీళ్లకే పిచ్చి పట్టినట్లు ఉంది. నేను ఏదో అరటి తొక్క మీద కాలు వేసి జారి పడ్డాను అంతే. డాక్టర్ వచ్చాడు ఇంజక్షన్ వేశాడు. మళ్లీ డాక్టర్‌కి ఏమైందో తెలీదు నా మానసిక స్థితి బాలేదు అన్నాడు. తర్వాత భూత వైద్యుడు వచ్చాడు ఇదిగో ఒళ్లు హూనం అయినట్లు కొట్టాడు. నేను ఎంత చెప్పినా ఆపలేదు. వీళ్లంతా దగ్గరుండి కొట్టించారు.
దీపక్: మనసులో ఇదేంటి భూత వైద్యుడు వచ్చినప్పుడు ఇలా లేదు నిజంగా నాన్న దగ్గర పవర్స్ ఉన్నాయేమో.

రఘు విజయాంబికని చూసి కీళ్లు పట్టుకుపోయాయి.. నరాలు బిగుసుకుపోయావని వాటిని సరిచేస్తే లేచి పరుగెడుతుందని అంటారు. ఇక మందారంతో మాసిన బట్టలు ఉతకడానికి రెడీ చేయమని, హాల్ తుడవడానికి బట్ట పెట్టమని కిచెన్‌లో సామాను తోమడానికి సిద్ధం చేయమని అంటారు. వాటితో వైద్యం చేస్తానని అంటారు. రఘు శిష్యులు విజయాంబికని హాల్‌లోకి తీసుకొస్తారు.  ఇక రఘు రూప, రాజులతో ఎందుకు చేశారు ఇదంతా అని ఇదంతా మీరే చేశారని నాకు అర్థమైందని కానీ మంచి పనే చేశారని అంటాడు. మీరు విజయాంబికను పిచ్చిదాన్ని చేశారు ఆ పిచ్చి నేను తగ్గిస్తానని అంటాడు. ఇక విజయాంబికతో కండరాలు కదిలించాలి కీళ్లు కదపాలి అని క్లాత్‌తో ఇళ్లంతా తుడవమని అంటారు.

విజయాంబిక నోరెళ్ల బెడుతుంది. విజయాంబిక చేతులు పట్లు విరిచి మెడ తిప్పి సరిచేసి ఇప్పుడు ఇళ్లు తుడువని చెప్తారు. విజయాంబిక తుడుస్తుంది. అక్క పని చేయడంతో సూర్య చూసి బాధ పడతాడు. రూప, రాజులు నవ్వుకుంటే రఘు వాళ్లని చూసి చిరునవ్వు విసురుతాడు. విజయాంబిక ఇళ్లు తుడిచి, సామాను తోమి, బట్టలు ఉతుకుతుంది. అందరూ చూస్తూ ఉంటారు. ఇక నా వల్ల కాదు అని విజయాంబిక నడుచుకుంటూ వచ్చి కూర్చొంటుంది. దాంతో దీపక్ అమ్మ నీకు తగ్గిపోయింది నడిచి కూర్చొన్నావ్ అంటాడు. ఇక రఘు విజయాంబికతో అందరి కోసం టీ పెట్టి తీసుకురా అని చెప్తాడు. రఘు దీపక్‌తో ఇకనైనా మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అన్నీ జబ్బులు వైద్యంతో నయం కావు కొన్ని చావుతో నయం అవుతాయని అంటాడు. విజయాంబిక టీ తీసుకొస్తే అందరికీ ఇవ్వమని రఘు చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: అసలు నువ్వు ఎవరు? నన్ను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు: త్రినేత్రికి విశాల్ ప్రశ్నలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Embed widget