Ammayi garu Serial Today November 15th: అమ్మాయి గారు సీరియల్: విజయాంబిక మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన రౌడీలు.. ఫస్ట్‌నైట్ ఆపే ఆలోచనలో రూప, రాజులు!
Ammayi garu Today Episode విజయాంబికను మందారం అనుకొని రౌడీలు మూట కట్టి కాల్చేయాలని పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబిక, దీపక్‌లు సూర్య ప్రతాప్‌ని చంపడం గురించి మాట్లాడుతారు. అదే టైంలో మందారం అక్కడికి రావడంతో మందారం వినేసిందేమో అని మందారాన్ని చంపేద్దామని చెప్పి దీపక్ మందారం తల మీద కొట్టేస్తాడు. రౌడీలను పిలిచి మందారాన్ని చంపేయమని చెప్తాడు. ఫోన్‌లు స్విఛ్ ఆఫ్ చేయమని అంటాడు.
మందారం లేచి ఏమైందని అనుకొని బయటకు వెళ్తుంది. మందారాన్ని దాచిన గదిలోకి విజయాంబిక వెళ్తుంది. దాంతో రౌడీలు దీపక్ చంపమన్నది తననే అనుకొని విజయాంబికను మూటలో కట్టి తీసుకెళ్లిపోతారు. ఇక దీపక్ గదిలో మందారం లేకపోవడంతో మందారాన్నే తీసుకెళ్లిపోయారని సంబర పడతాడు. ఇక తన తల్లి కోసం వెతుకుతూ మందారాన్ని చూసి షాక్ అయిపోతాడు. మందారం ఇక్కడుంది ఉంటే రౌడీలు మూటలో తీసుకెళ్లింది ఎవర్ని అని అనుకుంటాడు. మందారం తూగుతూ సూర్య వాళ్ల దగ్గరకు వచ్చి ఎవరో తల మీద కొట్టినట్లు అయిందని తర్వాత ఏం జరిగిందో తెలీడం లేదని అంటుంది. దీపక్ తల్లి కోసం వెతుకుతూ సూర్య వాళ్ల దగ్గరకు వచ్చి మమ్మీ కనిపించడం లేదని చెప్తాడు.
రౌడీలు విజయాంబికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మూటని కింద పడేసి విజయాంబిక మీద పెట్రోల్ పోస్తారు. విజయాంబిక నోటికి ప్లాస్టర్ పెట్టడంతో ఎంత కదిలినా వాళ్లకి విజయాంబిక అని తెలీదు. విజయాంబిక ఉన్న మూటపై పెట్రోల్ పోసి నిప్పు పెడతారు. కాలిపోతుండగా ఇంతలో ముగ్గురు సాధువులు వచ్చి మూట మీద నీరు పోస్తారు. రౌడీలను కొడతారు. విజయాంబిక ఉన్న మూటని సాధువుగా మారిని విజయాంబిక భర్త తన శిష్యులతో చెప్పి మూట విప్పిస్తారు.
మందారాన్ని తీసుకురమ్మంటే నన్ను తెస్తారా అని విజయాంబిక అనడంతో సాధువుగా ఉన్న విజయాంబిక భర్త విజయాంబికను కొట్టి నువ్వు ఇంకా మారలేదా మనిషిని చంపాలి అని ఎలా అనుకుంటావని తిడతాడు. నువ్వు అని తెలీక మంటలు ఆర్పాను కానీ నువ్వు అని తెలిసుంటే ఇలా చేసేవాడిని కాదని ఆయన అంటాడు. నేను రావడం రెండు నిమిషాలు లేట్ అయింటే నీ బతుకు బుగ్గిపాలు అయ్యుండేదని అంటాడు. ఇక విజయాంబిక కోసం అందరూ రాత్రి వరకు గుడిలో వెతుకుతూ ఉంటారు. ఇంతలో విజయాంబిక వస్తుంది. మొక్కు తీర్చుకోవడానికి వెళ్లానని చెప్తుంది.
ఇక విజయాంబిక కొడుకుతో సమయానికి మీ నాన్న వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది లేదంటే ఈ అమ్మ నీకు ఉండేది కాదురా అని అంటుంది. మరోవైపు ముత్యాలు అందరూ విరూపాక్షి అమ్మగారిని కాపడటానికి ప్రాణాలకు తెగించారని అంటుంది. సూర్యలో మార్పు వచ్చిందని విరూపాక్షి సంతోషిస్తుంది. అందరి కంటే ముందు విజయాంబికలో మార్పు రావాలని అప్పలనాయుడు అంటాడు. మరోవైపు రూప, రాజులు విరూపాక్షికి ఎలా ఉందో అని టెన్షన్ పడతారు. ఇద్దరూ విరూపాక్షి గురించి టెన్షన్ పడటం చూసిన మందారం విరూపాక్షికి కాల్ చేస్తుంది. మీకు బాలేదు కాబట్టి ఫస్ట్ నైట్ జరుపుకోకూడదని అంటున్నారని మందారం విరూపాక్షితో చెప్తుంది.
దాంతో అలా ఏం వద్దని నా ఆరోగ్యం బాగుందని చెప్పమని అంటుంది. దాంతో మందారం వెళ్లి అమ్మగారి ఆరోగ్యం బాగుందని చెప్తుంది. ఫస్ట్ నైట్‌కి రెడీ అవ్వమని అంటుంది. నీకు ఎలా తెలుసని రాజు, రూపలు మందారాన్ని అడుగుతారు. ఆ ఇంట్లో వాళ్లు ఎవరైనా నీతో మాట్లాడుతున్నారా అని అంటే లేదని పనిమనిషి చెప్పిందని అంటుంది. ఇక ముత్యాలు వాళ్లతో రూప, రాజుల ఫస్ట్ నైట్ గురించి విరూపాక్షి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షిని కాటేసిన పాము.. బయటపడ్డ సూర్య ప్రేమ.. మందారం తల పగలగొట్టిన దీపక్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

