Ammayi garu Serial Today March 28th: అమ్మాయి గారు సీరియల్: మాధవి మూలికల కుట్ర రాజు, రూపలు కనిపెడతారా.. సూర్య మీద ప్లవర్‌వాజ్ విసిరేసిన దీపక్!
Ammayi garu Today Episode జీవన్ ఇచ్చిన ఫైల్ మీద సూర్య సంతకం పెట్టే టైంకి దీపక్ ప్లవర్ వాజ్ పడేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి సీఎం సూర్యప్రతాప్‌కి ఫైల్ మీద సంతకం పెట్టమని అంటుంది. ఆ ఫౌండేషన్‌కి సంబంధించి ఈ రోజే కార్యక్రమం జరిపిస్తానని ప్రజలకు మాట ఇచ్చానని విరూపాక్షి చెప్తుంది. సూర్యప్రతాప్ మాధవితో ఆ ఫైల్ తీసుకొని చెక్ చేసి ఇవ్వమని అంటాడు. మాధవి ఫైల్ తీసుకుంటుంది. విరూపాక్షి కూతురితో పాటు అందరికి కూడా ఉగాది పచ్చడి ఇస్తుంది.
సుమ మందారంతో కింద పడిన పచ్చడి క్లీన్ చేయమని అంటుంది. విజయాంబిక, దీపక్‌లు విరూపాక్షి చేయనున్ను భూమి పూజ ఆపాలని అనుకుంటారు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ దీపక్ పైకి చూసి ప్లవర్ వాజ్ కింద కూర్చొన్న సూర్య ప్రతాప్ మీద పడేస్తానని తల్లితో చెప్తాడు. ఐడియా అదిరిపోయిందని విజయాంబిక కొడుకుని పొగిడేస్తుంది. ఇక మాధవి విరూపాక్షి ఇచ్చిన ఫైల్‌లో జీవన్ ఇచ్చిన ఫైల్‌లోని పేపర్లు పెట్టేస్తుంది. ఫైల్ తీసుకొని సూర్యప్రతాప్‌కి ఇస్తుంది. సూర్యప్రతాప్ విరూపాక్షితో ఇంకెప్పుడు సంతకాలు అని ఫైల్స్ తీసుకొని ఇంటికి రావొద్దని ఏదైనా ఉంటే పార్టీ ఆఫీస్‌లో చూసుకోమని చెప్పి సంతకాలు పెడతాడు. మాధవి పెట్టిన పేపర్ల మీద కూడా సంతకం పెట్టే టైంకి దీపక్ పూల కుండీ తోసేస్తాడు. ప్లవర్ వాజ్ వెళ్లి సూర్యప్రతాప్ చేయి మీద పడుతుంది. సూర్యప్రతాప్ విలవిల్లాడిపోతాడు. పైన చూస్తే దీపు ఉండటంతో అందరూ దీపు ఆడుకుంటూ తోసేశాడని అందరూ అనుకుంటారు.
విరూపాక్షి వల్లే ఇదంతా జరిగిందని విజయాంబిక విరూపాక్షిని తిడుతుంది. ఇళ్లు కాబట్టి పూల కుండీ పడింది బయట అయితే తలచుకుంటే భయంగా ఉందని అంటుంది. సూర్యప్రతాప్ చంద్రతో వీళ్లు ఎవరూ మనతో రావొద్దు మనం మాత్రమే హాస్పిటల్‌కి వెళ్దామని చెప్పి విరూపాక్షిని వెళ్లిపోమంటాడు. విరూపాక్షి వెళ్లిపోతుంది. సూర్యప్రతాప్ ఫైల్ మాధవికి ఇచ్చి తన రూంలో పెట్టమంటాడు. సరిగ్గా సంతకం పెట్టే టైంకి ఇలా ఎలా జరిగింది అని మాధవి అనుకుంటే మేమే చేశాం అని దీపక్ చెప్తాడు. మాధవి (రాధిక) గొప్ప పని చేశారని జీవన్ ప్లాన్ చెప్తుంది. విజయాంబిక, దీపక్‌లు షాక్ అయిపోతారు. మరోవైపు దీపు ఆడుకుంటూ మాధవి హ్యాండ్ బ్యాగ్ పడేస్తాడు. మందారం, రాజు, రూపలు అక్కడికి వస్తారు. మాధవి బ్యాగ్‌లో వేరు ముక్కలు రాజు చూసి ఏవో మూలికలు అని అనుకుంటాడు. మాధవి బ్యాగ్‌లో ఎందుకు ఉన్నాయని అనుకొని అడగటానికి వెళ్తారు. మాధవి వశీకరణ గురించి కూడా చెప్తుంది.
విజయాంబిక మాధవితో ఇంకా ఆ మూలికలు ఉన్నాయా అని అడిగితే రాజు, రూపలు వచ్చి మా దగ్గర ఉన్నాయని చెప్తారు. ముగ్గురు షాక్ అయిపోతారు. నా పని అయిపోయిందని మాధవి భయపడుతుంది. మాధవిని మూలికలు గురించి అడిగితే నాకు తెలీదు అంటుంది. నీ బ్యాగ్‌లో ఉన్నాయని రాజు చెప్పగానే నాకు ఉన్న ఓ సమస్యకి ఒకరు ఇచ్చారని చెప్తుంది. దాంతో రూప వాళ్లు నమ్మేస్తారు. ఇక రాజు వీళ్లతో నీకు ఏం పని ఏంటి అని పెద్దయ్య గారి గదిలో వీళ్లకు ఏం పని అని అంటే ఇంట్లో ఉన్న వీళ్లు దూరంగా ఉన్నారు అందుకే వీళ్ల గురించి తెలుసుకుంటున్నానని అని చెప్పి వెళ్లిపోతుంది. వాళ్ల వాలకం చూస్తే మాధవి మాటలకు చెప్పే సమాధానానికి అస్సలు సంబంధం లేదని చెప్తుంది.
రూప, రాజులు ఇద్దరూ మాధవిని అనుమానిస్తారు. దీపక్ మాధవి వశపరుచుకోవడం అన్న మాట గుర్తొచ్చి కింద పడిన పచ్చడి గురించి మందారానికి అడుగుతాడు. బయట పడేశానని చెప్పడంతో బయటకు వెళ్తాడు. ఆ పచ్చడి తినేసి రాధిక వశం అయిపోతానని అనుకుంటాడు. ఇంతలో ఓ గొర్రె వచ్చి ఆ పచ్చడి తింటుంటే దాన్ని తరిమేయాలని చూస్తాడు. గొర్రె మాటలు వినిపించడంతో నువ్వు రేణుక పెళ్లి చేసుకున్న గొర్రెవే కదా అంటాడు. రేణుక నన్ను మోసం చేసిందని గొర్రె మాట్లాడుతుంది. నేను ఈ ఉగాది పచ్చడి తింటే నీకు ఏంట్రా ప్రాబ్లమ్ అని అంటాడు. తర్వాత గొర్రె వచ్చుండాయ్ ఫీలింగ్స్ అని పాటలు పాడుతుంది. వశీకరణ మూలికల ఫలితంగా గొర్రె రేయ్ నా రాధిక ఎక్కడరా రాధిక నా పెళ్లాం అని అంటుంది. గొర్రెకి మూలికలు బాగా పని చేస్తున్నాయని దీపక్ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!





















