Ammayi garu Serial Today June 23rd: అమ్మాయి గారు సీరియల్: రుక్మిణికి పెళ్లి ఫిక్స్ చేసిన సూర్యప్రతాప్.. పెళ్లి కొడుకు చైతన్య బ్యాగ్రౌండ్ ఇదే!
Ammayi garu Today Episode సూర్యప్రతాప్ రుక్మిణికి గతంలో పింకీ కోసం తీసుకొచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి రుక్మిణికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode బంటీ సూర్యప్రతాప్‌లా రెడీ అయి సూర్యప్రతాప్‌లా అందర్ని హడల్ ఎత్తించి అదరగొడతాడు. సూర్యప్రతాప్ బంటీతో గ్రేట్ బంటి బాగా యాక్ట్ చేశావ్ అంటాడు. బంటీ మనసులో నాన్న రుక్మిణి అమ్మకి తాళి కట్టేసుంటే బాగుండేది.. విజయాంబిక నానమ్మ అడ్డుకుంది అని అనుకుంటాడు.
విజయాంబిక బంటీతో నీకు ఈ విషయాలు అన్నీ ఎలా తెలుసు మీ అమ్మే పక్క నుండి ట్రైనింగ్ ఇచ్చినట్లు అన్నీ భలే చేశావ్ అంటే మా అమ్మ నాకు అన్నీ చెప్పుకుంది కానీ నాకు మా అమ్మ లేదు మా తాతయ్యకి కూతురు లేదు అందుకే మా తాతయ్యకి అమ్మని గుర్తు చేయాలి అని ఇలా చేశాను.. నేను ఏమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి తాతయ్య అంటాడు. దాంతో సూర్యప్రతాప్ నువ్వు కాదు నేను తప్పు చేశాను బంటీ నాకు నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి అని ఉంది కానీ మీ అమ్మే లేదు అని బాధ పడతారు.
విజయాంబిక తమ్ముడితో ఇప్పుడు అవన్నీ ఎందుకు తమ్ముడు రుక్మిణి ఏదో సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేసింది కదా అది చూద్దాం అని పెన్‌డ్రైవ్ రాజు దగ్గర తీసుకొని దీపక్‌కి ఇచ్చి టీవీకి కనెక్ట్ చేయమని అంటుంది. దీపక్ కుట్రతో తన పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేస్తాడు. రూప సూర్యప్రతాప్‌కి విష్ చేసి కేక్ కట్ చేసినట్లు ఉంటుంది. అది చూసి సూర్యప్రతాప్ ఎమోషనల్ అయిపోతాడు. దీపక్,విజయాంబికలు షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్ రుక్మిణికి థ్యాంక్స్ చెప్తాడు. రుక్మిణిని చేరదీసుకొని ఎమోషనల్ అవుతాడు.
దీపక్, విజయాంబిక అక్కడ నుంచి వెళ్లిపోయి ఎలా వీడియో మారింది అని అనుకుంటారు. ఎలా మారిందో నేను చెప్పనా దీపక్ అని అనుకుంటూ రాజు, రుక్మిణిలు ఎంట్రీ ఇస్తారు. మా అమ్మ గురించి తప్పుడు వీడియో చేయాల్సిన అవసరం వీళ్లకు ఏముంది బావగారు అని రుక్మిణి అడుగుతుంది. విజయాంబిక రుక్మిణితో మీ అమ్మ గురించి మేం ఎందుకు తప్పుడు వీడియో చేస్తాం రుక్మిణి అని విజయాంబిక అంటే మీరు అది చెప్పాలి అని ఇద్దరి చెంపలు పగలగొడుతుంది. ఇక రాజు దీపక్‌తో నువ్వు వీడియో చేయించాలి అని వెళ్లిన వాడు నా ఫ్రెండ్ అని రాజు చెప్తాడు. రాజు, రుక్మిణిలు వెళ్లి వీడియో చేయించిన తర్వాత దీపక్ వెళ్లి విరూపాక్షి, రాఘవల ఫొటోలతో వీడియో చేయించడానికి వెళ్తే అతను నీకు బయటకు వెళ్లి తర్వాత నాకు కాల్ చేసి విషయం చెప్పాడు. నువ్వు చెప్పినట్లే వీడియో చేసి నీకు చూపించి పెన్ డ్రైవ్‌లో మా వీడియో పెట్టాడని అంటారు.
దీపక్ మనసులో వాడిని అంత ఈజీగా వదలను అనుకుంటాడు. రాజు వాళ్లతో మీలో మార్పు వచ్చేలా అతి త్వరలోనే చెప్తా అని అంటాడు. ఇంతలో రుక్మిణిని సూర్యప్రతాప్ పిలుస్తారు. దీపక్‌ని విజయాంబిక తిడుతుంది. కీర్తి అలియాస్ దీప్తి వచ్చి అయిపోయిన దాన్ని వదిలేసి ఇప్పుడేం చేయాలో అది చూద్దాం అని సూర్యప్రతాప్ ఎందుకు రుక్మిణిని పిలిచాడో తెలుసుకుందామని తీసుకెళ్తుంది. సూర్యప్రతాప్ రుక్మిణితో ఈ రోజు నా రూపని గుర్తు చేసి నువ్వు నాకు సర్‌ఫ్రైజ్ ఇచ్చావు కదా ఇప్పుడు నేను నీకు సర్‌ఫ్రైజ్ ఇస్తా అంటారు. ఇంటికి గతంలో పింకీకి చూడటానికి వచ్చిన అబ్బాయితో పాటు అతని ఫ్యామిలీ ఇంటికి వస్తారు. అందరూ వాళ్లని గుర్తు పట్టి వీళ్లు ఎందుకు వచ్చారు అనుకుంటారు.
పింకీని చేసుకోవడానికి వచ్చిన వాళ్లు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని విరూపాక్షి అనుకుంటుంది. పెళ్లి కొడుకు గతంలో జరిగిన విషయాలు తనకి చెప్తాడు. రుక్మిణి తన చిన్న కూతురని పరిచయం చేస్తారు. ఇక ఇంట్లో అందరితో వీళ్లకి ఇక్కడే పెళ్లి పేరుతో అవమానం జరిగింది ఇప్పుడు ఇదే ఇంట్లో వీళ్లకి గౌరవం ఇస్తాను అని అంటాడు. రుక్మిణి మనసులో ఇతే పెళ్లి కొడుకు అని మాత్రం చెప్పకు నాన్న అనుకుంటుంది. ఇంతలో సూర్యప్రతాప్ రుక్మిణితో నిన్ను పెళ్లి చేసుకోమని తనని అడిగానమ్మా సరే అన్నారు అని అంటాడు. సూర్యప్రతాప్ మాటకు రాజు, రూప, విరూపాక్షి, మందారం షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్ చైతన్య గురించి గొప్పగా చెప్తాడు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు సూర్యప్రతాప్‌తో అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోండి.. మళ్లీ పెళ్లిని ఆ రాజు చెడగొడితే ఈ సారి మాకు పరువు పోవడం కాదు ప్రాణాలు పోతాయి అని అంటారు.
రాజు దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడని సూర్యప్రతాప్ అంటారు. విజయాంబిక వాళ్లతో రాజు అడ్డుకోడు ఎందుకంటే మీ పెళ్లితో పాటు రాజు, కీర్తిల పెళ్లి కూడా జరుగుతుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: కోర్టులో ఉత్కంఠ.. లక్ష్మీకి శిక్ష గ్యారెంటీ.. విహారి ఏం చేయనున్నాడు!





















