Ammayi garu Serial Today july 4th: అమ్మాయి గారు సీరియల్: అయ్యో రామ సూర్యకి ఇలా అర్థమైందా.. విజయాంబిక ప్లాన్ బెడిసికొట్టేసిందిగా!
Ammayi garu Today Episode రూప గురించి దీపక్ ఫోన్ ఎక్కడుండో చెప్పడమని విజయాంబిక, దీపక్‌లు మందారాన్ని ఇబ్బంది పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రుక్మిణి బంటీతో తాను రూప అని చెప్పడం సూర్యప్రతాప్ వినేస్తారు. విజయాంబిక, దీపక్‌లు సూర్యప్రతాప్‌ని రాజు, రూపల గది దగ్గరకు తీసుకొస్తారు. రాజు, రూపలు సూర్యప్రతాప్‌ని చూసి బిత్తరపోతారు. విజయాంబిక, దీపక్‌లు ఇద్దరూ దొరికిపోయారు అనుకుంటారు. రాజు, రూపల పని అయిపోయింది అనుకుంటారు. కానీ సూర్యప్రతాప్ మాత్రం బంటీతో మీ అమ్మానాన్నలు చెప్తుంది నిజం అని అంటారు.
రాజు, రూపలతో పాటు తల్లీకొడుకులు కూడా షాక్ అయిపోతారు. ఏంటి తాతయ్య మీరు చెప్పేది అని బంటీ అంటే ఈ రోజు నుంచి ఈ అమ్మే మీ అమ్మ రూప అని అంటారు. సూర్యప్రతాప్ రుక్మిణితో నీ మంచి మనసు అర్థం చేసుకోలేకపోయా రుక్మిణిలా ఉన్న నువ్వు రూపలా మా అందరి కోసం నీ ఐడెంటిటీ కూడా మార్చుకువాలి అంటే నువ్వు చాలా గొప్పదానివమ్మా అంటారు. విజయాంబిక కొడుకుతో ఇదేంట్రా ఇలా అర్థం చేసుకున్నాడు మీ మామయ్య కళ్ల ముందు నిజం ఉన్నా గుర్తించడం లేదని అంటుంది.
విజయాంబిక మందారాన్ని చూసి అసలు ఇదంతా మందారం వల్లే జరిగింది అని ఫోన్ తీసుకోవడం తల్లీకొడుకుల్ని కొట్టడం గుర్తు చేసుకుంటారు. మనం అంటే వణికిపోయే మందారం ఇలా మనల్ని కొట్టింది అంటే ఈజీ కాదు మునుపటి భయం పుట్టిస్తా అని మందారం దగ్గరకు వెళ్తుంది. విజయాంబికను చూసి మందారం చెమటలు పట్టేస్తుంది. మందారాన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి రూప గురించి చెప్పమని అంటుంది. అమ్మాయి గారు చనిపోయారు కదా అని మందారం అంటే చెంప పగల గొట్టి నన్ను కనెత్తి చూడటానికి భయపడే నువ్వు నన్నే కొడతావా అని మందారాన్ని భయపెడుతుంది. దీపక్ ఫోన్ గురించి అడుగుతుంది. మిమల్ని కొట్టింది నేనే కానీ మీఫోన్ గురించి తెలీదు అని మందారం అంటుంది. ఇద్దరి మీద ప్రమాణం చేస్తే విజయాంబిక మందారం గొంతు పట్టి నలిపేస్తుంది. ఫోన్ గురించి అడుగుతుంది.
మందారాన్ని తల్లి చంపేస్తుందేమో అని దీపక్ ఆపుతాడు. ఫోన్ ఎక్కడున్నా తెల్లారేలోపు నా దగ్గర ఉండాలని దీపక్ వార్నింగ్ ఇస్తాడు. ఆ వీడియో చూపించడం వల్లే రూప, విరూపాక్షిల పని పట్టగలం అనుకుంటారు. ఆ ఫోన్ ఇంకా మనకు ఇవ్వలేదు అంటే వీడియో డిలీట్ చేయలేదని అనుకుంటారు. ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టాలని అనుకుంటారు. అదంతా విరూపాక్షి విని ఇంత దారుణానికి ఒడికట్టారా చెప్తా మీపని అని వెళ్లిపోతుంది.
ఉదయం రాజు, రుక్మిణిల సత్యన్నారాయణ వ్రతానికి ఏర్పాట్లు జరుగుతాయి. రాజు, రూపలు రెడీ అవుతారు. అమ్మానాన్నల చేతుల మీదగా మన పెళ్లి జరిగింది వ్రతం జరగబోతుంది చాలా సంతోషంగా ఉందని రూప అంటుంది. మన గురించి నిజం దీపక్ వాళ్లకి తెలిసిపోయింది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని త్వరగా రాఘవని కనిపెట్టాలని అనుకుంటారు. ఇక విరూపాక్షి కూతురు అల్లుడిని చూసి రెడీనా అని అంటుంది. తల్లిని కూడా రెడీ అవ్వమంటే వద్దని ఇప్పటికే సూర్యని చాలా ఇబ్బంది పెట్టాం ఇంక వద్దు అంటుంది. ఇక విజయాంబిక వ్రతాన్ని ఆపాలంటే సూర్యప్రతాప్‌కి గతం గుర్తు చేయాలి అనుకుంటుంది. సూర్యప్రతాప్ చాలా సంతోషంగా ఉంటారు. రాజు, రుక్మిణిలు సంతోషంగా ఉండాలని ఎలాంటి ఆటంకం కలగకుండా వ్రతం జరిగేలా చూడాలి అనుకుంటారు.
విజయాంబిక సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి ఒకప్పుడు నువ్వు ఎలా ఉండే వాడివి ఇప్పుడు ఇలా ఉన్నావ్ అంటే ఎంత మార్పు విరూపాక్షిని కూడా క్షమించేస్తున్నావ్ అంటుంది. సూర్యప్రతాప్ పెద్దగా అరచి నా కంఠంలో ప్రాణం ఉండగా విరూపాక్షిని క్షమించను అంటాడు. నువ్వు విరూపాక్షి కలిసి చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే క్షమించేశావ్ గతం మర్చిపోయావ్ అనిపిస్తుందని సూర్యప్రతాప్‌ని రెచ్చగొడుతుంది. విరూపాక్షిని భార్యగా స్వీకరించలేదు కానీ అన్ని పనులు చేస్తున్నారు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!





















