అన్వేషించండి

Ammayi garu Serial Today july 10th: అమ్మాయి గారు సీరియల్: భర్తకి కాఫీ ఇచ్చిన విరూపాక్షి.. సూర్య ఆగ్రహం.. ఆ సీక్రెట్ డాక్యుమెంట్సేంటి?

Ammayi garu Today Episode విరూపాక్షి సూర్యప్రతాప్‌కి కాఫీ ఇవ్వడం దాన్ని అడ్డుగా పెట్టుకొని తల్లీకొడుకులు గొడవ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షిని ఇరికించాలని విజయాంబిక, దీపక్‌లు వినోద్‌ని ఆపుతారు. అతనితో మీ మేడంని మేం ఇరికించాలని అనుకుంటున్నాం నువ్వు మాకు సహకరించాలని అతన్ని కొనేసి తమ ప్లాన్ చెప్తారు. ఈ ప్లాన్‌తో విరూపాక్షి పని అయిపోతుందని రూప ఎందుకు మనతో పెట్టుకున్నామా అని తల పట్టుకుంటుందని అంటుంది. 

ఆనంద్ రాఘవని వెతికి వెతికి డీలా పడిపోతాడు. రాజు, రూపలు ఆనంద్‌ని కలుస్తారు. మీ ఇద్దరికీ పెళ్లి అయిందని సంతోషంగా ఉన్నానని అంటాడు. రాఘవ గురించి ఏమైనా తెలిసిందా అని రూప అడుగుతుంది. విజయాంబిక గుంట నక్కలా వెయిట్ చేస్తుందని ఏ మాత్రం అవకాశం దొరికినా అమ్మని చెడు చేయాలని చూస్తుందని అంటుంది. రాఘవని వీలైనంత త్వరగా వెతికి తీసుకొస్తానని ఆనంద్ అంటాడు. రాఘవని తీసుకొచ్చి ఆ పాపిష్టిదాన్ని తన్ని తరిమేయాలని రూప అత్తని ఉద్దేశించి అంటుంది. ఇక ఇంట్లో సూర్యప్రతాప్‌ ఫైల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. 

విరూపాక్షి, మందారం బయట నుంచి వస్తారు. విరూపాక్షి మనసులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే సూర్యతో మాట్లాడాలి అనుకుంటుంది. సూర్యప్రతాప్‌ మందారానికి కాఫీ అడుగుతారు. మందారం అక్కడ ఉండదు. విరూపాక్షి కాఫీ అడ్డు పెట్టుకొని మాట్లాడాలి అనుకుంటుంది. సుమ చూసి అక్క బావగారి కోసం కాఫీ చేస్తుందా నిజంగా బావగారు అక్కకి కాఫీ అడుగుంటే అంత కంటే అదృష్టం ఏముందని అనుకుంటుంది. 

విరూపాక్షి సూర్యప్రతాప్‌కి కాఫీ ఇస్తుంది. సూర్యప్రతాప్‌ చూసుకోకుండా కాఫీ తీసుకుంటాడు. కాఫీ టేస్ట్ చూసి విరూపాక్షి అని గుర్తు పట్టి లేచి విరూపాక్షిని కోపంగా చూసి కాఫీ కప్పు విసిరి కొడతాడు. ఇంట్లో ఎవరూ లేరా అని అరుస్తాడు. అప్పటి వరకు విరూపాక్షి కాఫీ ఇవ్వడం చూసి సంతోషపడిన అందరూ ఒక్కసారిగా భయపడతాడు. ప్రాణం పోయిన నీ చేతి నీరు కూడా తాగను అలాంటిది కాఫీ తాగుతానని అనుకున్నావా అని అరుస్తాడు. సూర్యప్రతాప్‌ ఆవేశ పడటంతో రుక్మిణి వచ్చి ఆవేశపడొద్దని అంటుంది. ఇదే అవకాశంగా విజయాంబిక, దీపక్‌లు సూర్యప్రతాప్‌కి ఆరోగ్యం బాలేదని తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి అని అడుగుతారు. 

సూర్యప్రతాప్‌ కోపంగా నీ కోసం తనని ఈ ఇంట్లో ఉండనిచ్చా అంతే కానీ ఆమె మీద ప్రేమతో కాదు అని అంటుంది. విజయాంబిక విరూపాక్షితో రుక్మిణికి పెళ్లి చేశావ్ కదా ఇంకా ఈ ఇంట్లో ఎందుకు అని అంటుంది. దానికి రుక్మిణి నువ్వు కూడా ఎప్పటి నుంచో ఈ ఇంట్లో ఉన్నావు కదా అసలు నీకు ఏ అర్హత ఉంది వెళ్లిపో అని అంటుంది. వాళ్లతో వద్దు అయ్యగారికి తీసుకెళ్లు అని రాజు అంటే గొడవ ఆగిపోతుందేమో అని విజయాంబిక నా తమ్ముడిని వలలో వేసుకోవడానికే కాఫీ ఇచ్చావ్ కదా నీకు వలలో వేసుకోవడం అలవాటే కదా అని సూర్యప్రతాప్‌కి రాఘవని గుర్తు చేస్తుంది. 

రుక్మిణి ఆవేశంతో విజయాంబికను కొడుతుంది. దీపక్ రుక్మిణిని కొట్టబోతే రాజు వచ్చి చేయి పట్టి నా భార్య మీద చేయి వేస్తే ప్రాణం తీస్తా అని అంటాడు. నీ ముఖం చూడటం అన్నా నీ గొంతు వినడం అన్నా నాకు అసహ్యంగా ఉంటుందని సూర్యప్రతాప్‌ అంటాడు. విరూపాక్షి సూర్యతో నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నా ఎన్ని తిడుతున్నా భరిస్తున్నా దానికి ఒక్కటే కారణం నిందించిన వాళ్లు నీ ఎదురుగా ఉన్నా నిందకు కారణం అయిన వాళ్లు నా ఎదురుగా లేరు. వాడు దొరికిన రోజు నిజం నీకే అర్థమవుతుందని అంటుంది. 

రాత్రి విరూపాక్షి పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో వినోద్ వచ్చి డాక్యుమెంట్లు ఇచ్చి సంతకం పెట్టిస్తాడు. తల్లీకొడుకులు తమ ప్లాన్ ప్రకారం మొత్తం జరుగుతుందా లేదా అని చూస్తుంటారు. మందారం వచ్చి డాక్యుమెంట్స్ చదమని అంటుంది. విరూపాక్షి చూస్తుంటే వినోద్ అడ్డుకుంటాడు. విరూపాక్షి సంతకాలు పెట్టేస్తుంది. పేదలకు ఇళ్లు పంపుతానని విరూపాక్షి చాలా సంతోషపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కూతురికి వారసత్వ నగలు! పద్మాక్షి గొడవ చేయడానికి కారణమేంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కూతురికి వారసత్వ నగలు! పద్మాక్షి గొడవ చేయడానికి కారణమేంటి?
Anumita Dutta: గోదావరి సీరియల్ హీరోయిన్ జాను.. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
గోదావరి సీరియల్ హీరోయిన్ జాను.. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
Karthika Deepam 2 Serial Today June 1st: కార్తీకదీపం సీరియల్: సూరజ్ పక్కనే.. సూరజ్ స్టాల్‌లో.. జ్యోత్స్న! కార్తీక్ అలా.. జ్యో ఇలా.. ఇది కదా కావాల్సింది!
కార్తీకదీపం సీరియల్: సూరజ్ పక్కనే.. సూరజ్ స్టాల్‌లో.. జ్యోత్స్న! కార్తీక్ అలా.. జ్యో ఇలా.. ఇది కదా కావాల్సింది!
Godavari Serial Today June 1st: 'గోదావరి' సీరియల్: సూర్య జానుని లవ్ చేస్తున్నాడు అని భువనకి తెలిసిపోయిందా! మురళీ శంకర్ కాళ్లు పట్టడానికి కారణమేంటి?
'గోదావరి' సీరియల్: సూర్య జానుని లవ్ చేస్తున్నాడు అని భువనకి తెలిసిపోయిందా! మురళీ శంకర్ కాళ్లు పట్టడానికి కారణమేంటి?

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
K Annamalai launch new party Tamil Nadu: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Chiranjeevi : నాని మూవీలో మెగాస్టార్... నెక్స్ట్ సినిమాతో లింక్ - శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్?
నాని మూవీలో మెగాస్టార్... నెక్స్ట్ సినిమాతో లింక్ - శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్?
Nandus World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
Bajaj Chetak 2026 Updates: బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?
బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?
Space Science Secretes: ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
Embed widget