Ammayi garu Serial Today January 6th: అమ్మాయి గారు సీరియల్: అరటి తొక్కేసి రాజుని పట్టేసిన రూప.. మళ్లీ జీవన్ ఎంట్రీ.. తల్లీకొడుకులతో కలిసి మరో కుట్ర!
Ammayi garu Today Episode రూప, రాజులను జీవన్ చూసి రాజు బిడ్డ గురించి తెలుసుకొని పగ తీర్చుకోవాలని విజయాంబిక, దీపక్‌లతో మళ్లీ చేతులు కలపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode దీపు రూపతో మమ్మీ నువ్వు డాడీ కలవాలి అని చెప్తాడు. దానికి మనసులో రూప మీ అమ్మ కోసం విడిపోయిన మేం మళ్లీ కలవాలి అంటే ఏదో అద్భుతం జరిగి మీ అమ్మ మళ్లీ బతికి వస్తే కలుస్తా అని అంటుంది. (రూప ఉద్దేశం మళ్లీ ఎప్పటికీ కలవం అని) ఇక రాజు కూడా బంటీకి కథ చెప్పి పడుకోపెడతాడు. ఉదయం రాజు బంటీని స్కూల్‌కి డ్రాప్ చేస్తాడు. బంటీతో పాటు రాజు కూడా స్కూల్‌లోకి వెళ్తాడు. జీవన్ హారతి తనకు పుట్టిన బిడ్డని కూడా అదే స్కూల్‌లో చదివిస్తుంటాడు. జీవన్ రాజుని చూస్తాడు.
జీనవ్: మనసులో.. నా జీవితాన్ని ఎటూ కాకుండా చేసిన ఈ రాజు గాడిని ఏదో ఒకటి చేయాలని చూశాను. కానీ వీడి జాడ తెలీలేదు. ఇన్నాళ్లకి మళ్లీ కనిపించాడు. అయినా రాజు, రూపలు విడిపోయారు కదా మరి ఈ పిల్లడు ఎవరు నాన్న అని రాజుని పిలుస్తున్నాడు. కొంపతీసి రాజు రూపలు విడిపోయారు అన్న విషయం అబద్ధమా ఇంతకీ రూప ఎక్కడ. రూప దీపుని తీసుకొని వస్తుంది. రాజు వచ్చిన ప్లేస్‌కే రూప వచ్చింది అంటే ఇద్దరూ కలిసే ఉన్నారన్నమాట. ఆ పిల్లాడు రాజు రూపల బిడ్డే అయ్యుంటాడు.
రూప: దీపు స్కూల్ వచ్చేసింది దిగు.
దీపు: వచ్చేసిందా మమ్మీ.
జీవన్: మమ్మీనా వీడు ఎవడు మమ్మీ అని పిలుస్తున్నాడు.
రాజు ఫీజు కడతాడు. మేడం సరిగ్గా టైంకి ఫీజు కట్టమని చెప్తారు. దీపు, బంటీ మాట్లాడుకుంటారు. రూప కూడా బంటీతో మాట్లాడుతుంది. బంటీ దీపుతో ఎప్పుడూ స్కూల్‌కి రాకుండా ఉండొద్దని చెప్తాడు. నువ్వు రాకపోతే మా ఫ్రెండ్‌ని కూడా చూడలేకపోతా అనడంతో బంటీ రాకపోయినా నేను అయినా వస్తా అని రూప అంటుంది. దీపు అరటి పండు తింటాను అంటే రూప ఇస్తుంది. తర్వాత దీపు తొక్క అక్కడే పడేయబోతే రూప తీసుకుంటుంది. ఇంతలో రాజుని రూప చూస్తుంది. రాజు తన వైపు వస్తాడు. ఇద్దరూ ఒకర్నిఒకరు చూసుకుంటారు. రూప మనసులో రాజు నిన్ను దూరం పెట్టి తప్పు చేశాను ఇప్పుడు ఇకపై ఆ తప్పు చేయను అని అనుకుంటుంది. జీవన్ ఇద్దరినీ చూసి ఏన్నో ఏళ్ల తర్వాత కలిసినట్లు ఇలా చూసుకుంటున్నారా ఏమైంది అనుకుంటాడు. రూప తన చేతిలో ఉన్న అరటి తొక్కని రాజు కాళ్ల కింద పడేస్తుంది. రాజు పడిపోబోతే పట్టుకుంటుంది. ఒకర్ని ఒకరు చూసుకుంటారు.
రాజు: థ్యాంక్స్
రూప: అవసరం లేదు నీ ప్లేస్‌లో ఎవరు ఉన్నా ఇలాగే కాపాడేదాన్ని (రాజు రూపని ఆబ్దికం రోజు చెరువులో పడకుండా కాపాడినప్పుడు చెప్పిన మాట) అలా అంటానుఅనుకున్నావా రాజు అస్సలు అనుకోవద్దు నిన్ను మాత్రమే ఇలా పట్టుకుంటా. ఎందుకంటే నువ్వు నా కోసం పుట్టిన రాజువి నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. పడిపోతా అని భయపడ్డావా రాజు. నేను ఉండగా నిన్ను ఎలా పడనిస్తాను. రాజు ఒక్కసారి పడ్డాడని విన్నాను. అది నా ప్రేమలో పడినప్పుడు. అలా పడటం నాకు ఓకే కానీ ఇలా పడితే మాత్రం నేను తట్టుకోలేను. రాజు అడుగు వేసేటప్పుడు కాస్త చూసి వేయి నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. రాజు ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. ఈ రోజు అంటే మెకానిక్ పని మీద వచ్చాడు రోజు అంటే కుదరదు కదా మరి ఎలా.
జీవన్: అంటే వీళ్లిద్దరూ విడిగానే ఉన్నారన్నమాట మరి ఒకరు రాజుని నాన్న అంటున్నాడు ఒకరు రూపని మమ్మీ అంటున్నారు. పిల్లలు ఇద్దరూ కలిసి ఉంటున్నారు అసలేం జరిగిందో తెలియాలి అంటే విజయాంబిక, దీపక్‌లను కలవాలి. నా జీవితాన్ని అన్యాయం చేసిన వాళ్లని వదలకూడదు.
దీపక్: ఏంటి జీవన్ ఇన్నేళ్లగా గుర్తురాని మేం ఇప్పుడు గుర్తొచ్చాం నిన్ను కలవాలి అంటే భయంగా ఉంది ఎప్పుడు ఏం చేస్తావో అని.
విజయాంబిక: ఎందుకురా భయం ఇప్పుడు నువ్వు కార్పొరేటర్‌వి.
జీవన్: ఏయ్ ఆపండి. నీ కొడుకు లాంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు నా చెప్పు చేతల్లో ఉన్నారు. మీతో నాకు ఏం పని ఉంటుంది. రాజు, రూపలు గురించి నాకు కొన్ని నిజాలు తెలియాలి. వాళ్ల పిల్లల గురించి నాకు తెలియాలి.
విజయాంబిక: వాళ్లకి అసలు పిల్లలే లేరు.
దీపక్: వాళ్లు విడిపోయి 5 ఏళ్లు అయింది రాజు వేరే పెళ్లి చేసుకోలేదు రూప ఫారెన్ వెళ్లిపోయింది.
జీవన్: మరి రూపని స్కూల్‌లో మమ్మీ అని ఒక పిల్లాడు పిలిచాడు.
దీపక్: వాడు నా కొడుకు.
జీవన్: రాజుకి నాన్న అని ఒక పిల్లాడు పిలుస్తున్నాడు. ఆ పిల్లలు ఇద్దరూ కలిసి మెలసి ఉంటున్నారు. రూప కూడా ఇద్దరు పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుంది. వాడి పేరు బంటీ. దీపక్: మమ్మీ మనం చంపేశాం అనుకున్నా రాజు కొడుకు బతికే ఉన్నాడా.
విజయాంబిక: ఛాన్సే లేదురా ఆ బంటీ ఎవడో. రాజుకి కొడుకు ఉన్న సంగతి నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు.
జీవన్: అయితే వాడి కొడుకు గురించి క్లారిటీగా తెలుసుకోండి. రూప, రాజులు విడిపోయారు అని మీరు అనుకుంటున్నారు కానీ రూప రాజుతో కలవాలి అని తెగ ట్రై చేస్తుంది. అరటి తొక్కలు వేసి మరీ పట్టుకుంటుంది.
విజయాంబిక: మన రూప రాజుకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది అంటే ఇద్దరూ కలిసిపోవడానికి ఎంతో సమయం లేనట్లే.
జీవన్: వాళ్లు ఇద్దరూ కలిసిపోతాం అంటే నేను చూస్తూ ఉంటానా. ముందు ఆ బిడ్డ సంగతి తేల్చండి తర్వాత వాళ్ల సంగతి చూద్దాం.
విరూపాక్షి బంటీ దగ్గరకు వెళ్తే బంటీ విరూపాక్షితో అమ్మగారు నాకు నాన్న ఉన్నాడు. నాన్నకి అమ్మానాన్న ఉన్నారు నీకు ఎవరూ లేరా అమ్మగారు అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఇంట్లో దీప వంటలు.. కాళ్లు మొక్కతా అన్న పారు.. రెస్టారెంట్ పెట్టిస్తానన్న జ్యోత్స్న.. నిజమేనా?