అన్వేషించండి
Ammayi garu Serial Today January 31st: అమ్మాయి గారు సీరియల్: నిశ్చితార్థంలో కుప్పకూలిపోయిన దీపక్.. అడ్డంగా దొరికిపోయిన రాజు.. సూర్య ఏం చేస్తాడో?
Ammayi garu Today Episode రాజు అత్తరు ఇచ్చి దీపక్ మత్తులోకి జారిపోయేలా చేయడం సూర్య రాజుని గమనించి నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

అమ్మాయిగారు సీరియల్ టుడే ఎపిసోడ్
Source : Zee5/YouTube
Ammayi garu Serial Today Episode దీపక్, నిశ్చితార్థం వేడుక జరుగుతూ ఉంటుంది. రాజు పెళ్లి కూతురి ఫ్రెండ్‌గా ముసుగు వేసుకొని వస్తాడు. రూప పక్కనకు వెళ్లి మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే మీరు ఇంత డల్‌గా ఉన్నారేంటి అని అమ్మాయి గొంతులో అడుగుతాడు. దాంతో రూప మీరు మీ పని చూసుకోండి అని అంటుంది. దీపక్ బట్టలు మార్చుకోవడానికి వెళ్తాడు. ఇక లేడీ గెటప్లో ఉన్న రాజు నీరు కావాలని రూపని తీసుకెళ్తాడు.
రాజు: మీది ఎందుకు డల్‌గా ఉంది.
రూప: నేను ఎలా ఉంటే నీకు ఎందుకండీ మీ పని మీరు చూసుకోండి.
రాజు: చెప్పండి.
రూప: ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదండి ఆపేస్తారా.
రాజు: మీకు ఇష్టం లేకపోతే ఆపేస్తా.
రూప: మీరు పెళ్లి కూతురు ఫ్రెండ్ కదా ఎందుకు నా కోసం ఆపుతారు.
రాజు: నాది పెళ్లి కూతురి ఫ్రెండ్ కాదు. నీది మొగుడు. అని ముసుగు తీస్తాడు.
రూప: రాజు నువ్వా. నువ్వు వస్తావా అని టెన్షన్ పడ్డాను. ఈ నిశ్చితార్థం జరగకుండా ఎలా ఆపుతావు రాజు. అందరూ హాల్‌లోనే ఉన్నారు.
రాజు: పెళ్లి కొడుకు లేడు కదా అమ్మాయి గారు. ఈ అత్తరుతో దీపక్‌ని పడగొడతా. ముహూర్తం సమయం దాటితే చాలు.
విజయాంబిక: రూప.. ఇక్కడేం చేస్తున్నావ్అమ్మా.
రూప: వాటర్ అడిగితే ఇస్తున్నా అత్తయ్య.
రాజు తిప్పుకుంటూ తిరుగుతూ దీపక్ దగ్గరకు వెళ్లి తన ఫ్రెండ్ అత్తరు ఇచ్చిందని చెప్పి దీపక్ చేతిలో అత్తరు పెట్టి తిప్పుకుంటూ తిరుగుతూ దీపక్ అత్తరు ఎక్కువ వాసన చూసేలా చేస్తాడు. ఇక విజయాంబిక దీపక్ దగ్గరకు వెళ్లి పెళ్లి కల వచ్చేసిందని చెప్పి దీపక్‌ని తీసుకొస్తుంది. దీపక్, అమ్మాయి ఇద్దరూ పక్కపక్కన కూర్చొంటారు. ఇద్దరి తోనూ పంతులు పూజ చేయిస్తారు. ఇద్దరికి రింగులు ఇచ్చి మార్చుకోమని చెప్తారు. అమ్మాయి దీపక్‌కి రింగ్ పెడుతుంది. దీపక్ అమ్మాయి చేతికి రింగ్ తొడిగే టైంకి మత్తు వచ్చి పడిపోతాడు. అందరూ షాక్ అయిపోతారు. రూప, రాజు నవ్వుకుంటారు.
రూప: అత్తయ్య, నాన్న దీపక్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్దాం. చూడండి నిశ్చితార్థం ఆగిపోయింది మీరంతా వెళ్లిపోండి. అత్తయ్య పదండి దీపక్‌కి హాస్పిటల్‌కి తీసుకెళ్దాం.
సూర్యప్రతాప్: ఆగండి.. ఈ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి వీళ్లేదు. మీలో ఎవరో కావాలనే ఇదంతా ప్లాన్ చేశారని అనిపిస్తుంది. ఇంతలో నమాజు టైం కావడంతో అక్కడే ఉన్న ఓ అమ్మాయి పరుగున వెళ్లి నమాజు చేస్తుంది. బుర్కా వేసుకున్న రాజు మాత్రం అలాగే నిల్చొని ఉండటం సూర్య గమనిస్తాడు. రూప సైగ చేస్తే రాజు అయ్యో అనుకుంటాడు. అప్పుడు పరుగులు తీస్తుండగా సూర్య ఆపుతాడు. మీరు ఎవరు?
విజయాంబిక: తను మన మౌనిక ఫ్రెండ్ తమ్ముడు.
మౌనిక: ఆంటీ తను ఎవరో నాకు తెలీదు. ఆమె మీ తరఫు అనుకున్నా ఆంటీ.
సూర్యప్రతాప్: మర్యాదగా అడుగుతున్నా మీరు ఎవరు? రూపని పిలిచి ముసుగు తీసి ఎవరో చూడు అని చెప్తాడు. చెప్పేది నీకే ఆ ముసుగు తీయ్. ఇంతలో దీపక్ లేస్తాడు. రాజుని చూసి అందరూ షాక్ అవుతారు. నువ్వా. ఎందుకు చేశావ్‌రా ఇలా దీపక్ నిన్ను ఏం అన్యాయం చేశాడు. తీయ్ ముందు ఆ బుర్కా తీయ్. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ సాక్షిగా సంజయ్, సంధ్యల పెళ్లి.. తలోదిక్కూ తలపట్టుకొని ఏడుపు.. సత్యకి నిజం తెలిస్తే!
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ





















