అన్వేషించండి

Ammayi garu Serial Today January 27th: అమ్మాయి గారు సీరియల్: బంటీ తమ కొడుకే అని రూపతో చెప్పిన రాజు.. నిజానిజాలు తెలుసుకున్న ఫ్యామిలీ!

Ammayi garu Today Episode రూప రాజుని నిలదీయడం రాజు బంటీ తన కొడుకే అని చెప్పడం విజయాంబిక చేసిన కుట్రల్ని అందరూ గ్రహించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు ఇంటికి వచ్చిన రూప బంటీ గురించి అందరినీ ప్రశ్నిస్తుంది. ఎవరూ రూపతో ఏం సమాధానం చెప్పరు. బంటీ మనసులో మా ఫ్రెండ్ ఏదోదో అడుగుతుంది.. అందరూ సైలెంట్‌గా ఉన్నారు ఏంటి అని ఆలోచిస్తాడు. 

రూప: అమ్మా ఏంటమ్మా నీకు కూడా చెప్పాలి అనిపించడం లేదా.
విరూపాక్షి: ఏం చెప్పాలి.. ఏమని చెప్పాలి.. అయినా రాజు కొడుకుతో నీకు ఏంటి సంబంధం.
రూప: అదేంటి అమ్మ అలా అంటున్నావ్.
విరూపాక్షి: రాజు కొడుకు గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
రూప: ఏమైంది అమ్మ నీకు మీరంతా నేను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. రాజు నాకు వాళ్లు ఎవరూ సమాధానం చెప్పకపోయినా నువ్వు చెప్పి తీరాలి. రాజు కాలర్ పట్టుకొని ఎవరూ ఈ బంటీ అని అడుగుతుంది. అమ్మా అని బంటీ అడుగుతుంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావ్. చెప్పు రాజు.
పింకీ: ఎవరో అనాథ అని చెప్పారక్క. 
బంటీ: ఏంటి నాన్న నేను అనాథనా.
రాజు: కాదు బంటీ నువ్వు అనాథ కాదు నా కొడుకువి.
రూప: అదే రాజు బంటీ నీ కొడుకు ఎలా అవుతాడు. చెప్పు రాజు. మనకి పుట్టిన బిడ్డ చనిపోయాడు. నీ కొడుకు అని బంటీని అంటున్నావ్. ఒకవేళ ఎవరితోనైనా అక్రమ సంబంధం.. రూప అలా అనగానే రాజు కొట్టేస్తాడు.
రాజు: నాగురించి తెలిసిన మీరు ఇలా మాట్లాడకూడదు.
రూప: మరి ఎలా మాట్లాడాలి రాజు నేను ప్రెగ్నెంట్ అయిన నాటి నుంచి ఒక్క రోజు కూడా నన్ను చూడటానికి రాలేదు. 9 నెలల్లో ఒక్క రోజు కూడా నా ఆరోగ్యం గురించి కానీ మన బిడ్డ ఆరోగ్యం గురించి కూడా నువ్వు రాలేదే. ఆఖరికి మన బిడ్డ పుట్టిన ఇదే రోజు కూడా నువ్వు హాస్పిటల్‌కి రాలేదు. 
విజయాంబిక: దీపక్ మన కొంప మునిగేలా ఉంది జీవన్‌కి కాల్ చేసి రమ్మని. 
ముత్యాలు: మీ ఇంటికి రాకపోవడం ఏంటమ్మా.
పింకీ: వచ్చారు కానీ అక్క ప్రగ్నెంట్ అయిందన్న ఆలోచనతో రాకుండా మందారం చావుకి కారణం అక్క అయిందని డబ్బు కోసం వచ్చారు.
విరూపాక్షి: పింకీ డబ్బు కోసం వచ్చామని నీకు ఎవరు చెప్పారు. ఆ రోజు ఇంటిళ్లపాది వచ్చింది రూప ప్రెగ్నెంట్ అయిందని నువ్వు చెప్పడం వల్లే. ఆ విజయాంబిక దీపక్‌లు గేటు దగ్గర గొడవ చేసి మమల్ని వెనక్కి పంపేశారు.
రూప: అదేంటి అమ్మ అలా చెప్తున్నావ్ మీరు డబ్బు కోసం గొడవ చేస్తున్నారు అని అత్తయ్య, దీపక్ నాన్నకి చెప్పారు. 
అప్పలనాయుడు: అమ్మా అక్కడ ఏదో పొరపాటు జరిగిందమ్మా. మేం వచ్చింది నీ కోసమే పెద్దయ్య గారు మమల్ని గెంటేయమని చెప్పడం మీరు కూడా బయటకు రాకపోవడంతో మళ్లీ ఆ ఇంటి వైపే రాలేకపోయాం. 
పింకీ: రాజు మరి అక్క డెలివరీ టైంలో కూడా నీకు రమ్మని చెప్పాను కదా ఎందుకు రాలేదు.
మల్లేశ్: రాలేదని ఎవరు చెప్పారు బావ వచ్చాడు.
రూప: రాజు వచ్చుంటే నన్ను చూడటానికి వచ్చేవాడివి నా బాధ చూసేవాడివి మన బిడ్డని కాపాడే వాడివి కానీ మనదురదృష్టం మన బాబు చనిపోయాడు.
రాజు: చనిపోలేదు మీరు చంపేశారు. 
రూప: నీకు ఏమైనా పిచ్చి పట్టిందా రాజు ఏ తల్లి అయినా తన బిడ్డని చంపేస్తుందా. ఎముకల విరిగిపోయే అంత నొప్పి భరిస్తుందా. బిడ్డ పుట్టిన తర్వాత అయినా నువ్వు నేను కలుస్తాం అనుకుంటే నేను కన్ను తెరిచేలోపే వాడు కన్ను మూశాడని చెప్పారు. 
రాజు: మరి బిడ్డ ముఖం కూడా చూడటం ఇష్టం లేదని దూరంగా తీసుకెళ్లి పాతి పెట్టేయమని చెప్పడం నేను నా కళ్లారా చూశాను. 
రూప: అయ్యో రాజు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావ్ అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే అని రూప విజయాంబిక చెప్పిన స్టోరీ చెప్తుంది. ఆఖరి చూపు చూడమంటే నా బిడ్డ శవాన్ని చూడటం ఇష్టం లేక అలా చెప్పాను.
రాజు: నిజంగా మీరు బిడ్డని పాతి పెట్టమని చెప్పలేదా.
రూప: లేదు రాజు మన ప్రేమ మీద ఒట్టు వేసి చెప్తున్నా నేను అలా చెప్పలేదు. ఇప్పటికైనా చెప్పు రాజు ఈ బంటీ ఎవరు.
బంటీ: నా మీద ప్రమాణం చేసి చెప్పు నాన్న నేను ఎవరు.
రాజు: నువ్వు నా కొడుకు నేను  నీ తండ్రి.
రూప: చెప్పు రాజు నా మీద ఒట్టు వేసి చెప్పు బంటీ ఎవరు.
రాజు: ఈ బంటీ మన కొడుకే అమ్మాయి గారు. 

రూప షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది. బంటీ రూపతో ఫ్రెండ్ నువ్వు మా అమ్మ అని నాకు తెలియకపోయినా అమ్మలానే చూశావ్ అమ్మ అని పిలవొచ్చా అని అంటాడు. రూప పిలవమని అంటుంది. బంటీ ఎమోషనల్‌గా అమ్మ అనిపిలుస్తాడు. రూప, బంటీ ఒకర్నొ ఒకరు హత్తుకొని ఏడుస్తారు. అందరూ సంతోషంతో కన్నీరు పెట్టుకుంటారు. రాజు కూడా ఏడుస్తాడు. ఇక రూప బిడ్డతో నాకు ఉన్న ఇష్టాలే నీకు ఉన్నా గుర్తించలేకపోయాను అని సారీ చెప్తుంది. ఇక ముత్యాలు, అప్పలనాయుడు రూపకి క్షమాపణ చెప్తే నా భర్త, తల్లే నన్ను అర్థం చేసుకోలేనప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారని అంటుంది. దాంతో రాజు రూపకి సారి చెప్పి దగ్గరకు తీసుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 15th: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?
నువ్వులేక నేను లేను: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?
Illu Illalu Pillalu Serial Today August 15th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన నర్మద! రామరాజు ఇంట్లో లంచం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన నర్మద! రామరాజు ఇంట్లో లంచం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget