Ammayi garu Serial Today January 21st: అమ్మాయి గారు సీరియల్: రూపని ఒంటరిని చేసేసిన సూర్య.. పింకీ కారణంగా తండ్రికి దూరం.. ఇంట్లో గోలగోల!
Ammayi garu Today Episode పింకీ, గోపీలను రాజు ఇంటికి తీసుకురావడం వాళ్లని చూసి సూర్య ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode బంటీని రూప ఇంటికి తీసుకెళ్తుంది. కరెక్ట్‌గా రాజు వాళ్ల దగ్గరకు రూప వెళ్లే టైంకి సూర్యప్రతాప్ రూపకి కాల్ చేసి 5 నిమిషాల్లో నా ముందు ఉండాలని అరుస్తాడు. దాంతో రూప లోపలికి వెళ్లకుండా బంటీని పంపేసి తాను ఇంటికి బయల్దేరుతుంది. పింకీ, గోపీలు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పింకీ, గోపీలకు పింకీ కుటుంబం ఆశీర్వాదం అవసరం అని వాళ్లని తీసుకెళ్లి తీసుకొస్తానని రాజు అంటాడు. పరుగులు తీస్తూ రూప ఇంటికి వస్తుంది. సూర్య చాలా ఆవేశంగా ఉంటాడు.
చంద్ర: అమ్మా రూప పింకీ ఎక్కడ?
సుమ: ఇలా చేశావ్ ఏంటి రూప ఇంత మందిలో బావగారి పరువు ఎందుకు తీశావ్.
సూర్య: చెప్పు రూప అడుగుతున్నది నిన్నే చెప్పు.
రూప: నాన్న అది.
రాజు: నేను చెప్తా. పింకీ, గోపీని పిలుస్తాడు. ఇద్దరినీ దండలతో చూసి అందరూ షాక్ అయిపోతారు.
చంద్ర: అమ్మా పింకీ ఏంటమ్మా నువ్వు చేసింది
సుమ: నీ దారి నువ్వు చూసుకుంటే మేం ఏమైపోతామో అని ఒక్కసారి కూడా ఆలోచించలేదా పింకీ.
విజయాంబిక: ఎవరు ఏమైపోతే తనకేంటి సుమ. తనకి కావాల్సింది ఈ ఇంటి పరువు కాదు ఆ బస్తీ వాళ్ల ప్రేమ.
రాజు: విజయాంబిక గారు మేం పుట్టింది బస్తీలోనే కానీ గుణంలో మాత్రం మీరు అందుకోలేనంత ఎత్తులో ఉంటాం. ప్రేమికుల్ని ఎలా విడదీయాలా అని మేం చూస్తాం ఎలా కలపాలా అని మేం చేస్తాం.
విజయాంబిక: ఒకసారి ప్రేమ పేరుతో రూపని మాయ చేశావ్. ఇప్పుడు అదే ప్రేమ పేరుతో నీ తమ్ముడిని అడ్డు పెట్టుకొని పింకీని తీసుకెళ్లారు. పెళ్లి జరుగుతుంటే వచ్చి ఆడపిల్లని తీసుకెళ్లావ్ నిన్ను ఏమనాలి.
సూర్య: అక్కా ఇంత మోసం చేసిన వాడితో మాటలు ఏంటి వీడిని అని గదిలోకి వెళ్లి గన్ తీసుకొచ్చి రాజుకి గురి పెడతాడు. అందరూ షాక్ అయిపోతారు. చంపేస్తా వీడిని.
రాజు: చంపండి సార్ మీకు ప్రేమ ప్రాణం కంటే పరువు ముఖ్యం మాకు ప్రేమ ముఖ్యం ఆ ప్రేమ విషయంలో ప్రాణాలు పోతాయి అంటే సంతోషంగా ఇచ్చేస్తాం. చంపేయండి సార్.
గోపీ: సార్ ఆగండి మా అన్నయ్య ఇదంతా మా ప్రేమ కోసం చేశాడు అంతగా చంపాలి అనుకుంటే నన్ను చంపండి సార్.
సూర్య: రేయ్ మీ ఇద్దరూ మా పరువు తీయడానికి పుట్టినట్లున్నారురా మిమల్ని వదలను.
పింకీ: అడ్డు వచ్చి వాళ్ల ప్రాణాలు తీసే ముందు నా ప్రాణం తీసేయండి పెద్దనాన్న గోపీ లేకుండా నేను ఉండలేను. నా ప్రేమ అర్థం చేసుకుంటారు అనుకున్నా కానీ మీరు అర్థం చేసుకోలేదు. రాజు అర్థం చేసుకున్నాడు. నేను అడిగితేనే రాజు నన్ను తీసుకెళ్లాడు పెద్దనాన్న.
రాజు పింకీతో ఎవరికీ చంపడానికి నేను ఇక్కడికి తీసుకురాలేదు మీకు ఆశీర్వాదం ఇప్పించాలి అని తీసుకొచ్చా వెళ్లి ఆశీర్వాదం తీసుకోండి అని అంటాడు. సూర్య వద్దని అవసరం లేదని తన కుటుంబాన్ని నాశనం చేసిన రాజుని వదలను అని కాల్చబోతే రూప అడ్డు వెళ్తుంది. విషయం మొత్తం తానే రాజుకి చెప్పానని ఈ పెళ్లి జరగడానికి తాను కారణం అని రూప చెప్తుంది. పింకీని తీసుకెళ్లడానికి తానే సాయం చేశానని రూప చెప్తుంది. మాటిచ్చి మీరే మోసం చేశారని తండ్రిగా తప్పు చేశారని రాజు సూర్య మీద తిరగబడతాడు. ఇక విజయాంబిక సూర్యతో ఇదంతా వీడి ధైర్యం కాదు విరూపాక్షి వెనకుండి నడిపిస్తుందని అంటుంది. పింకీని విరూపాక్షి కూతురిలా భావించి ఉంటే ఈ పెళ్లి చేయకుండా మన ఇంటికి పంపేవాళ్లని అంటుంది.
విరూపాక్షి గురించి సూర్యకి నూరిపోస్తుంది. సూర్య కోపంతో ఆ దరిద్రం వల్ల ఇంటికి దరిద్రం పట్టిందని రూప జీవితంలా పింకీ జీవితం నాశనం అయిందని రాజుతో చేతులు కలిపి ఈ కుటుంబ పరువు తీశావని రూపతో అంటాడు. నీ దృష్టిలో నేను బతికున్న శవాన్ని అని రూపతో సూర్య అంటాడు. ఈ రోజుతో నాన్న అనే హక్కు రూప కోల్పోయిందని పెద్దనాన్నని కాదని పెళ్లి చేసుకున్నందుకు పెద్ద నాన్న చనిపోయాడని పింకీతో చెప్తాడు. సూర్య ఆవేశంగా వెళ్లిపోతాడు. రాజు గోపీ పింకీలను తీసుకెళ్లిపోతాడు. రూప తండ్రి మాటలు తలచు కొని షాక్లో ఉండిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మరోసారి కన్నతండ్రిని చంపడానికి ప్రయత్నించిన జ్యోత్స్న.. ఉలిక్కిపాటు.. దీపకి అనుమానం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

