అన్వేషించండి

Ammayi garu Serial Today February 4th: అమ్మాయి గారు సీరియల్: అత్తాబావల్ని గమ్‌తో ముప్పుతిప్పుల పెట్టేసిన రూప.. ఫుల్ కామెడీ!

Ammayi garu Today Episode రూప రాజుకి బెయిల్ ఇచ్చిన విషయం గురించి సూర్యకి చెల్లి తగిలించడంతో సూర్యప్రతాప్ కూతుర్ని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 Ammayi garu Serial Today Episode రూప ఇంట్లో లేదని రూపనే రాజుని బెయిల్ మీద తీసుకొచ్చిందని విజయాంబిక, దీపక్‌లు సూర్యప్రతాప్‌ని రెచ్చగొడతారు. రూపనే ఇలా చేసుంటే ఇంట్లోకి రానివ్వనని సూర్య ప్రతాప్ అంటాడు. రూప పని అయిపోయిందని విజయాంబిక అనుకుంటుంది. ఇంతలో మేడ మీద నుంచి రూప కిందకి దిగుతుంది. తల్లీకొడుకులు షాక్ అయిపోతారు. సుమ రిలాక్స్ అయిపోతుంది.

రూప: పిన్ని తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టిస్తావా.
సుమ: రా రూప పెట్టిస్తాను.
సూర్యప్రతాప్: ఆగు.. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావ్.
రూప: నేను ఎక్కడికి వెళ్తాను ఇంట్లోనే ఉన్నాను కదా నాన్న.
సూర్యప్రతాప్: ఇంట్లోనే ఉంటే ఎవరికీ కనిపించకుండా ఎక్కడున్నావ్.
రూప: ఎవరికైనా ఎందుకు కనిపించాలి నాన్న మీకు ఎదురు పడితే మీరు తల తిప్పుకొని వెళ్లిపోతారు. అత్తయ్యా దీపక్‌లు వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారు. పిన్ని, బాబాయ్‌లు పింకీ విషయంలో నేను చేసిన పనికి నా మీద కోపంగా ఉన్నారు. 
సుమ: మనసులో పింకీ విషయంలో నువ్వు చేసిన పనికి మాకు కోపం లేదు రూప. కానీ నువ్వు చేసిన పద్ధతికి కోపంగా ఉంది. ఏది ఏమైనా అక్కడ అది సంతోషంగా ఉంటుందని ధైర్యంగా ఉంది.
రూప: అలా అందరూ అన్ని కారణాలతో నాకు దూరంగా ఉంటే నేను మాత్రం అందరికీ దగ్గరగా ఎలా ఉండను నాన్న. 
సుమ: వదిన గారు ఒకరి మీద కంప్లైంట్ చేసినప్పుడు పూర్తిగా తెలుసుకొని చేయండి.
విజయాంబిక: నేను చూశాను సుమ.
సూర్యప్రతాప్: చాల్లే ఆపు అక్క కాసేపు రూప కనిపించకపోయే సరికి  ఏదో కొంపలు అంటుకుపోయేలా రాద్ధాంతం చేస్తున్నారు. అయినా రూప కనిపించకపోతే మీకు నష్టం ఏంటి. ఆ రాజు చేసిన తప్పు తెలుసుకుంటే చాలా వాడు జైలులోనే ఉండాల్సిన అవసరం లేదు. దీపక్ నువ్వేం టెన్షన్ పడకు నీ పెళ్లి జరుగుతుంది. నేను ఉన్నాను.
రూప: మనసులో నన్ను క్షమించండి నాన్న, ఈ పెళ్లి మేం జరగనివ్వం.

రూప గదిలోకి వెళ్లి కిటికీ నుంచి ఏం ప్రాబ్లమ్ లేదని రాజుకి చెప్తుంది. తర్వాత రాజు వెళ్లిపోతాడు. రూప అక్కడ ఉండటం విజయాంబికలు చూస్తారు. ఎందుకు వచ్చారని రూప అడిగితే తలనొప్పి అన్నావ్ ఎలా ఉందని అడుగుదామని వచ్చానని అంటుంది. బయట కారిడార్‌లో ఉన్నానని రూప చెప్తుంది. ఇక తల్లీకొడుకులు రాజు బయటకు రాకపోయి ఉంటే బాగుండేది అని అనుకుంటారు. మందారం గురించి టెన్షన్‌గా ఉందని దీపక్ అంటాడు. రాజుతో ఉండాల్సిన నేను రాజుకి కొడుకుకి దూరంగా ఉంటున్నాను అని రూప ఏడుస్తుంది. విజయాంబిక, దీపక్‌లు పెళ్లి అయిన వరకు మన వంట మనమే చేసుకుందాం ఎవరినీ నమ్మకూడదని విజయాంబిక అంటుంది. ఆ మాటలు రూప వినేస్తుంది.

విజయాంబిక కిచెన్ గదిలోకి వెళ్లి ఉప్మా చేస్తుంటుంది. విజయాంబిక బయటకు వెళ్లగానే రూప ఉప్మాలో పెవికిక్ కలిపేస్తుంది. తల్లీకొడుకులు ఉప్మా నోటిలో పెట్టగానే స్పూన్‌తో నోటిలో ఉండి మూతి అంటుకుంటుంది. ఇద్దరూ ఒకరి స్పూన్ ఒకరు లాక్కొని తెగ తిప్పలు పడతారు. ఎంతకీ నోటి నుంచి స్పూన్ రాదు. సూర్యప్రతాప్ రావడం చూసిన రూప ఇద్దరి దగ్గరకి వెళ్లి ఏమైందని అడుగుతుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. చంద్ర, రూపలు ఎంత లాగినా స్పూన్లు రావు. రూప చాక్ ఇచ్చి రెండు పెదవులు మధ్య కోసేద్దామని అంటుంది. తల్లీకొడుకులు బిత్తరపోతారు. ఇక సుమ వేడి వేడి నీరు తీసుకొస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget