అన్వేషించండి

Ammayi garu Serial Today February 12th: అమ్మాయి గారు సీరియల్: తల్లీకొడుకుల ప్లాన్ తిప్పికొట్టిన రూప.. మందారం గతం గుర్తించిన స్వామీజీ!

Ammayi garu Today Episode మందారాన్ని నయం చేస్తానని విజయాంబిక భర్త వచ్చి సూర్యప్రతాప్‌తో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్‌కి మౌనిక కాఫీ ఇస్తే దీపక్ కడుపు నొప్పి అని గిలగిలా కొట్టుకుంటాడు. రూప వచ్చి ఇప్పుడెలా ఉందని సెటైర్లు వేస్తుంది. తీర్థం పేరుతో మందారానికి విషం తాగించినప్పుడు ఆ బాధ మీకు లేదా అని అంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్ అని విజయాంబిక అడిగితే తీర్థం పేరుతో మీరు తీసుకొచ్చిన విషం గురించి నేను వినేశానని ముగ్గురికి రూప షాక్ ఇస్తుంది. 

రూప: మీకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనా. మీరు మందారానికి తాగించిన తీర్థంలో విషం లేదు. అది నేనే మార్చేశాను. దీపక్ తాగిన కాఫీలో విషం ఉంది. అది తెలియకుండా మీరు కోరు తెచ్చుకున్న కోడలే కాఫీ కలిపి ఇచ్చింది.
దీపక్: మమ్మీ నేను చచ్చిపోతున్నా మమ్మీ.
విజయాంబిక: ఎంత పని చేశావే తమ్ముడికి చెప్పి నీ సంగతి తేల్చుతా తమ్ముడు. 
రూప: ఏమని చెప్తావ్ అత్తయ్య మందారానికి విషం తాగించబోయిన సంగతి చెప్తావా. భయపడకండి అత్తయ్య దీపక్ తాగిన కాఫీలో విషం లేదు. మోషన్ ట్యాబ్లెట్ కలిపాను అంతే. 
సూర్యప్రతాప్‌: అక్క ఏమైంది అక్క.
విజయాంబిక: ఏం లేదు తమ్ముడు దీపక్ నీరసంగా ఉంటే పిలిచాను.
రూప: మందారం త్వరగా కోలుకోవాలని దీపక్ ఉపవాసం ఉన్నాడంట నాన్న. మందారం జోలికి వస్తే ఏమవుతుందో అర్థమైందా రాజా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి లేదంటే ఈ ఇంట్లో మంచి నీళ్లు కూడా తాగడానికి భయపడేలా చేస్తా.
రాజు: అమ్మాయి గారి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశా. మందారాన్ని అమ్మాయిగారే చంపేశారని నేను చాలా మాటలు అనేశా. మందారం బతికుందో లేదో చూడకుండా చితికి నిప్పు పెట్టిన నాది ఇంకా పెద్ద తప్పు. అమ్మాయిగారి తప్పు ఏం లేదని రుజువు చేయడానికే మందారం బతికింది. అసలు మందారాన్ని చంపాలి అనుకున్నది ఎవరో తెలుసుకోవాలి.
రూప: రాజు అత్తయ్య వాళ్లు మందారాన్ని చంపాలని ప్లాన్ చేశారు. నిజం రాజు. మందారం కోసం పూజలు అభిషేకాలు చేయించినట్లు నమ్మించి తీర్థం, ప్రసాదాల పేరుతో విషం పెట్టబోయారు. ప్రస్తుతానికి నేను కాపాడాను కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయంగా ఉంది రాజు.
రాజు: పెద్దయ్య గారి సమక్షంలో ఇలా అయితే ఆ రోజు కూడా వీళ్లు మందారాన్ని చంపాలి అనుకుని ఉంటారు అమ్మాయిగారు. అమ్మాయి గారు మందారాన్ని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అని తన ప్లాన్ చెప్తాడు. 
రూప: సరే రాజు ఆ పని చేద్దాం.
విజయాంబిక: మన ప్రయత్నం ఈసారి సక్సెస్ అయితే ఆ దేవుడే దిగి వచ్చినా మందారం చావు ఆపలేడు.

ఇంతలో ఇంటికి విజయాంబిక భర్త స్వామీజీ వస్తారు. విజయాంబిక, దీపక్ షాక్ అయిపోతారు. ఈయన వచ్చారేంటి అనుకుంటారు. స్వామీజీ దీపక్ తండ్రి అని తెలుసుకున్న మౌనిక షాక్ అయిపోతుంది. మందారం బతికుందని తెలిసి నేరుగా ఇక్కడికే వచ్చానని స్వామీజీ అంటారు. ఇక రూప దీపుని తాతయ్యకి పరిచయం చేస్తుంది. ఇక మందారాం దగ్గరకు స్వామీజీని తీసుకెళ్తుంది. మందారం దుస్థితి సూర్యప్రతాప్ స్వామీజీకి చెప్తారు. ఇక దీపు తాతయ్య అమ్మని మామూలు మనిషిని చేయండి అని వేడుకుంటాడు. స్వామీజీ మందారం తల మీద చేయి వేసి తన దివ్యదృష్టితో మందారాన్ని పొడిచి చంపాలని ప్రయత్నించింది దీపక్, విజయాంబికలే అని గుర్తిస్తారు. భార్యాకొడుకుని సీరియస్‌గా చూస్తారు. మందారం కచ్చితంగా కోలుకుంటుందని కోలుకునేలా నేనే చేస్తానని అంటాడు. ఏం చేసి అయినా మందారాన్ని బాగు చేస్తానని మందారానికి ఈ దుస్థితి పట్టడానికి కారణం అయిన వాళ్లని శిక్షించి తీరాలని మాట ఇవ్వమని సూర్యప్రతాప్‌ని అడుగుతారు స్వామిజీ. సూర్యప్రతాప్ వాళ్లు ఎంతటి వారైనా వదిలిపెట్టనని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: అమ్మాయి గారు సీరియల్: కోడలికి విషం ఇస్తే కొడుకు నొప్పులు పడుతున్నాడేంటి? విజయాంబికకు ఇది షాకే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Embed widget