Ammayi garu Serial Today December 9th: అమ్మాయి గారు సీరియల్: నిజం తెలియడంతో రెచ్చిపోతున్న జీవన్.. ఆచి తూచి అడుగేస్తున్న ఫ్యామిలీ.. శ్వేత ఎంట్రీ ఎప్పుడో?
Ammayi garu Today Episode పింకీ విషయంలో ఆచితూచి నిజం రాబట్టాలని సూర్యప్రతాప్ రాజు, రూపలతో చెప్పి ఏం జరిగినా తనకు చెప్పమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode హారతి బిడ్డకు తండ్రిని నేనే హారతిని ఉంచుకుంటూ పింకీ బిడ్డకు తండ్రి అవుతా అని జీవన్ ఇంట్లో వాళ్లతో చెప్తాడు. దాంతో సూర్యప్రతాప్ ఆవేశంగా నువ్వొక చీడపురుగురా నిన్ను ప్రాణాలతో వదలను అని గన్ తీసుకొచ్చి చంపేస్తా అని జీవన్‌కి గురి పెడతాడు. దాంతో జీవన్ నన్ను కాల్చే ముందు మీ కూతురి నుదిట కుంకుమ చూడండి.. నన్ను చంపేసి మీ కూతురిని విధవని చేయండని అంటాడు. పింకీ, చంద్ర మాత్రం వాడిని చంపేయ్ అంటారు. కానీ సూర్యప్రతాప్ గన్ దించేస్తాడు.
ఇంతలో రూప వెళ్లి తండ్రి చేతిలో గన్ తీసుకొని మా పింకీకి అన్యాయం చేస్తావా అని కాల్చబోతే సూర్యప్రతాప్ ఆపుతాడు. రూపని ఆవేశ పడొద్దని ఆ రోజు పింకీ విషయంలో ఏం జరిగిందో జీవన్‌కి మాత్రమే తెలుసని వీడిని చంపేస్తే సాక్షి చనిపోతాడని అంటారు.
సూర్యప్రతాప్: ఆ రోజు పింకీ మత్తులోకి వెళ్లిన తర్వాత నువ్వు భర్తగా మారడానికి మధ్యలో ఏం జరిగిందో దాని బట్టే నీ భవిష్యత్ ఉంటుంది అది గుర్తు పెట్టుకో.
జీవన్: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.
విజయాంబిక: దీపక్ ఆ రోజు ఏం జరిగిందో మనకు అవసరం లేదు కానీ మనల్ని ఎందుకు ఇలా ఇరికించాడో అడిగి తెలుసుకుందాం పద. అని ఇద్దరూ మమల్ని ఎందుకు మోసం చేశావని నిలదీస్తారు.
జీవన్: దీపక్ నేను హారతి ప్రేమించుకున్న మాట నిజమే కానీ నేను ప్రేమించిన హారతిని నువ్వు లైన్‌లోకి దింపావ్.
విజయాంబిక: అదంతా నీ ప్లానే అని తెలుసుకోలేనంత వెర్రి వాళ్లం కాదు జీవన్. మాతో ఆడుకోవడానికి హారతిని అడ్డుపెట్టుకున్నావ్. ఇంట్లో వాళ్లతో ఆడుకోవడానికి పింకీని అడ్డు పెట్టుకున్నావ్.
జీవన్: అంతే లేదు విజయాంబిక గారు మీ దీపక్ ఎలాంటి వాడో మీకు తెలీదా.
విజయాంబిక: అవకాశం ఉంటే దీపక్‌ని ఇరికించి హారతిని నాకు అంటగట్టాలని అనుకున్నావ్.
దీపక్: మమ్మీ వీడిని అనవసరంగా చేతులు కలిపాం వీడి గురించి చెప్పేద్దాం.
దీపక్, విజయాంబిక సూర్యప్రతాప్‌కి చెప్పడానికి వెళ్లుంటే ఇంట్లో బాంబ్ అటాక్‌నా, మావోయిస్టుల దాడా అని తల్లీకొడుకులు నోరు ఎత్తకుండా చేసేస్తాడు. అనవసరంగా ఇరుక్కుపోయామని విజయాంబిక వాళ్లు అనుకుంటారు. సూర్యప్రతాప్ జీవన్ గురించి ఆలోచిస్తుంటే రూప, రాజులు వెళ్లి గోపి, పింకీ విషయం చెప్పనందుకు సారీ చెప్తారు. పింకీ సమస్య పరిష్కరిస్తామని అంటారు. దానికి సూర్యప్రతాప్ మీ విషయంలో మీరు చేసిన తప్పే పింకీ విషయంలోనూ చేశారని అంటారు. మీ సమస్యలు మీరే పరిష్కరించుకుంటామని చెప్పి లేనిపోని ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు పింకీ విషయంలో అదే జరిగిందని అంటాడు. జీవన్ ఇప్పుడు రెచ్చిపోయాడని అంటాడు సూర్యప్రతాప్. జీవన్‌ని ఇంటి నుంచి గెంటేద్దామని అంటుంది రూప. కానీ సూర్యప్రతాప్ వద్దంటాడు పింకీ ఆధారాలు వాడి దగ్గర ఉన్నాయి కదా వాటిని సోషల్ మీడియాలో పెట్టే అవకాశం ఉందని అంటాడు. సమస్య నేనే పరిష్కరిస్తానని ఇకపై పింకీ, నీ విషయంలో ఏం జరిగినా దాయొద్దని చెప్తాడు. సరే అని చెప్పి రూప, రాజులు వెళ్లిపోతారు.
పింకీ తండ్రి ఒడిలో పడుకొని నేను తప్పు చేశాను అంటే ఎవరూ నమ్మడం లేదు నన్ను ఏం అనడం లేదని అంటే దానికి చంద్ర నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నుంచి నాకు తెలుసు ఎవడో నీ మీద నిందలు వేస్తే ఎలా నమ్మేస్తాం అని అంటాడు. ఇంతలో సుమ వచ్చి పింకీకి భోజనం తీసుకొని వస్తుంది. చంద్ర కూతురికి గోరు ముద్దలు తినిపిస్తాడు. నీ కష్టం వస్తే మాకు చెప్పుకోవాలి కానీ సూసైడ్ చేసుకోవడం ఏంటమ్మా అని అంటారు. ఎలాంటి సమస్యలు అయినా ఈ అమ్మానాన్నలు నీకు తోడుగా ఉంటారని అంటాడు. ప్రాబ్లమ్ క్లియర్ అయిన వరకు జీవన్‌తో జాగ్రత్తగా ఉండమని సుమ కూతురితో చెప్తుంది. ఉదయం అందరూ హాల్‌లో కూర్చొని ఉంటారు. జీవన్ తీరికగా వచ్చి దెబ్బకు అందరి నోరులు మూయించానని అంటాడు. పింకీకి కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: ఫింగర్ ఫ్రింట్స్‌తో పట్టించే ప్రయత్నం.. చిట్టి పాప రాకతో ఏదో జరిగిందే?