అన్వేషించండి

Ammayi garu Serial Today December 6th: అమ్మాయి గారు సీరియల్: అదిరిపోయిన డ్రామా.. హారతి బిడ్డకు జీవనే తండ్రి అని తెలిసిపోయిందిగా.. సీఎం ఏం చేస్తారోమరి!

Ammayi garu Today Episode హారతి బిడ్డకు జీవనే తండ్రి అని తెలియడంతో సూర్యప్రతాప్ జీవన్‌ని కోప్పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు కాళ్లకి గాయం అవ్వడంతో అపురూప ఫస్ట్‌ఎయిడ్ చేస్తుంది. రాజు పడిపోబోతుంటే పట్టుకుంటుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసికుంటారు. ఇక రూప రాజు చేతిని తన భుజం మీద వేసుకొని నడిపిస్తుంది. మరోవైపు జీవన్, హారతిలు ఎవరూ చూడకుండా దేవుడికి దండం పెట్టుకుంటారు. జీవన్ నన్ను పెళ్లి చేసుకునేలా చేయమని హారతి కోరుకుంటుంది. ఇక జీవన్ హారతిలు కలిసి ఉండగా ఒక వైపు నుంచి సూర్యప్రతాప్‌ వాళ్లు మరోవైపు ముత్యాలు వాళ్లు ఇంకో వైపు రూప, రాజులు ఉంటారు. దాంతో తప్పించుకోలేక జీవన్, హారతిలు పంతులు కాళ్ల మీద పడిపోతారు. 

ఇక అందరూ దీపాలు విడిచి పెట్టడానికి వెళ్తారు. జీవన్ హారతిని వెళ్లిపోమంటే నేను దీపాలు వదలాలని హారతి అంటుంది. దాంతో జీవన్ నాకు దూరంగా ఉండమని చెప్తాడు. అందరూ దీపాలు కొలనులో విడిచిపెట్టడానికి వెళ్తారు. ముత్యాలు, విరూపాక్షిలు ఓ వైపు విడిచిపెడితే రూప వాళ్లు వస్తారు. రూప, రాజులను చూసి రాజు తల్లిదండ్రులు మురిసిపోతారు. ఇంతలో డాక్టర్‌ రాజుకి కాల్ చేసి డీఎన్‌ఏ రిపోర్ట్స్ తీసుకొని బయల్దేరానని అంటే రాజు డాక్టర్‌ని శివాలయానికి రమ్మని చెప్తాడు. ఇక ఆ విషయం సూర్యప్రతాప్‌కి చెప్తాడు. 

దీపక్: మనసులో రాజు రూపలు చెప్పినట్లు జీవనే హారతి బిడ్డ తండ్రి అని తేలాలి అప్పుడు చెప్తా వాడి సంగతి. 
జీవన్: మనసులో రాని రాని డీఎన్‌ఏ రిపోర్ట్స్‌తో వీళ్లందరికీ నా మీద అనుమానం పోతుంది. అప్పుడు ఆ ఇంట్లో మహారాజులా ఉండొచ్చు. రాక్షసుడిలా మారి అందరికీ ముప్పుతిప్పలు పెట్టొచ్చు. 
పింకీ: దీపం వదులుతూ కార్తీకపౌర్ణమి రోజు పెళ్లి కాని ఆడపిల్ల మంచి భర్త రావాలని కోరుకుంటుంది. కానీ నాకు ఊహించని భర్త వచ్చాడు. నా దృష్టిలో అతను భర్త కాదు భర్త అంటే మనసులో ఉండాలి. నా మనసులో గోపీ ఉన్నాడు నా గోపీని నాకు దగ్గర చేసే బాధ్యత నీదే స్వామి.
జీవన్: మనసులో నన్ను అనుమానించి ఇరికించారు నేను మీ కంటే తెలివైన వాడినని మీకు మరి కాసేపట్లో తెలిసిపోతుంది. 

జీవన్ రూపని కొలనులోకి తోసేయాలని రూప కాళ్లలో కాలు పెడితే రూప పడిపోబోతే రాజు పట్టుకుంటాడు. రాజు జాగ్రత్త చెప్తే నా పక్కన నువ్వుఉంటే నాకు ఏం కాదని రూప అంటుంది. ఇంతలో హారతి కూడా బిడ్డను ఎత్తుకొని దీపాలు పట్టుకొని వస్తుంది. సూర్యప్రతాప్‌ని విష్ చేస్తుంది. రూప హారతితో నువ్వేం బాధ పడకు హారతి దేవుడు నీకు న్యాయం చేస్తాడని అంటుంది. ఇక హారతి కూడా దీపాలు వదులుతుంది. రిపోర్ట్స్‌లో జీవనే తన బిడ్డకు తండ్రి అని తేలితే అవమానం జరిగినా సరే మేలు జరుగుతుందని నిజం తెలియాలని కోరుకుంటుంది. 

డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి సూర్యప్రతాప్‌కి ఇస్తాడు. జీవన్ రిపోర్ట్స్ తనకు అనుకూలంగా వస్తాయని సంబరంతో నవ్వుకుంటాడు. ఇక డాక్టర్ జీవన్ సాంపిల్స్ హారతి బిడ్డతో మ్యాచ్ అయ్యాయని చెప్తాడు. దాంతో అందరూ షాక్ అయిపోతారు. ఫ్లాష్ బ్యాక్‌లో జీవన్ డబ్బు ఇచ్చి వెళ్లిన తర్వాత డాక్టర్ రాజుకి కాల్ చేస్తాడు. విషయం చెప్తాడు. దాంతో రాజు రిపోర్ట్స్‌లో మార్పులు వద్దని ఎలా వస్తే అలాగే ఉండాలని చెప్తారు. ఇక ముత్యాలు సూర్యప్రతాప్‌ వినేలా సీఎం గారు ఏం న్యాయం చేస్తారో చూద్దాం కట్టుకున్న భార్యకి కన్న కూతురికి కూడా శిక్ష వేసిన సీఎం గారు ఇప్పుడేం చేస్తారో చూద్దాం అని భర్తతో అంటుంది. జీవన్ బిత్తరపోతాడు.

సూర్యప్రతాప్‌ జీవన్ కాలర్ పట్టుకొని చితక్కొడతాడు. నా బిడ్డ మెడలో తాళి కట్టి ఎందుకు నా కూతురి జీవితం నాశనం చేశావని చంద్ర జీవన్‌ని కొడతాడు. సుమ కూడా నీ చెల్లి ఇలా చేస్తే ఊరుకుంటావా అని తిడుతుంది. అందరూ జీవన్ని నీచుడని తిడతారు. విజయాంబిక హారతిని తిడుతుంది. వాడి బిడ్డకి నా కొడుకుని తండ్రిని చేయాలని ప్రయత్నిస్తావా అని తిడుతుంది. నిన్ను తల్లిని చేసింది ఎవరో తెలిసినా ఊరుకున్నావ్ ఇప్పుడు పింకీ మెడలో వాడు తాళి కట్టాడు నీ బతకు ఏంటి అని ప్రశ్నిస్తారు సూర్యప్రతాప్‌. అందరూ గుడిలో రచ్చ ఎందుకని ఇంటికి రమ్మని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: 3 గంటల మ్యాటర్ కనిపెట్టే దిశగా విశాల్.. ఇంతకీ నయని శరీరం ఏ హాస్పిటల్‌లో ఉన్నట్లు?

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 3rd:వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget