Jagadhatri Serial Today August 3rd:వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్
Jagadhatri Serial Today Episode August 3rd:వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. కళ్లు తిరిగి కిందపడిపోయినట్లు జగధాత్రి నటించడంతో కేదార్ ఇంటి పనులు మొత్తం నిషిక,వైజయంతి, ఆదిలక్ష్మీతో చేయిస్తాడు. అప్పుడే శ్రీవల్లి ఇంటి ముందుకు వెళ్లి అరుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది.అందరినీ తీసుకుని బయటకు వెళ్తుంది. అక్కడ వాళ్లకు ఆమె ఏం చూపిస్తుంది. దానివల్ల ఇంట్లో తలెత్తిన వివాదమేంటి..?
జగధాత్రి నాటకం..నిషికకు ఇరకాటం
జగధాత్రి కళ్లు తిరిగి కిందపడిపోయినట్లు నాటకమాడమని కేదార్ చెప్పడంతో ఆమె కళ్లుతిరిగి కిందపడుకుంటుంది.వెంటనే కంగారుపడిన కౌషికి ఆస్పత్రికి తీసుకెళ్తామని హడావుడి చేస్తుంది.సుధాకర్ కూడా కంగారుపడుతుంటే...కేదార్ వాళ్లిద్దరికి సైగ చేసి ఏం లేదని చెబుతాడు. దీంతో ముగ్గురు కలిసి నిషిక, వైజయంతిని ఆడుకుంటారు. జగధాత్రికి జ్యూస్ తీసుకురమ్మని సుధాకర్ నిషికకు చెబుతాడు.అలాగే కిచెన్‌లో ఉన్న గిన్నెలు మొత్తం కడిగివేయమని భార్యతో అంటాడు. ఆ తర్వాత కౌశికి వాళ్ల అత్తను ఇళ్లు తుడిచి బట్ట వేయమని చెబుతుంది. దీంతో అందరూ తిట్టుకుంటూ పనులు చేస్తుంటారు.పాపం వదిలేయమని జగధాత్రి అనగా....కేదార్ నువ్వు అరవకుండా పడుకోమని పడుకోబెడతాడు. జ్యూస్ తీసుకుని వచ్చిన తర్వాత నిషికను టిఫిన్ రెడీ చేయమని కౌషికి చెప్పడంతో నిషిక చచ్చినట్లు వెళ్లి వంటపని చేస్తుంది. అందరూ కలిసి టిఫిన్ చేస్తుండగా....నిషికపై వేడి సాంబార్ వేయడానికి ఆదిలక్ష్మీ ప్రయత్నంచగా...ధాత్రి అడ్డుకుని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
శ్రీవల్లి కేకలు..పరుగెత్తిన కేదార్,ధాత్రి
ఇంటి ముందు ముగ్గువేయడానికి శ్రీవల్లి బయటకు వెళ్లి కేకలు పెట్టుకుంటూ ఇంట్లోకి పరుగులు తీసుకుని వస్తుంది.ఏమైందని అడగ్గా....బయట గోడకు అంటూ చెప్పలేకపోవంతో వెళ్లి అందరూ చూస్తారు. అక్కడ గోడమీద శ్రీవల్లి సుధాకర్ మొదటి భార్య కూతురని ....అందుకే ఆమెను చంపాలని కిడ్నాప్ చేయించాడని పోస్టర్ ఉంటుంది.అది చూసిన అందరికీ పట్టరానికోపం వస్తుంది. యువరాజు ఈ పని చేసినవాళ్లను వదిలిపెట్టనని అంటాడు. ఎవరు ఈపని చేసి ఉంటారని సుధాకర్ గట్టిగా నిలదీయడంతో నిషిక చేసి ఉండొచ్చని ఆదిలక్ష్మీ అంటుంది.ప్రమాదపూర్తిగా నాకు ఏ పాపం తెలియదని ఆమె కావాలనే ఇలా చెబుతుందని నిషిక అంటుంది.అయినా ఇలాంటి పనిచేస్తే పోయేది మన ఇంటి పరువేనని నాకు తెలియదా అని అంటుంది. అంటే శ్రీవల్లి నిజంగానే మామయ్యగారి కూతురు అయి ఉండొచ్చని....ఈ విషయం తెలిసిన వాళ్లే ఇలా చేసి ఉంటారని జగధాత్రి అంటుంది. ఆమాటలు విన్న కేదార్ అంటే శ్రీవల్లి నా చెల్లెలు అన్నమాట అని దగ్గరకు తీసుకుంటాడు.దీంతో వైజయంతి గట్టిగా అరుస్తుంది. అసలు ఇప్పటికే చస్తుంటే...మళ్లీ మీ ఇద్దరి ఎమోషనల్ డ్రామాలు ఏంటని అంటుంది. శ్రీవల్లి పుట్టుక గురించి నాకు తప్ప మరెవ్వరికీ తెలియదని....ఆ అమ్మి మీ బాబాయి కూతురు కాదని కౌషికితో చెబుతుంది. ఇంతకు మించి నన్ను ఏమీ అడగొద్దని అంటుంది.
శ్రీవల్లి తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్
ఇన్నాళ్లు నువ్వు శ్రీవల్లిని కూతురిలా చూడకపోయినా...నేను కన్న కూతురిలాగే భావించానని..కానీ ఇప్పుడు ఈ విషయం ఇంటి పరువు వరకు చేరింది కాబట్టి నువ్వు వెంటనే శ్రీవల్లి తండ్రి ఎవరో చెప్పి అతన్ని ఇక్కడికి తీసుకురమ్మని సుధాకర్ అంటాడు. ఇన్నాళ్లు నువ్వు ఈ విషయం గురించి చెప్పకపోయినా...నేను భరించానని కానీ ఇప్పుడు శ్రీవల్లి తండ్రి వస్తే తప్ప ఈ సమస్యకు ముగింపు పలకడం కుదరదని అంటాడు. కాబట్టి నువ్వు శ్రీవల్లి తండ్రి ఎక్కడ ఉన్నాడో తీసుకురమ్మని అంటాడు.దీంతో వైజయంతికి ఏం చేయాలో అర్థంకాదు. నువ్వు శ్రీవల్లి తండ్రిని తీసుకొచ్చి నా పరువు కాపాడకుంటే నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతానని చెప్పి సుధాకర్ వెళ్లిపోతాడు.
వైజయంతి ఏడుస్తూ మేడమీదకు వెళ్లగా....వెనక యువరాజు, నిషిక కూడా వెళ్తారు. ఆయన చేసిన తప్పులన్నీ నామీద వేసుకుని కాపాడుతుంటే...ఇప్పుడు మీనాన్న చూశావా ఏం మాట్లాడుతున్నాడోనని అంటుంది.లేని మొగుడిని నేను ఎక్కడ నుంచి తీసుకురావాలని అంటుంది. శ్రీవల్లి వాళ్ల నాన్నను తీసుకురాకపోయినా చంపుతాడు. శ్రీవల్లి నీ కూతురేనని చెప్పినా చంపుతాడు....ఇప్పుడు నేను ఏం చేసేదిరా దేవుడా అని ఏడుస్తుంది. వెంటనే యువరాజు జరిగిన విషయం మొత్తం పాపారాయుడు మామయ్యకు చెబుతాడు.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















